జాతీయం
Khammam: బీఆర్ఎస్ కార్యకర్తను గాయపర్చింది హరీశ్ రావు కారే, కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ వైరల్, కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి అని వెల్లడి
Arun Charagondaనిన్న ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్త కాలు పైనుంచి వెళ్లిన కారు హరీశ్‌రావుదే అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన రామ్మోహన్..కారు నడిపింది పాడి కౌశిక్ రెడ్డి.. అందులో హరీశ్‌రావు కూడా ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.
Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా, 20కి చేరిన పతకాల సంఖ్య, ఒక్కరోజే ఐదు పతకాలు,పారాలింపిక్స్ చరిత్రలో ఇదే తొలిసారి
Arun Charagondaపారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరగా ఒక్కరోజే 5 పతకాలు వచ్చాయి. స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు.
Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షం, తిరువల్లూరును ముంచెత్తిన వర్షాలు..వీడియో
Arun Charagondaదేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించగా తాజాగా తమిళనాడులోనూ భారీ వర్షం కురిసింది. తిరువల్లూరు పట్టణంలో అర్థరాత్రి భారీ వర్షం కురిసింది.
Andhra Pradesh: వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డికి షాక్, భీమిలి బీచ్‌లో అక్రమ కట్టడాలను తొలగించిన జీవీఎంసీ అధికారులు
Arun Charagondaఏపీలోనూ అక్రమ కట్టడాల కూల్చివేత మొదలైంది. విశాఖ పట్నంలోని భీమిలీ బీచ్‌లో అక్రమ నిర్మించిన కట్టడాలను తొలగించారు జీవీఎంసీ అధికారులు. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు అధికారులు.
AP And Telangana Rains: తెలుగు రాష్ట్రాలకు నారా భువనేశ్వరి 2 కోట్ల విరాళం, హెరిటేజ్ ఫుడ్స్ తరపున సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు ప్రకటన
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి 2 కోట్లు విరాళంగా ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఆంధ్ర, తెలంగాణ సీఎంల సహాయనిధికి కోటి చొప్పున విరాళం అందిస్తున్నట్టు వెల్లడించారు.
Heavy Rains In Medaram: మేడారంలో భారీ వర్షం, వేల ఎకరాల్లో నేలకొరిగిన చెట్లు, డ్రోన్ వీడియో వైరల్
Arun Charagondaభారీ వర్షాల ప్రతాపం మేడారం అడవులపై తీవ్ర ప్రభావం చూపింది. మేడారం-తాడ్వాయి మధ్య వేల ఎకరాల్లో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షం, గాలి దుమారంతో 5కి.మీ పరిధిలో ఎటు చూసినా చెట్లు నాశనమయ్యాయి. దీనికి సంబంధించిన డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Car Crash In USA: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు భారతీయులు మృతి, పూర్తిగా కాలిపోయిన శరీరాలు
Arun Charagondaఅమెరికాలోని టెక్సాస్ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 హైదరాబాదీలు సహా నలుగురు భారతీయులు మృతి చెందారు. మంటల్లో పూర్తిగా శరీరాలు కాలిపోయాయి. ఓరంపాటి ఆర్యన్ రఘునాథ్ (కూకట్‌పల్లి, హైదరాబాద్),ఫారూక్ షేక్ (BHEL హైదరాబాద్),దర్శిని వాసుదేవన్ (తమిళనాడు), పాలచర్ల లోకేష్ చనిపోయిన వారిలో ఉన్నారు.
Hyderabad Rains : హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, నీట మునిగిన అపార్టుమెంట్ల సెల్లార్‌లు
Arun Charagondaభాగ్యనగరం హైదరాబాద్‌ను మరోసారి వర్షం ముంచెత్తింది. మంగళవారం అర్థరాత్రి నుండి తెల్లారే వరకు వర్షం దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
Audi Italy Chief Fabrizio Longo Dies : ట్రెక్కింగ్ చేస్తూ 10 వేల అడుగుల ఎత్తులో నుంచి కింద పడిన ఆడి కార్ల ఇటలీ బాస్ ఫాబ్రిజియో లాంగో, అక్కడికక్కడే మృతి
Vikas Mఇటలీలో ఆడి కార్ల కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఫాబ్రిజియో లాంగో ప్రమాదవశాత్తు పెద్ద లోయలో పడి చనిపోయాడు.62ఏళ్ల ఫాబ్రిజియో వీకెండ్ ట్రెక్కింగ్ కోసం సెప్టెంబర్ 1న ఇటలీ, స్విస్ దేశాల సరిహద్దలో ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను ట్రెక్కింగ్ చేసేటప్పుడు 10 వేల అడుగుల ఎత్తైన కొండ నుంచి జారి పడ్డాడు.
Devara Chuttamalle Song: 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న దేవర చుట్టమల్లె సాంగ్, నాలుగు వారాలుగా మోస్ట్ ట్రెండింగ్ జాబితాలో..
