India
Stray Dogs Attack In Karimnagar: కరీంనగర్‌లో వీధి కుక్కల దాడి, ముగ్గురు చిన్నారులపై దాడి, గాయాలతో ఆస్పత్రిలో చేరిక
Arun Charagondaకరీంనగర్‌లో వీధి కుక్కలు మరోసారి పంజా విసిరాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి వీధి కుక్కలు. కరీంనగర్ - వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో ఇంటి బయట ఆడుకుంటున్న నాగ ప్రణయ్(12), రిషి(10), స్వప్న అనే ముగ్గురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.గాయపడిన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
Telangana: శభాష్ ఆటో అన్న, నీటిలో కొట్టుకుపోతున్న కుటుంబాన్ని కాపాడిన ఆటో డ్రైవర్, వీడియో వైరల్
Arun Charagondaమహబూబాబాద్ - గార్ల మండలంలో ఏరు దాటుతుండగా కాలు జారి నీటిలో కొట్టుకుపోయిన ఓ కుటుంబాన్ని ఆటో డ్రైవర్ కాపాడాడు. రాంపురం పాకాల ఏరు పైనుంచి దాటుతున్న తండ్రి, కూతురు, కొడుకు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వారిని చూసి కాపాడాడు. దీంతో ఆటో డ్రైవర్ చేసిన సాహసానికి స్థానికులు అభినందించారు.
Andhra Pradesh: బెట్టింగ్‌లో రూ.2.40 కోట్ల అప్పు చేసిన కొడుకు, అప్పులు కట్టలేక తల్లిదండ్రుల ఆత్మహత్య, నంద్యాలలో విషాదం
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో విషాదం నెలకొంది. అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ₹2.40 కోట్ల అప్పు చేశాడు. తల్లిదండ్రులు వాళ్ల 10 ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు చేసుకున్నారు.
Gujarat: కుక్కల దెబ్బకు తోకముడిచిన సింహాలు,షాకింగ్ సీసీ టీవీ ఫుటేజ్, గుజరాత్‌లో ఓ ఊరిలోకి వచ్చిన రెండు సింహాలు, ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న కుక్కలు, వీడియో వైరల్
Arun Charagondaగుజరాత్‌లోని ఆమ్రేలిలో రెండు సింహాలు హల్ చల్ చేశారు. రాత్రి సమయంలో ఓ గ్రామంలోకి రెండు సింహాలు వచ్చాయి. అయితే సింహాలను ఇంట్లోకి రాకుండా రెండు కుక్కలు తీవ్రంగా పోరాడాయి. దీంతో చేసేదేమి లేక సింహాలు వెనుదిరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CAS Dismissed Vinesh Phogat Petition: వినేశ్ ఫోగట్ పిటిషన్‌ను కొట్టేసిన కాస్ కోర్టు, తీవ్ర నిరాశలో వినేశ్, రజత పతకంపై ఆశలు ఆవిరి
Arun Charagondaభారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్ 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరినా అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టాఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)కు అప్పీల్ చేసింది వినేశ్. కనీసం తనకు రజత పతకం ఇవ్వాలన్న పిటిషన్‌ను దాఖలు చేయగా కాస్ ఈ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో పతకంపై వినేశ్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. న్యాయస్థానం వన్ లైన్‌తో తీర్పు వెల్లడించింది.
Independence Day 2024: ఎర్రకోటపై ఎగిరిన మువ్వన్నెల జెండా, 11వ సారి జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని మోడీ, 2047 వికసిత్ భారత్ లక్ష్యమన్న ప్రధాని,ఎర్రకోటపై హెలికాప్టర్లతో పూలవర్షం
Arun Charagondaఢిల్లీలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎర్రకోటపై 11వ సారి జాతీయ జెండాను ఎగరవేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అనంతరం జాతాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ.
Independence Day 2024 Wishes in Telugu: మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే...ఈ ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకోండిలా..
sajayaనేటికి కూడా మన ముందున్న సవాళ్లను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకొని ముందుకు వెళ్లడం ద్వారా మాత్రమే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలుస్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తించాలి. మీ బంధుమిత్రులకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఈ ఫోటో గ్రీటింగ్స్ వాడుకోండి
Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా ఇలా చేస్తే మీ జుట్టు ఎప్పటికీ నల్లగా.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య తెల్ల జుట్టు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే తెల్ల జుట్టు కనిపించేది కానీ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఈ తెల్ల జుట్టు సమస్య అనేది చాలా బాధిస్తుంది.
