జాతీయం

Tirupati Laddu Issue: తిరుమలలో మూడు రోజుల పాటు మహాశాంతి యాగం, ఆలయ సంప్రోక్షణపై టీటీడీ ఈవో కీలక నిర్ణయం

Arun Charagonda

శ్రీవారి లడ్డూ కల్తీ దుమారం కొనసాగుతోన్న వేళ.. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై అత్యవసరంగా సమావేశమైన తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహా శాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తితిదే పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామల రావు భేటీ అయ్యారు.

Atishi Sworn In As Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణస్వీకారం, కేబినెట్‌లోకి ఐదుగురు మంత్రులు

Arun Charagonda

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా అతిశీతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులుగా గోపాల్ రాయ్, కైలాశ్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముఖేశ్ అహ్లావత్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తదితరులు హాజరయ్యారు.

Prakash Raj Vs Manchu Vishnu: సినీ పరిశ్రమను తాకిన తిరుపతి లడ్డూ వివాదం, మంచు విష్ణు వర్సెస్ ప్రకాశ్‌ రాజ్ మధ్య ట్వీట్ వార్!

Arun Charagonda

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పవిత్రమైన తిరుపతి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగా తాజాగా ఈ వివాదం సినీ ఇండస్ట్రీకి పాకింది.

Health Tips: ఉసిరికాయ తీవ్రమైన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుందో తెలుసా. దాని ప్రయోజనాలు తెలుసుకుందాం.

sajaya

ఉసిరి సి విటమిన్ అధికంగా ఉండి అనేక రకాలైనటువంటి జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

Seeman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ సమస్య తప్ప మరేమి లేదా?,కల్తీ లడ్డూతో ఎవరన్న చనిపోయారా అని ప్రశ్నించిన ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్

Arun Charagonda

దేశ వ్యాప్తంగా సంచనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై స్పందించారు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్. లడ్డూ తప్ప దేశంలో ఇంక ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు అని హితవు పలికారు.

Health Tips: బ్లాక్ రైస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

sajaya

మన రోగ నిరోధక శక్తి పెరగడానికి మనము మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహార పదార్థాలకు వాటి రంగును బట్టి అనేక రకాలైన పోషకాలు ఉంటాయి.

Health Tips: మీ మెడ పైన ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే అది మధుమేహం కావచ్చు జాగ్రత్తపడండి.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధుమేహం వచ్చే ముందు మన శరీరానికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా మెడ నల్లబడడం. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

Andhra Pradesh: క్షణాల్లో సెల్ ఫోన్ మాయం చేసిన కేటుగాళ్లు, కింద పడిపోయిన వస్తువు తీసుకునేలోపే కొట్టేసి పరార్..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో దొంగలు చేతి వాటం ప్రదర్శించారు. జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో మాయం చేశారు కేటుగాళ్లు. ఏలూరు DMHO కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేసే శ్రీనివాస్ అనే ఉద్యోగిని బురుడి కొట్టించి జేబులో ఉన్న సెల్ ఫోన్ ను క్షణాల్లో దొంగలించారు కేటుగాళ్లు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్‌గా మారింది

Advertisement

Mee Seva Services: తెలంగాణలో పలు చోట్ల నిలిచిపోయిన మీ సేవ సేవలు...సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయిందని అధికారుల వెల్లడి

Arun Charagonda

తెలంగాణ వ్యాప్తంగా మీ సేవ సేవలు నిలిచిపోయాయి. డేటా సెంటర్‌లో సాంకేతిక సమస్య కారణంగా మీ సేవ సర్వీసులు నిలిచిపోయాయని అధికారులు చెబుతుండగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాల్సిన వారికి సకాలంలో సర్టిఫికెట్లు లభించక తీవ్రంగా నష్టపోతున్నారు.

Devara Ticket Price: దేవర టికెట్ ధరల పెంపు, 6 షోలకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం

Arun Charagonda

దేవర సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ టికెట్ పై రూ.60 పెంపుకు పర్మిషన్ ఇవ్వగా మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135 పెంచింది. అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Lebanon Pager Blasts: లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్, పేజర్లను సరఫరా కంపెనీ కేరళ వ్యక్తిదే...అజ్ఞాతంలోకి వెళ్లిన రిన్సన్ జోస్!

