India

Astrology:సెప్టెంబర్ 11న శుక్రుడు ,శని గ్రహాలు భద్రకాయోగాన్ని ఏర్పరుస్తాయి ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 11న శుక్రుడు శని భద్రత యోగాన్ని ఏర్పరుస్తారు. దీని కారణంగా అన్ని రాశుల వారికి శుభం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Typhoon Yagi: యాగి తుపాను ధాటికి చైనా అతలాకుతలం, భారీగా ఆస్తి - ప్రాణ నష్టం, రెడ్ అలర్ట్ జారీ చేసిన చైనా జాతీయ వాతావరణ కేంద్రం!

Arun Charagonda

యాగి తుపాన్ ఎఫెక్ట్‌తో చైనా అతలాకుతలమైంది. యాగి తుఫాన్ ప్రభావానికి చైనాలో అనేక ప్రాంతాలు నేలమట్టం కాగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Astrology: రాహు రాశి మార్పు కారణంగా..సెప్టెంబర్ 16 నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

రాహు గ్రహాన్ని అందరూ మంచి గ్రహంగా పరిగణించరు. అయినప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో రాహు గ్రహం శుభ ఫలితాలను కలిగిస్తుంది. సెప్టెంబర్ 16 నుండి రాహు పూర్వ భాద్రపద రాశిలోకి సంచరిస్తాడు.

Lord Ganesh Idol With Bamboo: వెదురు బొంగుతో వినాయకుడు, తయారు చేసిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత, పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు

Arun Charagonda

తెలంగాణలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఊరే నర్సయ్య వెదురు బొంగుతో వినాయకుడిని తయారు చేసి అందరిని ఆకట్టుకున్నాడు. పర్యావరణాన్ని కాపాడాలని సూచిస్తూ వెదురుతో వినాయకుడి ప్రతిమను తయారు చేసినట్లు వెల్లడించారు. ఇందుకోసం చాలా రోజులుగా కష్టపడ్డానని చెప్పారు.

Advertisement

Health Tips: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు కిడ్నీలకు ఒక వరం.

sajaya

కిడ్నీ సమస్యతో బాధపడేవారు వారు తినే, తాగే అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మీరు తీసుకునే ఆహార పదార్థాలను మీ మూత్రపిండాలపైన ప్రభావాన్ని చూపుతాయి.

Andhra Pradesh Horror: మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడి, వినాయక చవితి వేళ విషాదం, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు..కృష్ణా జిల్లాలో ఘటన

Arun Charagonda

వినాయక చవితి రోజు మామిడి ఆకులు తెంపాడని కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కృష్ణా జిల్లా యనమలకుదురులో అనుమతిలేకుండా మామిడాకులు కోశాడని అర్జునరావు పై దాడి చేశారు నాంచారయ్య. ఆస్పత్రిలో అర్జునరావు చికిత్స పొందుతుండగా నాంచారయ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు

Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..అయితే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏ ఆహార పదార్థాలు తినకూడదు.

sajaya

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో కూడా కొలెస్ట్రాల్ సమస్య కనిపిస్తూనే ఉంది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు, పోషకాహార లోపం, మద్యపానం నిద్రలేమి వంటి వాటిల్లో కారణంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Tamilnadu: ఆకట్టుకుంటున్న గణనాథుడు, 6000 తాంబూలం ప్లేట్లతో 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాం..వైరల్ వీడియో

Arun Charagonda

తమిళనాడులోని చెన్నైలో ఓ గణనాథుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. 6000 తాంబూలం ప్లేట్లు, 1500 కామాక్షి దీపాలు,350 సీషెల్స్‌తో తయారు చేసిన 40 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహం చూడటానికి కన్నుల పండువగా ఉండగా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

Advertisement

Health Tips: మీ ఇంట్లో ఈ నూనెలను స్ప్రే చేస్తే..మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎక్కువైతుంది .దీనివల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. దోమల నుండి మనం కాపాడుకోవడానికి తరచుగా దోమతెరలను, రీఫిల్స్, ఓడోమాస్ వంటి వాటిని ఉపయోగిస్తాం

Pawan Kalyan Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్, కోటి రూపాయల చెక్కు అందజేత

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి అందించారు పవన్. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు.

