India

Delhi Firing: ఢిల్లీలో మరో డాక్టర్ దారుణ హత్య, వైద్యం కోసం వచ్చి తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరు అగంతకులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలోని జైత్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటళ్లలో తమ భద్రతకు భరోసా నివ్వాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ.. మరో డాక్టర్‌ హత్యకు గురయ్యాడు. వైద్యం కోసం వచ్చిన ఇద్దరు యువకులు డాక్టర్‌ను (Doctor Murder) తుపాకీతో కాల్చి చంపారు.

Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖను నాగార్జున లీగల్ నోటీసులు?, న్యాయపోరాటానికి సిద్దమవుతున్న నాగార్జున!

Arun Charagonda

మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యారు నటుడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని వెల్లడించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.

Mobile Phones Addiction: దారుణం, మొబైల్ ఫోన్ లాక్కుందని తల్లిని బ్యాట్‌తో చావబాదిన కొడుకు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

పిల్లలు ఈ కాలంలో మొబైల ఫోన్ ఇవ్వకుంటే ఎంతకైనా తెగించేలా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఓ అబ్బాయి తన తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇది.

Money Laundering Case: హెచ్‌సీఏ మ‌నీలాండ‌రింగ్ కేసు, టీమిండియా మాజీ కెప్టెన అజారుద్దీన్‌కు ఈడీ నోటసులు, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

Hazarath Reddy

హైద‌రాబాద్ క్రికెట్ సంఘంతో లింకున్న మ‌నీలాండ‌రింగ్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌(Azharuddin)కు ఇవాళ ఈడీ నోటీసులు జారీ చేసింది. 2020 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో హెచ్‌సీఏ అధ్య‌క్షుడిగా అజారుద్దీన్ ప‌నిచేశారు.

Advertisement

Konda Surekha Comments Row: సినీ పెద్దలారా మీకు దండం పెడతా...ఈ అంశానికి ముగింపు పలకండన్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్, కొండా క్షమాపణలు చెప్పారన్న కాంగ్రెస్ నేత

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపగా దీనిపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్ గౌడ్. ఇందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు మహేశ్ కుమార్. సినీ పెద్దలారా మీకు దండం పెడతాం ఇక ఆపేయండని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు.. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండని సూచించారు.

Telangana High Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ , సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరణ, ఈ నెల 24న వాదనలు వింటామన్న హైకోర్టు

Arun Charagonda

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హైకోర్టు డివిజన్ బెంచ్ షాకిచ్చింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని తెలిపింది డివిజన్‌ బెంచ్‌.సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేశారు అసెంబ్లీ కార్యదర్శి.

Russian Tik Toker Dies On Camera: రష్యన్ టిక్‌ టాకర్‌ అరినా గ్లాజునోవా మృతి, ప్రమాదవశాత్తూ మెట్లపై నుండి పడిపోవడంతో మృతి

Arun Charagonda

ప్రముఖ రష్యన్ టిక్‌టాకర్ అరినా గ్లాజునోవా(27) ప్రమాద వశాత్తూ మృతి చెందారు. జార్జియాలోని టిబిలిసిలో సోషల్ మీడియా కోసం కంటెంట్‌ను చిత్రీకరిస్తుండగా సబ్‌వే మెట్లపై నుండి పడిపోవడంతో మృతి చెందారు. స్నేహితురాలితో కలిసి రికార్డింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ, పాడుతూ ఉండగా బ్యాలెన్స్ కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయింది. ఆమెకు తలకు తీవ్ర గాయాలు కాగా కొద్దిసేపటికే మృతి చెందారు.

RGV On Konda Surekha: సారీ చెప్పినా మంత్రి కొండా సురేఖని వదలని ఆర్జీవీ, అక్కినేని కుటుంబాన్ని అవమానిస్తారా..సీఎం రేవంత్ స్పందించాలని డిమాండ్ చేసిన వర్మ

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ వివాదంపై స్పందించారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. కొండా మురళి - సురేఖ జీవిత చరిత్ర నేపథ్యంలో కొండా సినిమాను తెరకెక్కించారు వర్మ. అయితే తాజాగా సమంత పై సురేఖ చేసిన వ్యాఖ్యలను తనదైన శైలీలో ఖండించారు.