Arun Charagonda

లెబనాన్ పేజర్ల పేలుడు కేసులో కేరళకు లింక్ వెలుగులోకి వచ్చింది. పేజర్లను సరఫరా చేసిన బల్గేరియా కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు కేరళలోని వాయనాడ్ కు చెందిన రిన్సన్ జోస్. కేరళ నుంచి నార్వేకు వలస వెళ్లారు 37 ఏళ్ల రిన్సన్ జోస్. తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ ట్రేడ్ మార్క్ లైసెన్స్ తో పేజర్ల తయారు చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రిన్సన్ జోస్.

India vs Bangladesh 1st Test: సెంచరీలతో చెలరేగిన రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, బంగ్లాకు 515 పరుగుల భారీ టార్గెట్...వీడియో

Arun Charagonda

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీలతో చెలరేగారు రిషబ్ పంత్, శుభ్‌మన్‌ గిల్. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 109 పరుగులు,గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

Advertisement

Telangana: బాలికలపై హాస్టల్ వార్డెన్ వేధింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు..వీడియో ఇదిగో

Arun Charagonda

రాజేంద్రనగర్లో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన హాస్టల్లో వార్డెన్ తరచూ వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. అకారణంగా చితకబాదుతోందని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వార్డెన్ పై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Maharashtra: పూణేలో షాకింగ్ సంఘటన, రోడ్డుపై గుంతలో పడ్డ ట్యాంకర్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో

Arun Charagonda

మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్‌ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్యరీతిలో పెద్ద గుంత ఏర్పడి ట్యాంకర్ అందులో పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయటకు రాగలిగాడు.

Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్..జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు , జానీ మాస్టర్‌ని కస్టడీ కోరనున్న పోలీసులు!

Arun Charagonda

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్. జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లారు ఆయన భార్య . దీంతో జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.

Rain in Hyderabad: హైదరాబాద్ లో మళ్లీ దంచికొడుతున్న వాన.. రేపు కూడా భారీ వర్షాలు

Rudra

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్నది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఉప్పల్ నుంచి లింగంపల్లి, అటు పాతబస్తీ నుంచి ఇటు కొంపల్లి వరకూ పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.

Advertisement

Road Accident At ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టిన కారు, ఒకరు మృతి..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నెంబర్ 10 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నల్గొండ నుంచి ఈసీఐఎల్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఇదేం దొంగతనం భయ్యా..! కాళ్ల మధ్యలో పెట్టుకొని రూ.10 వేల చీరలు దొంగతనం చేసిన మహిళలు.. ముస్తాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో..!

Rudra

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలోని లిప్సిక సారీ సెంటర్ లో దొంగతనం జరిగింది. చీరల కొనుగోలు పేరిట దుకాణంలోకి వచ్చిన ఐదుగురు మహిళలు చీరలు కొంటున్నట్టు నటించి రూ.10 వేల విలువైన చీరలను కాళ్ల మధ్య పెట్టుకొని దొంగతనం చేశారు.

Hydra Demolition Of Illegal Constructions: కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన అక్రమార్కులు..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్దత కల్పించడంతో పాటు మరిన్ని అధికారాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచింది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. సర్వే నెంబర్ 141లో కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. దీంతో భారీ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు.

Nalgonda: స్కూల్ ఫీజు కట్టలేదని నర్సరీ విద్యార్థులను స్కూల్లోనే బంధించిన యాజమాన్యం, దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో ఘటన

Arun Charagonda

నల్గొండ - దేవరకొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం దారుణానికి పాల్పడింది. ఫీజు చెల్లించలేదని నర్సరీ చదువుతున్న చైత్ర, యూకేజీ చదువుతున్న జాహ్నవిని స్కూల్లోనే నిర్భంధించారు.

Advertisement
Advertisement