New Delhi, JAN 11: కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ హోండా కార్స్ ఇండియా (Honda India) ఎలివేట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ అనే రెండు ప్రత్యేక ఎడిషన్‌లను (Special Edition) విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్‌లు టాప్-స్పెక్ జెడ్ఎక్స్ వేరియంట్‌పై ఆధారపడి ఉంటాయి. కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ కలర్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి. హోండా ఎలివేట్ మోడల్ కారు 1.5-లీటర్ (i-VTEC DOHC) పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ కారు గరిష్టంగా 121పీఎస్ పవర్, 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ ఎంటీ, 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ఉన్నాయి. బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్‌లు రెండూ ఎంటీ, సీవీటీ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ కార్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ :
ఎంటీ ధర : రూ 15.51 లక్షలు
సీవీటీ ధర : రూ. 16.73 లక్షలు
హోండా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ :
ఎంటీ ధర రూ 15.71 లక్షలు
సీవీటీ ధర రూ. 16.93 లక్షలు
హోండా ఎలివేట్ బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్‌ల బుకింగ్‌లు ఇప్పుడు ఓపెన్ అయ్యాయి. సీవీటీ వేరియంట్‌ల డెలివరీలు ఈ నెల నుంచే ప్రారంభం కానుండగా, ఎంటీ వేరియంట్‌లు ఫిబ్రవరి నుంచి డెలివరీలకు అందుబాటులో ఉంటాయి. మిడ్-సైజ్ ఎస్‌యూవీ ప్రత్యేక ఎడిషన్ మోడల్స్ ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ :
బ్లాక్ అల్లాయ్ వీల్స్, నట్స్
అప్పర్ గ్రిల్‌పై క్రోమ్ అసెంట్స్
సిల్వర్ ఫినిషింగ్ ఫ్రంట్, రియర్ స్కిడ్ గార్నిష్
సిల్వర్ ఎండ్ అప్పర్ రెయిల్స్
సిల్వర్ ఎండ్ డోర్ లోయర్ గార్నిష్
టెయిల్‌గేట్ బ్లాక్ ఎడిషన్ ఎంబ్లెమ్
బ్లాక్ థ్రెడ్ స్టిచ్‌తో బ్లాక్ లెథెరెట్ సీట్లు
బ్లాక్ డోర్ ప్యాడ్‌లు, ఆర్మ్‌రెస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్
హోండా ఎలివేట్ సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ :
బ్లాక్ అల్లాయ్ వీల్స్, నట్స్
బ్లాక్ అప్పర్ గ్రిల్
బ్లాక్ ఫ్రంట్, రియర్ స్కిడ్ గార్నిష్
బ్లాక్ రూఫ్ రెయిల్స్
బ్లాక్ డోర్ లోయర్ గార్నిష్
టెయిల్‌గేట్‌పై బ్లాక్ ఎడిషన్ ఎంబ్లెమ్
ఫ్రంట్ ఫెండర్‌పై స్పెషల్ సిగ్నేచర్ ఎడిషన్ బ్యాడ్జ్
బ్లాక్ థ్రెడ్ స్టిచ్‌తో బ్లాక్ లెథెరెట్ సీట్లు
బ్లాక్ డోర్ ప్యాడ్‌లు, ఆర్మ్‌రెస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్
7 కలర్లలో రిథమిక్ యాంబియంట్ లైటింగ్