Information
PM-KISAN Scheme: రేపే రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు, పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు విడుదల చేయనున్న కేంద్రం, పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన జాబితాలో ల‌బ్దిదారుల పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా..
Hazarath Reddyఆగస్టు 9న పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధులు (Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) విడుద‌ల కానున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద అర్హులైన దేశ‌వ్యాప్త రైతుల‌కు సోమ‌వారం మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల నుంచి వారి ఖాతాల్లో న‌గ‌దు జ‌మ కానుంది. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని మోదీ (PM Narendra Modi) ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌నున్నారు.
Tropical Storm Mirinae: దూసుకొస్తున్న మిరినే ఉష్ణమండల తుఫాను, టోక్యో ఒలింపిక్స్‌‌కు అంతరాయం ఏర్పడే అవకాశం, రుక్యు దీవుల దగ్గర మిరినే పుట్టే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddy: జపాన్‌లోని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్‌ 2020 గేమ్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే చివరి రోజుల్లో టోక్యోలో వాతావారణ పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జపాన్ లో ఇప్పుడు వేడి తేమతో కూడిన పొడి వాతావరణం ఉంది. అయితే రానున్న కాలంలో ఉష్ణమండల తుఫాను (Tropical Storm Mirinae) టోక్యో నగరాన్ని తాకబోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి జపాన్ వాతావరణ సంస్థ (JMA) మిరినే (Mirinae) అని నామకరణం చేసింది.
Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Team Latestlyధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....
‘Bharat Darshan' Tour Package: భారత్‌ దర్శన్‌ టూర్ ప్యాకేజీని విడుదల చేసిన ఇండియన్ రైల్వే, 11 రాత్రులు/12 పగలు ఉండే ఈ పర్యటనలో పెద్దవారికి రూ.11,340గా నిర్ణయం, కోవిడ్ వ్యాక్సిన్, నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి
Hazarath Reddyదేశంలోని వివిధ పుణ్యస్థలాలు, హిస్టోరిక్ ప్రదేశాలకు తీసుకువెళ్లే భారత్‌ దర్శన్‌ ప్యాకేజీని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రారంభించింది. ఈ నెల 29 నుంచి ఈ ప్రత్యేక పర్యటన ప్రారంభమై.. వచ్చే నెల 10 వ తేదీ వరకు కొనసాగుతుంది.
e-RUPI: ఈ-రూపీ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఈ-రుపీ ఓచర్లను ఇతర పనులకు వాడుకోవచ్చా, ప్రధాని మోదీ తీసుకువచ్చిన ఈ-రూపీ ప్రయోజనాలు, దానిపై పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదేశంలో నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ లావాదేవీలను మరింతగా ప్రోత్సాహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ-రూపీ((E-RUPI))ని వీడియో కాన్ఫరెన్స్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. భారత్‌లో డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను (Digital payment solution) విస్తృతం చేయడమే కాక, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు.
CBSE 10th Result 2021: మధ్యాహ్నం 12 గంటలకు సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల, అధికారికంగా వెల్లడించిన సీబీఎస్‌ఈ బోర్డు, cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
Hazarath Reddyసీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు cbseresults.nic.in, cbse.nic.inలతో పాటు డిజిలాకర్ యాప్‌లోనూ తెలుసుకోవచ్చు.
AP ECET 2021 Exam Date: ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు బీ అలర్ట్, సెప్టెంబర్‌19న ఏపీ ఈసెట్‌, ఆగష్టు 12 వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువు, వెయ్యి రూపాయల ఫైన్‌తో ఆగస్టు 23 వరకు అవకాశం
Hazarath Reddy2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఏపీ ఈసెట్‌ (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఫర్‌ డిప్లొమా హోల్డర్స్‌ అండ్‌ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్‌) పరీక్ష సెప్టెంబర్‌19న (AP ECET 2021 Exam Date) నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆగష్టు 12 వరకు దరఖాస్తుల స్వీకరించేందుకు గడువు విధించింది.
Bank Holidays in August 2021: ఆగస్టు నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు, పూర్తి సమాచారం కథనంలో..