Vikas Mజూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి విదితమే. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమా నుంచి వచ్చిన చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది
Ajay Ratra: బీసీసీఐ కొత్త సెలెక్టర్‌గా అజయ్ రాత్రా, సలీల్ అంకోలా స్థానాన్ని భర్తీ చేయనున్న అజయ్, కీలక విషయాన్ని వెల్లడించిన బీసీసీఐ
Vikas Mభారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త సెలెక్టర్‌గా అజయ్ రాత్రా(Ajay Ratra) ఎంపికయ్యాడు. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యుల్లో ఒకరైన సలీల్ అంకోలా(Salil Ankola) స్థానాన్ని అజయ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం బీసీసీఐ (BCCI) వెల్లడించింది.
Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర పరాభవం, టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లా, దాయాది దేశంపై టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి
Vikas Mటెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో బంగ్లా విజయం నమోదు చేసింది. అయిదో రోజు టీ బ్రేక్‌కు ముందే.. బంగ్లా మ్యాచ్‌ను ముగించేసింది. స్వంత గడ్డపై దాయాది దేశానికి ఘోర పరాభవం ఎదురైంది.పాక్‌పై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి.
ICC World Test Championship 2025 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీ వచ్చేసింది, తొలిసారి వేదిక కానున్న లార్డ్స్ మైదానం, పూర్తి వివరాలు ఇవే..
Vikas Mప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ తేదీని, వేదికను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రకటించింది. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుందని ఐసీసీ తెలిపింది. జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించింది.
Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన
Vikas Mఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.
Bull Attacks Elderly Woman: వీడియో ఇదిగో, వృద్ధురాలిని కొమ్ములతో అమాంతం ఎత్తేసిన ఎద్దు, గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టిన బాధితురాలు
Vikas Mసెప్టెంబరు 2న ఆన్‌లైన్‌లో కనిపించిన కలతపెట్టే వీడియోలో, ఒక వృద్ధ మహిళను ఒక భారీ ఎద్దు గాలిలో అనేక మీటర్ల పైకి ఎగరవేయడం కనిపించింది. బలహీనమైన స్త్రీ తన మద్దతు కర్రతో ఇంటి ప్రవేశ ద్వారం వైపు నడుస్తుండగా, ఒక పెద్ద ఎద్దు అదే ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయత్నించింది.
Pakistan Floods: పాకిస్థాన్‌లో వరదలు, 293 మంది మృతి, 564 మందికి గాయాలు, రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
Hazarath Reddyపాకిస్థాన్‌లో గత రెండు నెలల్లో రుతుపవనాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మొత్తం 293 మంది మృతి చెందగా, 564 మంది గాయపడ్డారని, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.
Indian National Jailed in Singapore: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, సింగపూర్‌లో భారతీయ వ్యక్తికి 14 నెలలు జైలు శిక్ష
Hazarath Reddyసింగపూర్‌లో తెలిసిన కుటుంబానికి చెందిన టీనేజ్ బాలికపై వేధింపులకు పాల్పడిన కేసులో 52 ఏళ్ల భారతీయ వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష పడింది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను వేధించినందుకు, నేరస్థుడికి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా, లాఠీ లేదా అటువంటి శిక్షలను ఒకేసారి పొందవచ్చు
France Shocker: భర్త దారుణం, భార్యకు మత్తు ఇచ్చి 71 మంది మగాళ్ల చేత 92 సార్లు అత్యాచారం, అంతే కాకుండా కసిగా వారిని బూతు పదాలతో రెచ్చగొడుతూ వీడియోలు తీస్తూ పైశాచికానందం
Hazarath Reddyఫ్రాన్స్ కు చెందిన 71 ఏళ్ల వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి పదేళ్లుగా అపరిచిత వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడేలా చేశారని ఆరోపణలు వచ్చాయి. భర్త తన భార్య సాయంత్రం భోజనం లేదా వైన్‌లో నిద్ర మాత్రలు, యాంటి యాంగ్జైటీ మందులను చూర్ణం చేసి ఆమెను అపస్మారక స్థితికి చేర్చేవాడు.
Kadapa Fire Video: వీడియో ఇదిగో, కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం, సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ఒక్కసారిగా పేలుడు
Hazarath Reddyఏపీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కడపలో ట్రాన్స్ ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. కడప కోఆపరేటివ్ కాలనీలో సిటీ యూనియన్ బ్యాంక్ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలింది. పేలిన వెంటనే మంటలు అక్కడున్న బైకులకు అంటుకున్నాయి.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు, రాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు, ఔటర్ రింగ్ రోడ్డులోని 51 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తు ఆర్డినెన్స్
Hazarath Reddyరాష్ట్ర విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, ముగ్గురు సభ్యులతో ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీలో ఈ కమిషన్ కీలక పాత్ర పోషించనుంది.