India

Devara Daavudi Son in Theatres: దేవ‌ర అభిమానుల‌కు గుడ్ న్యూస్, రేప‌టి నుంచి థియేట‌ర్ల‌లోకి దావూదీ సాంగ్

VNS

ఎన్టీఆర్ క‌థానాయకుడిగా వ‌చ్చిన దేవ‌ర (Devara) చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు పెడుతుంది. ఫ‌స్ట్ రోజే రూ.172 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.243 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. అయితే ఆదివారం వీకెండ్‌తో రూ.300 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ.393 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్‌ను కూడా కంప్లీట్ చేసుకుంది.

Andhra Pradesh: ఏలూరు జిల్లాలో కొడవలితో యువతిపై దాడికి యత్నించిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొడవలితో నడి రోడ్డులో ఓ యువకుడు హల్ చల్ చేశాడు.కొడవలితో యువతి పై దాడికి యత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అయితే దీనికి ప్రేమ వ్యహారం కారణమా లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, లేటు వయసులో పెళ్లి చేసుకున్న భర్తకు షాకిచ్చిన భార్య, తన ఇంటికి తీసుకెళ్లకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు

Hazarath Reddy

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లి గ్రామంలో పెళ్లైన పదిహేను రోజులకే భర్తకు ఓ భార్య బిగ్ షాకిచ్చింది. భీమవరంలో పెళ్లి చేసుకున్న అతను తన భార్యను తన స్వగ్రామానికి తీసుకొచ్చాడు. అయితే ఆమె పెళ్లి అయిన తర్వాత అత్తారింట్లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంది.

Road Accident Video: వీడియో ఇదిగో, ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ప‌నుల నుంచి తిరిగి వ‌స్తున్న కూలీల ట్రాక్ట‌ర్‌ను వెన‌క నుంచి ఢీకొట్టిన లారీ

Hazarath Reddy

ప‌ల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ప‌నుల నుంచి తిరిగి వ‌స్తున్న కూలీల ట్రాక్ట‌ర్‌ను వెన‌క నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర‌గాయాలు అయ్యాయి.

Advertisement

Pawan Kalyan on Sanatana Dharma: సనాతన ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా రెడీ, తిరుపతి వారాహి సభలో గర్జించిన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌కు పరోక్ష హెచ్చరిక!

Hazarath Reddy

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.

SC on Marital Rape: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం, సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడి

Hazarath Reddy

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.ఇప్పటికే తగినన్ని శిక్షలు ఉన్నాయని, కానీ ఇది మాత్రం చట్టబద్దమైన అంశానికి మించిన సామాజిక సమస్య అని పేర్కొంది. ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వెల్లడించింది

Mahesh Babu on Konda Surekha Comments: కూతురుకు తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఈ వ్యాఖ్యలు ఎంతో బాధించాయి, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో మహేశ్ బాబు

Hazarath Reddy

నాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే హీరోలు స్పందించగా తాజాగా నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు

Russian TikToker Dies: వీడియో ఇదిగో, టిక్ టాక్ వీడియో చేస్తూ బిల్డింగ్ మీద నుంచి పడి యువతి మృతి, పుర్రె పగలడంతో సహా తీవ్ర గాయాలతో తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

రష్యన్ టిక్‌టోకర్ అరినా గ్లాజునోవా, 27, జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో విషాదకరంగా మరణించింది. గ్లాజునోవా స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ, బ్యాలెన్స్ కోల్పోయి, ప్రాణాపాయ స్థితిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

Konda Surekha vs KTR: కేసీఆర్‌ని చంపి పూడ్చి పెట్టాడేమోనని కేటీఆర్ మీద డౌట్‌గా ఉంది, మరోసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పదవీ కాంక్షతో కేసీఆర్‌ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం సాగుతోందని మంత్రి కొండా సురేఖ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు.

Etela Rajendar vs Revanth Reddy: శభాష్ రేవంత్ రెడ్డి అని ఎవరైనా అంటే నేను రాజకీయాలు వదిలేస్తా, తెలంగాణ ముఖ్యమంత్రికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్

Hazarath Reddy

చైత‌న్య‌పురి లాంటి కాల‌నీల‌కు పోదామా? ఎవ‌రైనా శ‌భాష్ రేవంత్‌రెడ్డి అంటే నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పి ముక్కు నేల‌కు రాస్తాను అని మ‌ల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.

