India

Duvvada Srinivas: సోషల్ మీడియాకు దూరమైన మాధురి, డాక్టర్ల సూచన మేరకే ఈ నిర్ణయం, అందరి సపోర్టు కావాలని వీడియో రిలీజ్‌

Arun Charagonda

దువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో కీలకంగా మారారు మాధురి. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన మాధురి సోషల్ మీడియాకు దూరమయ్యారు. తన ఆరోగ్యం మళ్లీ దెబ్బతిందని...మీ అందరి సపోర్టుతో నాకు చాలా ధైర్యంగా ఉందని తెలిపారు.

Hydra Demolishes Illegaal Constructions: అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరఢా, గండిపేటలో ఎఫ్టీఎల్‌ పరిధిలోని నిర్మణాల కూల్చివేత

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా మొయినబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారే హైడ్రా అధికారులు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఇవాళ ఉదయం నుంచి కూల్చివేస్తున్నారు అధికారులు. పటిష్ట భద్రతల మధ్య కూల్చివేతలు జరుగుతుండగా పరిసరాల్లోకి ఎవ్వరిని అనుమతించటం లేదు పోలీసులు.

Champai Soren: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, బీజేపీలో చేరనున్న మాజీ సీఎం చంపై సోరైన్‌, పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీలోకి!

Arun Charagonda

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తె దిశగా పరిణామాలు కనిపిస్తున్నారు. జేఎంఎం సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. చంపై సోరెన్‌తో పాటు కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. సోరెన్ బృందం ఢిల్లీకి బయల్దేరారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగా హేమంత్ సోరేన్ సీఎంగా ఉన్నారు. ఇటీవల ఈడీ కేసులో హేమంత్ సోరేన్ జైల్లో ఉన్నపుడు సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Jogulamba Gadwal: వరుస దొంగతనాలు, షెట్టర్ పగులగొట్టి మరి దొంగతనాలు, హడలెత్తుతున్న షాప్ యజమానులు

Arun Charagonda

జోగులంబా గద్వాల జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. జులకల్ స్టేజ్ లో అర్ధరాత్రి షెట్టర్ పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి సీసీ టీవీలో వీడియో రికార్డు కాగా వరుస దొంగతనాలతో షాప్ యజమానులు హడలెత్తుతున్నారు

Advertisement

Kolkata Doctor case updates: కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం, బీజేపీ నేత సహా ఇద్దరు డాక్టర్లకు సమన్లు, ప్రధాన నిందితుడికి మానసిక పరీక్ష

Arun Charagonda

కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుల్లో దోషులను శిక్షించాలని దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ముఖ్యంగా కోల్ కతాలో మెడికల్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా దేశవ్యాప్తంగా వీరికి వైద్యులు, మెడికల్ కాలేజీ విద్యార్థులు సంఘీభావం చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం అర్ధరాత్రి మార్చ్‌తో నిరసనల్లో పాల్గొన్నారు.

Stray Dogs Attack: ములుగులో పిచ్చి కుక్కల స్వైరవిహారం, ఏడుగురు యువకులతో పాటు రెండు మేకలపై దాడి,భయాందోళనలో స్థానికులు

Arun Charagonda

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. వెంకటాపురం మం. నూగురు గ్రామంలో ఏడుగురిపై పిచ్చికుక్క దాడి చేసింది. హుటాహుటిన వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామస్తులు. రెండు మేకలను సైతం కరిచాయి పిచ్చికుక్కలు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Chandrababu In Delhi: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు, ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్న టీడీపీ అధినేత

Arun Charagonda

టీడీపీ చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు నిర్మలా సీతారామన్‌లను కలిశారు చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. అలాగే ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పిన విధంగా సాయం అందించాలని కోరారు.

Andhra Pradesh Shocker:భర్తను కొట్టి, భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం , ఏలూరులో కిరాతక సంఘటన

Arun Charagonda

భర్తను కొట్టి.. అతని భార్యపై ముగ్గురు యువకుల అత్యాచారం చేసిన సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. జీవనోపాధి కోసం వచ్చి రాంకోఠిలో ఉంటున్న భర్తకు నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ముగ్గురితో కలిసి భర్త మద్యం తాగాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు భర్తపై దాడి చేసి భార్యపై అత్యాచారం చేశారు.

Advertisement

BJP Membership Drive: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సభ్యత్వాలే బీజేపీ టార్గెట్, రాష్ట్రాల వారీగా ఇంఛార్జీలు నియామకం,2025లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు

Arun Charagonda

మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ. రెండు సార్లు బీజేపీకి వార్ వన్ సైడ్ అనేలా ప్రజలు తీర్పు ఇవ్వగా గత ఎన్నికల్లో మాత్రం సంకీర్ణ పార్టీల భాగస్వామ్యంతో మోడీ 3.0 ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ మెంబర్ షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమమైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా...మెంబర్ షిప్ డ్రైవ్‌పై కీలక సూచనలు చేశారు.

Air India Horror: ఎయిరిండియా ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. లండన్ లో హోటల్ లో ఉండగా ఘటన

Rudra

ఎయిరిండియా మహిళా ఉద్యోగినిపై ఓ దుండగుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

X To Close Operations in Brazil: బ్రెజిల్ లో ఎక్స్ మూసివేత.. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి కారణంగానే ఈ నిర్ణయమట.. అసలేం జరిగింది?

