జాతీయం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 9 మంది మవోయిస్టులు హతం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటు చేసుకుంది. బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ( Dantewada Bijapur border) చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు (Naxalites) హతమయ్యారు.

IMD Weather Alert: ఇంకా ముప్పు పోలే.. ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న మరో తుఫాను గండం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ సెప్టెంబర్ 5 నుంచి మరో మరో ముప్పును చూసే అవకాశం ఉందని IMD తెలిపింది.సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది" అని IMD నుండి సోమవారం (సెప్టెంబర్ 2, 2024) అధికారిక ప్రకటన వెలువడింది.

Andhra Pradesh Rains: ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ వరదలు, ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైఎస్ జగన్ డిమాండ్, వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం పర్యటన

Hazarath Reddy

వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. విజయవాడలోని సింగ్‌ నగర్‌ సహా పలు ప్రాంతాల్లో బాధితులను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్బంగా నడుము లోతు ఉన్న వరద నీటిలో బాధితులను కలుస్తూ.. వారికి భరోసా ఇచ్చారు.

Andhra Pradesh Politics: పుంగనూరులో టీడీపీకి షాక్, మళ్లీ వైసీపి గూటికి చేరిన మున్సిపల్‌ చైర్మన్‌ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు

Hazarath Reddy

ఇటీవల టీడీపీ చేరిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ అలీం బాషా, పలువురు కౌన్సిలర్లు తిరిగి సోమవారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు.

Advertisement

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన వట్టెం పంప్ హౌస్, టన్నెల్ మీదుగా పంపుహౌస్‌లోకి వెళ్లిన చెరువుల వరద నీరు

Hazarath Reddy

నాగర్‌కర్నూలు జిల్లాలోని కుమ్మెర వద్ద నిర్మించిన వట్టెం పంప్‌హౌస్‌ (Vattem Pump House) నీటమునిగింది. ప్యాకేజీ-7లోని ఆడిట్‌ నుంచి పంప్‌హౌస్‌ సొరంగమార్గంలోకి నాగనూలు, నాగర్‌కర్నూలు చెరువల నుంచి భారీగా వరద వచ్చిచేరింది

Girl Dies After Eating Noodles: నూడుల్స్‌ గొంతులో ఇరుక్కుని ఊపిరాడక బాలిక మృతి, తమిళనాడులో విషాదకర ఘటన

Hazarath Reddy

తమిళనాడులోని తిరుచ్చిలో గల అరియమంగళంలో శనివారం రాత్రి నూడుల్స్ వండుకుని తిన్న 15 ఏళ్ల బాలిక ఆదివారం మృతి చెందినట్లు డైలీ తంతి కథనం పేర్కొంది. ఆమె నూడుల్స్ తినడానికి ఇష్టపడిందని, శనివారం రాత్రి ఆన్‌లైన్‌లో నూడుల్స్ ప్యాక్ ఆర్డర్ చేసి వండుకుని తిన్నట్లు సమాచారం.

Lucknow Shocker: యూపిలో దారుణం, కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్‌రేప్, అంతటితో ఆగక హోటల్‌కు తీసుకెళ్లి మళ్లీ సామూహిక అత్యాచారం

Hazarath Reddy

కాన్పూర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్ తన ఫేస్‌బుక్ స్నేహితుడు విపిన్ సింగ్‌తో సహా ముగ్గురు వ్యక్తులు తనపై స్కార్పియో కారులో, ఆపై లక్నోలోని చిన్‌హాట్ ప్రాంతంలోని హోటల్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆమెను నగరానికి రప్పించిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

Indian Coast Guard Helicopter అరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు, ఒక డైవర్ గల్లంతు, పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన భారత తీర రక్షక దళం

Hazarath Reddy

అరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలట్లు, ఒక డైవర్ కోసం భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్‌గార్డ్) పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో వెళ్తున్న హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో గత రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Advertisement

Vijayawada Floods: శాంతించిన బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద, ఊపిరి పీల్చుకున్న బెజవాడ వాసులు, కృష్ణమ్మ ఉగ్రరూపానికి బెంబేలెత్తిన విజయవాడ