Konda Surekha On KTR: కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్, కేసీఆర్‌ కనబడట్లేదు..కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడనే అనుమానం ఉందన్న సురేఖ..వీడియో ఇదిగో

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరోసారి సంచలన కామెంట్ చేశారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో అని అనుమానంగా ఉందని ఆరోపించారు సురేఖ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Isha Foundation Row: ఈషా ఫౌండేష‌న్‌పై చర్యలు ఆపండి, తమిళనాడుల పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 14కు వాయిదా

Hazarath Reddy

కోయంబ‌త్తూరులోని ఈషా ఫౌండేష‌న్ ఆశ్ర‌మంలో(Isha Foundation Row) ఉన్న త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌కు బ్రెయిన్‌వాష్ చేశార‌ని, దాంతో వాళ్లు ఇంటికి రావ‌డం లేద‌ని ఓ తండ్రి దాఖ‌లు చేసిన పిటీష‌న్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని ఈషా పౌండేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

Advertisement

Congress Leader Jhansi Reddy Injured: కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు, షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో తీవ్ర గాయాలు

Arun Charagonda

షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో కాంగ్రెస్‌ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే ఝాన్సీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.

CM Revanth Reddy On Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా?, దానిని కూల్చాలా వద్దా? అని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి..పేదలను రక్షణ కవచాలుగా పెట్టుకుని నాటాకాలా అని ఆగ్రహం

Arun Charagonda

హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్.....జన్వాడ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నించారు. హరీశ్ రావు....అజీజ్ నగర్ లో ఉన్న నీ ఫాంహౌస్ అక్రమ నిర్మాణం కాదా ? దాన్ని కూల్చాలా ? వద్దా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Pawan Kalyan Health Update: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, తిరుమల మెట్లు ఎక్కిన త‌ర్వాత తీవ్ర అస్వ‌స్థ‌త‌, వారాహి స‌భ‌లో పాల్గొంటారని తెలిపిన శ్రేణులు

Hazarath Reddy

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు తిరుమల మెట్లు ఎక్కిన త‌ర్వాత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆ సమయంలో ఆయ‌న‌ వెన్నునొప్పితో బాధపడ్డారు

Bathukamma Song On Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్..

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి మీద బతుకమ్మ పాట పాడారు మూసీ బాధితులు. హైదరాబాద్ ఎల్బీనగర్ - చైతన్యపురిలో 'రేవంత్ సారూ ఉయ్యాలో.. మా ఇళ్ల జోలికి రాకు ఉయ్యాలో' అంటూ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు మూసీ బాధితులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Accident Caught on Camera: వీడియో ఇదిగో, రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లుతున్న అమ్మాయిలపై దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Hazarath Reddy

కర్ణాటకలోని మంగళూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలపై కారు దూసుకు వెళ్ళింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకరు మరణించగా, మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jagan Meeting With YSRCP Leaders: 16 నెలల జైలు జీవితంపై జగన్ సంచలన వ్యాఖ్యలు, కేసులు పెట్టడం మినహా వీళ్లు ఏమీ చేయలేరంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్

Hazarath Reddy

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

Minister Sridhar Babu Convoy: మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్‌ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు, వర్గల్ నుండి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం, ఆస్పత్రిలో ముగ్గురు బాధితులకు చికిత్స

Arun Charagonda

కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరగగా.. మరో ఇద్దరికి కాళ్ళు విరిగాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Ludhiana: వీడియో ఇదిగో, కుప్పకూలిన మూడంతస్తుల భవనం, కూతురుని కాపాడుకునేందుకు ఓ తల్లి ప్రయత్నానికి హ్యాట్సాప్

Hazarath Reddy

లూథియానాలోని ఓల్డ్ సిటీ ప్రాంతంలోని చావల్ బజార్ సమీపంలోని బండేయ మొహల్లాలో శతాబ్దపు నాటి, మూడు అంతస్తుల భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది, ఒక మహిళ, ఆమె 2 ఏళ్ల కుమార్తె గాయపడ్డారు. 27 ఏళ్ల ఖుషీగా గుర్తించబడిన మహిళ తన బిడ్డను పడిపోతున్న శిథిలాల నుండి రక్షించడానికి ప్రయత్నించినప్పుడు సిసిటివి ఫుటేజీలో బంధించింది.

Advertisement
Advertisement