Rudra

దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో తమ కార్యకలాపాలను వెంటనే ఆపేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ప్రకటించింది. బ్రెజిల్ ప్రధాన న్యాయమూర్తి అలెగ్జాండ్రె డీ మొరేస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

Portable Hospital: ప్రపంచంలో తొలి పోర్టబుల్‌ హాస్పిటల్‌.. 15 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు జారవిడిచిన ఇండియన్‌ ఆర్మీ (వీడియోతో)

Rudra

ప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్‌ హాస్పిటల్‌’కు (అవసరమైనప్పుడు తరలించేందుకు అనువుగా) సంబంధించిన ప్రతిష్ఠాత్మక ఆపరేషన్‌ ను భారత ఆర్మీ, వాయుసేన విజయవంతంగా పూర్తిచేశాయి.

Advertisement

Crorepati Sweeper In UP: చేసేది స్వీపర్‌ పని.. అయితే, అతనికి 9 లగ్జరీ కార్లు.. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఉత్తర ప్రదేశ్ పారిశుధ్య కార్మికుడి గురించి తెలుసా?

Rudra

అతని పేరు సంతోష్‌ జైస్వాల్‌. ఉత్తర ప్రదేశ్‌ లోని గోండా జిల్లాకు చెందిన ఇతను డివిజనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో స్వీపర్‌ గా పనిచేస్తున్నాడు. భార్యా పిల్లలు ఉన్నారు.

P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్‌ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Rudra

ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.

High Value Cash Transactions:పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్ష‌న్లు చేస్తూ ప‌న్ను ఎగ‌వేస్తున్న హోట‌ళ్లు, హాస్ప‌ట‌ళ్లు..నిఘా పెట్టిన కేంద్ర సంస్థ‌లు, ఒక్క ఏడాదిలోనే ఎంత ప‌ట్టుకున్నారంటే?

VNS

ప్రత్యేకించి హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ సేల్స్, దవాఖానలు, ఐవీఎఫ్ క్లినిక్స్‌ల్లో లావాదేవీలను తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఐటీ విభాగానికి సీబీడీటీ నొక్కి చెప్పింది. సంబంధిత వర్గాల వారికి ఇబ్బంది కలగని రీతిలో తనిఖీ చేయాలని హితవు చెప్పింది.

New UPI Scam Alert: యూపీఐ వాడుతున్నారా? అయితే సైబ‌ర్ క్రిమిన‌ల్స్ నుంచి మీకు ఈ రిస్క్ పొంచి ఉంది, కొత్త త‌ర‌హాలో డ‌బ్బులు కొట్టేస్తున్న మోస‌గాళ్లు

VNS

సైబర్ మోసగాళ్లు ‘మీ యూపీఐ ఐడీ’ ట్రాక్ చేసేస్తారు. తర్వాత మీ ఖాతాలో మనీ స్వాహా చేయడానికి ఆటోపే రిక్వెస్ట్ (Autopay Set Up) పంపుతారు. ఆ రిక్వెస్ట్ చూడగానే పొరపాటున మీరు అప్రూవ్ చేశారంటే.. మీ ఖాతా నుంచే మోసగాళ్లు తమ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు.

Advertisement

Dil Raju Intresting Comments: ప్రేక్ష‌కులు సినిమా హాళ్ల‌కు రాకుండా చెడ‌గొట్టింది మేమే, ఓటీటీల్లోకి వ‌స్తుంది ఆగండి అంటూ అల‌వాటు చేశాం, ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

VNS

ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యువ న‌టుల‌తో వ‌స్తున్న తాజా చిత్రం ‘రేవు’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమలో పాల్గొన్న దిల్‌ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అనేది అంత‌ సులభం కాదు.

Tungabhadra Dam Crest Gate Fixed:ఎట్ట‌కేల‌కు తుంగ‌భ‌ద్ర గేటును విజ‌య‌వంతంగా మార్చిన అధికారులు, వంద‌ల క్యూసెక్కుల నీరు వృథాగా వెళ్ల‌కుండా చ‌ర్య‌లు

VNS

తుంగభద్ర డ్యామ్(Tungabhadra Dam)​లో గల్లంతైన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ (Stop log ) ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. పనులు చేపట్టిన 24 గంటలలోపే 5 బ్లాక్‌ల్లో స్టాప్‌ లాగ్‌ ఎలిమెంట్లను అధికారులు విజయవంతంగా అమర్చారు. 4 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో స్టాప్‌ లాగ్‌ ఎలిమెంట్లను అమర్చి వృథాగా పోతున్న నీటిని పూర్తిగా అడ్డుకున్నారు.

Jagtial: ర‌న్నింగ్ లో ఉండ‌గానే ఊడిపోయిన ఆర్టీసీ బ‌స్సు టైర్, ప్ర‌మాద స‌మ‌యంలో 150 మంది ప్ర‌యాణికులు, డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌త‌తో త‌ప్పిన ముప్పు

VNS

జగిత్యాల నుంచి నిర్మల్‌కు పల్లె బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో బస్సు జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్దకు చేరుకోగానే వెనుకాల రెండు చక్రాలు ఊడిపోయి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లాయి. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి బస్సుని నిలుపడంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకుండా బయటపడ్డారు. వరుసగా సెలవులు రావడంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కళకళలాడుతున్నా

Telangana Police: హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత, నలుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు

Arun Charagonda

హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ డ్రగ్స్ బ్యూరో, బాలానగర్ పోలీసులు హాష్ ఆయిల్ విక్రేతని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.10.30 లక్షల విలువ చేసే 1.292 ఎంఎల్ హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నలుగురు యువకులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు.

Advertisement
Advertisement