Hazarath Reddy

భారీ వరదలు బెజవాడను వణికించాయి. నగర ప్రజలకు మూడు రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేశాయి. భారీ వర్షాలు, వరదలతో రెండు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ కాస్త శాంతించింది.గత రాత్రి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Telangana Rains: వీడియో ఇదిగో, దుంధుభి నదిలో చిక్కుకున్న 10 మంది చెంచులను రక్షించిన పోలీసులు, అభినందనలు తెలిపిన డీజీపీ

Hazarath Reddy

దుంధుభి నదిలో (Dindi Vagu) చిక్కుకున్న చెంచులు సురక్షితంగా బయటపడ్డారు. వాగులో చిక్కుకున్న పది మందిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. గోనబోయినపల్లికి చెందిన చెంచులు గత నెల 31న చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్ధాపూర్‌ వద్ద దుంధుభి వాగులో వారు చిక్కుకుపోయారు

Donation for Flood Victims: ఎన్టీఆర్ బాటలో విశ్వక్ సేన్.. వరద బాదితులకు ఆసరా.. ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షల చొప్పున సాయం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.

Donation for Flood Victims: తెలంగాణ ఉద్యోగుల దాతృత్వం.. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన ఉద్యోగులు

Rudra

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

Jr NTR: తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం.. జూనియర్ ఎన్టీఆర్‌ భారీ విరాళం.. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షల చొప్పున సాయం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం, విజయవాడలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం సాయం చేస్తూనే ఉంది.

Tall- Cancer Link: మీరు పొడగ్గా ఉంటారా..? అయితే మీకు క్యాన్సర్‌ ముప్పు పొంచిఉన్నట్లే.. తాజా అధ్యయనంలో తేలింది ఇదే..!

Rudra

పొడుగ్గా ఉండాలని, అలా ఉంటే మిగతా వారితో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తామని అందరూ అనుకుంటారు. పొట్టిగా ఉండేవారితో పోలిస్తే కాస్తంత పొడవు ఉంటే ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని నమ్ముతారు.

Road Accident: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

Rudra

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి రహదారి మధ్యలో ఓ లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.

Floods At Edupayala Temple: జల దిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత.. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు

Rudra

భారీ వర్షాలతో మంజీరా నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో మెదక్ లోని ఏడు పాయల వనదుర్గ మాత మందిరం మూడో రోజు కూడా జల దిగ్బంధంలోనే ఉంది.

Advertisement

UP Viral Video: ప్రియురాలిని కలిసేందుకు బురఖా ధరించి వెళ్ళిన ప్రియుడు.. అతని వాలకాన్ని గమనించిన స్థానికులు.. ఆ తర్వాత ఏమైంది?? యూపీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో మీరూ చూడండి.

Rudra

ప్రేమ గుడ్డిది అంటారు. అయితే, ప్రజలను గుడ్డివాళ్లుగా చేసి తన ప్రియురాలిని మారువేషంలో కలవాలని ఓ ప్రియుడు భావించాడు. ఇంకేముంది? బురఖా ధరించి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు.

Telangana Rain Update: తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

Rudra

భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలంగాణను రానున్న మరో ఐదు రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతా వరణ శాఖ తెలిపింది.

HYDRA Ranganath: హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ కు మ‌రో కీల‌క బాధ్య‌త‌లు?! చెరువుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో రాష్ట్ర సర్కారు

Rudra

సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ) చర్యలతో రాత్రికి రాత్రి హీరో అయిపోయిన ఆ సంస్థ‌కు క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కు మరో కీలక బాధ్యతలు అప్ప‌గించే యోచ‌న‌లో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Sandip Ghosh Arrested: కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ అరెస్టు, ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై అదుపులోకి తీసుకున్న సీబీఐ

Hazarath Reddy

కోల్‌కతాలో సంచలనం రేపిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ (Sandip Ghosh)ను సీబీఐ (CBI) సోమవారంనాడు అరెస్టు చేసింది. వైద్య కళాశాల, ఆసుపత్రిలో (RG Kar Hospital) ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది

Advertisement
Advertisement