Cyber Fraud: ఏకంగా ఎస్పీ పేరుతోనే టోకరా, మీటింగ్‌లో ఉన్నా డబ్బులు కావాలని వాట్సాప్ మెసేజ్, నేపాల్ నుండి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తింపు

Arun Charagonda

రోజురోజుకు సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పేరుతో సైబర్ మోసానికి తెగబడ్డారు. బిజీ మీటింగ్‌లో ఉన్నా.. డబ్బులు అర్జెంట్‌గా కావాలని వాట్సాప్ ద్వారా సిబ్బందికి మెసేజ్ పంపారు. అనుమానం ఎంక్వైరీ చేయగా సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.

CM Revanth Reddy On Ganesh Pandals: ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ, ఉత్సవ కమిటీపై అభినందనలు, గణేశ్ మండపాలకు ఉచిత కరెంట్ అని వెల్లడి

Arun Charagonda

ఖైరతాబాద్‌ గణేశుడికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తొలిపూజ చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. గణేశ్​ ఉత్సవాలకు ఉచిత విద్యుత్​ అందించాం అని తెలిపారు. గణేశ్​ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు చెప్పారు. గతేడాది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.

Advertisement

Andhra Pradesh: వినాయక మండపం ఏర్పాటులో అపశృతి, కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి, స్థానికంగా విషాదం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో విషాదం నెలకొంది. ముప్పాళ్ళలో వినాయక విగ్రహ ఏర్పాట్లలో కరెంట్ షాక్‌కు గురై ఈర్ల లక్ష్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Lord Ganesh Image At Farm Land: పొలంలో వినాయకుడి చిత్రం, అద్భుతమంటూ నెటిజన్ల ప్రశంసలు..వీడియో ఇదిగో

Arun Charagonda

సామాన్య ప్రజల్లో సృజనాత్మకతకు కొదవ లేదని నిరూపించే అనేక వీడియోలు నెట్టింట వైరలవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొందరు యువకులు తమ పొలంలో అతి భారీ వినాయకుడి చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. తర్వాత డ్రోన్‌తో వీ డియో తీయగా నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Khairtabad Ganesh: 70 అడుగుల ఖైరతాబాద్ గణేశ్, ఎక్స్‌క్లూజివ్ వీడియో, దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

Arun Charagonda

తెలంగాణ బడా గణేశ్‌ ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయగా 70 అడుగులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Heavy Rains In Sangareddy: సంగారెడ్డిలో కుండపోత వాన,నీట మునిగిన బైకులు, కార్లు..ఇళ్లలోకి చేరిన వరద..వీడియో

Arun Charagonda

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. నిన్న సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 11.5 సెంటిమీటర్ల వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా బైకులు, కార్లు నీట మునిగాయి.

Advertisement

CM Revanth Reddy At Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశుడి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ సీఎం..

Arun Charagonda

ఖైరతాబాద్ గణనాథుడి పూజల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం. సీఎంతో కలిసి పూజలో పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దంపతులు.

Viral Video: పాపులారిటీ కోసం వెర్రి చేష్టలా?, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్, వికృతానందం సరికాదని హెచ్చరిక!

Arun Charagonda

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది వెర్రి చేష్టలు చేస్తున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు అని మండిపడ్డారు.

Lalbaugcha Raja: వినాయకచవితి..లాల్‌ బాగ్ రాజా దర్శనం కోసం పోటెత్తిన భక్తులు, వీడియో ఇదిగో

Arun Charagonda

వినాయక చవితి సందర్భంగా ముంబైలోని ప్రసిద్ధ గణేష్ విగ్రహం లాల్ బాగ్ రాజా దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Andhra Pradesh Rains: యాగి తుపాను..ఏపీని వదలని వరణుడు, మరో మూడు రోజులు వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Arun Charagonda

ఏపీని వరణుడు వదలడం లేదు. ఇప్పటికే కురిసిన వర్షాలతో ఏపీలోని విజయవాడతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా అర్ధం ఏసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏపీకి మరోసారి వరణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
Advertisement