Pakistan Horror: పాకిస్తాన్‌లో దారుణం, అయిదు రోజుల పాటు బంధించి బెల్జియం యువతిపై అత్యాచారం, కాళ్లు చేతులు కట్టేసి మరీ..
Hazarath Reddyపాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో 28 ఏళ్ల బెల్జియం యువతి ఐదు రోజుల పాటు అత్యాచారానికి గురైనట్లు తెలిసింది. ఆమె చేతులు మరియు కాళ్ళు బంధించబడ్డాయి. సంఘటన స్థలం నుండి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను విడిచిపెట్టారు.
Aarogyasri Services in AP: ఏపిలో రేపటి నుంచి ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు బంద్, ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో రూ.2500 కోట్లు బకాయిలు
Hazarath Reddyపెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. 2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోగా..ప్రభుత్వం నుంచి రూ.2500 కోట్లు రావాల్సి ఉంది.
Man Catches Snake Video: వీడియో ఇదిగో, బ్యాంక్‌లో దూరి కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని హడలెత్తించిన పాము
Hazarath Reddyవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు
Robbery Attempt Caught on Camera: తుపాకీలతో చోరీకి వచ్చిన దొంగలను యజమాని ఎలా తరిమి కొట్టాడో వీడియోలో చూడండి
Hazarath Reddyబుధవారం తెల్లవారుజామున థానేలోని కపూర్‌బావాడి ప్రాంతంలోని నగల దుకాణంలో జరిగిన దోపిడీ యత్నాన్ని యజమాని చెక్క కర్రతో ధైర్యంగా నలుగురు దుండగులను అడ్డుకోవడంతో విఫలమైంది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో దుకాణంలోకి ప్రవేశించిన ముసుగు ధరించిన దుండగులు తుపాకులు పట్టుకుని, యజమానిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేశారు.
Ram Lalla Sculptor Arun Yogiraj: అయోధ్య రాముడి విగ్రహ శిల్పి అరుణ్ రాజ్ కు అవమానం, అరుణ్ సహా అతని కుటుంబానికి వీసా నిరాకరించిన యూఎస్ కాన్సులేట్
VNSయూపీలోని అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని (Ram Lalla Sculptor) చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు (Arun Yogiraj) చేదు అనుభవం ఎదురైంది. అరుణ్ సహా అతడి కుటుంబ సభ్యులకు అమెరికా వీసాను నిరాకరించింది (Denied US Visa).
Kolkata Doctor Rape-Murder Case: బెంగాల్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్, అక్కడ మహిళలకు భద్రత కరువైందంటూ ఆరోపణ
VNSకోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై (Kolkata Doctor Rape-Murder Case) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.
YS Sharmila: వైఎస్ జగన్ ఎన్నటికీ మళ్లీ సీఎం అవ్వరు! సంచలన కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల
VNSవైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు? భారీ మెజారిటీతో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు? బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడు.
Nagarjuna Sagar Dam: నిండుకుండలా నాగార్జున సాగర్, మళ్లీ రెండు గేట్లు ఎత్తిన అధికారులు, లాంగ్ వీకెండ్ తో క్యూకట్టిన పర్యాటకులు
VNSనల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Dam) నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న ది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను (Gates Lifted) ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Train Guard Manhandles Disabled Person: దివ్యాంగుడి ట్రైన్ నుంచి తోసేసిన గార్డ్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినందుకు కర్కశంగా ప్రవర్తించిన వ్యక్తి, బీహార్ లో వైరల్ గా మారిన వీడియో
VNSఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. (Train Guard Manhandles Disabled Person) అతడి కాలర్ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.
Telangana: మా వద్ద హైదరాబాద్ ఉంది, ఏపీతో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, మా పోటీ ప్రపంచంతోనేనని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddy15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.
Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
Hazarath Reddyతెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు.