India
Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, బట్టలు కోసం వచ్చి గుండెపోటుతో కుప్పకూలిన కస్టమర్
Hazarath Reddyహార్ట్ ఎటాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్-1 లోని షోరూమ్‌లో బట్టలు తీసుకుంటూ ఉండగా హార్ట్ ఎటాక్ సమస్యతో కిందపడిపోయాడు ప్రవీణ్ గౌడ్ (37). వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
Biggest Drug Bust in Delhi: ఢిల్లీలో అతి పెద్ద డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు, రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్న పోలీసులు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ కలకలం చోటుచేసుకుంది. పోలీసులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన 500 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Man Stabs Bus Conductor: వీడియో ఇదిగో, ఫుట్‌బోర్డు నుంచి పైకి రమ్మన్నందుకు కండక్టర్ మీద కత్తితో దాడి
Hazarath Reddyబెంగుళూరు నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు.
iPhone 16 Pro Max Seized: 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను సీజ్ చేసిన ఢిల్లీ కస్టమ్స్ అధికారులు, అక్రమంగా తరలిస్తున్న మహిళ అరెస్ట్
Hazarath Reddyఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఇటీవల లాంచ్ చేసిన 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Y. S. Avinash Reddy: మేము అధికారంలోకి వస్తాం,కూటమి నేతలు సంగతి అప్పుడు తేలుస్తాం, వైఎస్ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyవైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు కూటమి నేతల పని చెబుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana Horror: వరంగల్‌లో దారుణం, యువతికి బీర్లు తాగించి స్నేహితులు సామూహిక అత్యాచారం, బలవంతంగా కారులో ఎక్కించుకుని..
Hazarath Reddyభూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 15న ఆమె స్వస్థలానికి చెందిన తెలిసిన యువకుడొకరు ఆమె వసతి గృహం వద్దకు వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ ఆమెను కారులో ఎక్కమన్నాడు.
Roja on Pawan Kalyan: తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా
Hazarath Reddyపవన్ ప్రాయశ్చిత్త దీక్షపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు.సుప్రీం కోర్టు వ్యాఖ్యలను పురంధరేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారని మాజీమంత్రి రోజా అన్నారు.
Bhubaneswar Horror: దారుణం, పసిబిడ్డ మెడపై కత్తిపెట్టి తల్లిపై గ్యాంగ్ రేప్, దొంగతనం కోసం వచ్చి కామాంధులైన దొంగలు, పాప కోసం ఏడుస్తూ లొంగిపోయిన మాతృ హృదయం
Hazarath Reddyభువనేశ్వర్‌లో ఓ మహిళపై ఇద్దరు దుండగులు పసిబిడ్డను కత్తితో బందీగా ఉంచి లైంగికంగా వేధించిన ఘటన (Woman Gangraped at Knifepoint) కలకలం రేపింది.
Pune Helicopter Crash Viral Video: మహారాష్ట్ర పుణెలోని బవధాన్ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్. .. ముగ్గురు మృతి..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
sajayaహెలికాప్టర్ పొదల్లో పడి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ దురదృష్టకర సంఘటనలో, బుధవారం ఉదయం పూణెలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణె జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
AP DCM Pawan Kalyan At Tirumala: తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని పిలుపు..
sajayaగత 11 రోజులుగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు.
PM Modi Paid Tribute To Mahatma Gandhi: గాంధీ జయంతి సందర్భంగా జాతిపితకు అంజలి ఘటించిన ప్రధాని మోదీ...గాంధీ మార్గం సదా ఆచరణీయం అని పిలుపు..
sajayaమహాత్మా గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ సర్వమత ప్రార్థనా సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులతో సహా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు.
AP Liquor Policy Notification: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు నోటిఫికేషన్ జారీ, మద్యం షాపుల లైసెన్సుల కోసం నిబంధనలు ఇవే..
sajayaఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది, ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం వ్యాపారాన్ని నియంత్రించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం రెండేళ్ల కాలపరిమితితో వస్తుంది.
Gandhi Jayanti 2024 Wishes In Telugu: గాంధీ జయంతి సందర్భంగా ఆయన సూక్తులను గ్రీటింగ్స్ రూపంలో మీ బంధు మిత్రులతో షేర్ చేసుకోండి..
sajayaఈ రోజు మనం మహాత్మా గాంధీ 155వ జయంతిని గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాము. మనకు బాపు అని కూడా పిలుచుకునే మహాత్మా గాంధీ సత్యం, అహింసను ఆరాధించేవాడు. తన జీవితంలో సరళత, విధేయత, శ్రమకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.
Gandhi Jayanti 2024 Wishes In Telugu: పూజ్య బాపూజీ గాంధీ జయంతి సందర్భంగా మీ స్నేహితులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..
sajayaమోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్‌బందర్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. గాంధీజీ అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారిపై పోరాడి భారతదేశానికి స్వతంత్రం అందించారు, అందుకే ప్రతి సంవత్సరం ఆయన జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
Lucknow Horror: స్కూటీ నడుపుతున్న మహిళపై కామాంధుడు దారుణం, అక్కడ తాకుతూ అసభ్యప్రవర్తన, వీడియో ఇదిగో..
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్కూటీపై వెళ్తున్న మహిళపై బైకర్ వేధింపులకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తున్న మహిళను వెనుక నుంచి అనుచితంగా తాకినట్లు వీడియోలో ఉంది. లక్నోలోని షహీద్ మార్గంలోని లులు మాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
BMW CE 02 launched: బీఎండబ్ల్యూ నుంచి బీఎండబ్ల్యూ సీఈ02, భారత మార్కెట్లో విడుదల చేసిన ఆటోమొబైల్ దిగ్గజం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Vikas Mప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సీఈ02 మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ సీఈ04 కంటే చౌక. బీఎండబ్ల్యూ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. మ్యునిచ్‌లో బీఎండబ్ల్యూ మోటరాడ్.. బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్‌ను డెవలప్ చేసింది.
Viral Video: వీడియో ఇదిగో, లారీ ఎక్కడానికి పరిగెత్తిన డ్రైవర్‌ను చంపేందుకు ప్రయత్నించిన చిరుతపులి, కాలు పట్టుకుని లాగుతూ..
Hazarath Reddyఓ వ్యక్తికి తృటిలో తప్పిన ప్రమాదం.... లారీ డ్రైవర్‌గా పని చేసే ఓ వ్యక్తి కుక్కలన్ని ఎగబడుతూ వచ్చే సరికి లారీ ఎక్కడానికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన చిరుత పులి ఆ వ్యక్తి కాలిని పట్టుకుంది. అతడు భయంతో వదిలించుకొని లారీ ఎక్కడంతో తృటిలో ప్రమాదం తప్పింది.