Advertisement

ED Notices To Azharuddin: కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు, హెచ్‌సీఏలో రూ.20 కోట్ల అవకతవకలపై ఈడీ విచారణ

Arun Charagonda

కాంగ్రెస్ నేత, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగియని అజారుద్దీన్‌కు నోటీసులు ఇచ్చింది.

Jani Master: జానీ మాస్టర్‌కు మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోర్టు, ఈ నెల 6 నుండి 10 వరకు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం

Arun Charagonda

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇప్పటికే జానీ మాస్టర్‌ 14 రోజుల రిమాండ్‌లో పోలీసులు కీలక అంశాలను రాబట్టారు.

Konda Surekha On KTR Legal Notices: కేటీఆర్ లీగల్ నోటీసులపై కొండా సురేఖ , న్యాయపరంగానే ఎదుర్కొంటా...కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి సురేఖ

Arun Charagonda

కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అని తేల్చి చెప్పారు. కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని...ఆయన పంపిన నోటీసులపై లీగల్‌గానే స్పందిస్తానని చెప్పారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు అని.... నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని తెలిపారు కొండా.

Demolition Of Illegal Buildings: మంచిర్యాలలో అక్రమ కట్టాడలపై కొరడాఝుళిపించిన అధికారులు, అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేత...వీడియో

Arun Charagonda

మంచిర్యాల పట్టణంలో అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. మార్కెట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు.

Advertisement

Chiranjeevi On Konda Surekha: అసత్య ఆరోపణలు సరికాదు..వార్తల్లో నిలిచేందుకు ఇంత దారుణంగా మాట్లాడతారా?, చిరంజీవి ఫైర్

Arun Charagonda

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు హీరో చిరంజీవి. సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖల పేర్లు వాడుకుంటున్నారు... దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు చిరంజీవి. అసత్య ఆరోపణలు చేయడం దారుణం.. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు అని సూచించారు.

Goddess Kanaka Durga: నేటి నుండి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ, వజ్రాలతో కూడిన కిరీటాన్ని కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

Arun Charagonda

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇవాళ్టి నుండి వజ్ర కిరీటంతో భక్తులను దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. 2.5 కోట్లతో వజ్రాలు, బంగారంతో చేసిన కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారు అజ్ఞాత భక్తుడు.

2024 ICC Women's T20 World Cup Google Doodle: నేటి నుండి 2024 ICC మహిళల T20 ప్రపంచ కప్, ఆకట్టుకుంటున్న గూగుల్ డూడుల్,అక్టోబర్ 20న ఫైనల్

Arun Charagonda

దుబాయ్ వేదికగా నేటి నుండి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20 వరకు ఈ మెగా టోర్నీ జరగనుండగా యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూప్ లుగా విభజించగా గ్రూప్‌ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్‌ Bలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.

Konda Surekha: సారీ చెప్పిన కొండా సురేఖ, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్, స్వయం శక్తితో ఎదిగిన సమంత అంటే గౌరవం ఉందని ప్రకటన

Arun Charagonda

అక్కినేని నాగచైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు మంత్రి కొండా సురేఖ. అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కొండా సురేఖ.

Advertisement

Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖపై రాహుల్‌ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల, నిరాధారమైన ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించిన జూనియర్ ఎన్టీఆర్

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా సమంత, నాగచైతన్య తీవ్రంగా ఖండించారు.తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక తాజాగా నాగార్జున, అమల, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Konda Surekha Comments Row: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్, ఫైర్ బ్రాండ్‌ని నిద్ర లేపి తన్నించుకుంటున్నారంటున్న కాంగ్రెస్, ఎవరేమన్నారంటే..

Vikas M

సినిమా హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Boat Capsizes in Nigeria: నైజర్‌ నదిలో ఘోర పడవ ప్రమాదం, 100 మంది గల్లంతు, వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన

Vikas M

నైజీరియాలోని నైజర్‌ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 300 మంది ఉన్నారని, ఓ వేడుకకు వెళ్లి వెస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

Bird Flu Kills 47 Tigers: బర్డ్‌ఫ్లూతో 47 పులులుతో పాటుగా మూడు సింహాలు మృతి, వియత్నాంలో తీవ్ర కలకలం రేపుతున్న హెచ్‌5ఎన్‌1 వైరస్

Vikas M

దక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌1) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్‌ బారిన పడి పలు జూలలో 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్‌ మృతిచెందినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్టు వియత్నాం న్యూస్‌ ఏజెన్సీ (VNA) పేర్కొంది

Advertisement
Advertisement