Hazarath Reddyకరోనా వల్ల జూన్లో బ్యాంకులు పని సమయాన్ని కొంత తగ్గించినప్పటికీ.. జులై నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆర్బీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులు ఆగస్టు నెలలో మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవుల్లో (Bank Holidays in August 2021) ఉండనున్నాయి.
SBI Debit Card: మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా, బ్లాక్ చేసి కొత్త కార్డు పొందడం ఎలాగో తెలుసుకోండి, కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Hazarath Reddyపోగొట్టుకున్న డెబిట్ కార్డును (SBI Debit Card) బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను బ్యాంకు సులభతరం చేసింది. ఎస్బీఐ (State Bank of India) వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, అలాగే దాన్ని (SBI Debit Card block and replacement) తిరిగి పొందవచ్చు.
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు, ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన టీటీడీ, www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని వెల్లడి
Hazarath Reddyతిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు (TTD Darshan Tickets) రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) వర్గాలు తెలిపాయి.
New CU Vice Chancellors: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ కొత్త వీసీగా డాక్టర్‌ బసుత్కర్‌ జె రావు, 12 సెంట్రల్‌ యూనివర్సిటీలకు కొత్త వైస్‌ ఛాన్సలర్లు, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌
Hazarath Reddyదేశంలోని 12 సెంట్రల్‌ యూనివర్సిటీల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకానికి (NEW CV Vice Chancellors) రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ (Ramnath Kovind) గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది.
Cancellation of Trains: భారీ వర్షాలు, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు ప్రకటన
Hazarath Reddyగత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
AP Schools Reopening Update: ఏపీలో నూతన విద్యా విధానం, కొత్తగా 6 రకాల స్కూల్స్‌, ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని విద్యాశాఖకు అదేశాలు జారీ చేసిన సీఎం జగన్, రూ.16 వేల కోట్లతో చేపట్టిన నాడు – నేడు విజయవంతం కావాలని సూచన
Hazarath Reddyఏపీలో వచ్చే నెల 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాల్సిందిగా (AP Schools Reopening Update) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా శాఖను ఆదేశించారు. అదే రోజు తొలి విడతలో నాడు–నేడు కింద రూపురేఖలు మారిన స్కూళ్లను ప్రజలకు అంకితం చేస్తామని సీఎం (CM YS Jagan) తెలిపారు. రెండో విడత స్కూళ్లలో నాడు–నేడు (Nadu-Nedu) కింద పనులకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
Andhra Pradesh Weather: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం
Hazarath Reddyఏపీ తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Andhra Pradesh Weather) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది.
UGC Guidelines: గుడ్ న్యూస్..అడ్మిషన్లు రద్దు చేసుకుంటే విద్యార్థులకు పూర్తి ఫీజు వాపస్ ఇవ్వాల్సిందే, ఉన్నత విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేసిన యూజీసీ, కొత్త అకడమిక్‌ షెడ్యూల్‌తో విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచన
Hazarath Reddyఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు కోవిడ్‌ కారణంగా తమ అడ్మిషన్లను రద్దు చేసుకుంటే వారికి పూర్తి ఫీజులను వాపసు ఇవ్వాలని (Full Refund of Fees For Cancellation of Admission) యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఆదేశించింది.
Night Curfew Extended in AP: ఏపీలో మరో వారంపాటు నైట్‌ కర్ఫ్యూ పొడిగింపు, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలు, కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైయస్ జగన్
Hazarath Reddyకరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో వారం పాటు నైట్‌ కర్ఫ్యూను ప్రభుత్వం పొడిగించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
Bank Holidays Alert: రాబోయే 5 రోజులు పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్, తెలుగు రాష్ట్రాల్లో యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు, వచ్చే 5 రోజులు ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyబ్యాంకు ఖాతాదారులకు అలర్ట్ న్యూస్.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రాబోయే ఐదురోజుల పాటు బ్యాంకులు (Bank Holidays Alert) మూసివేస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు శనివారం వెల్లడించింది. రిజర్వు బ్యాంకు ( Reserve Bank of India) క్యాలెండరు నోటిఫికేషన్ ప్రకారం జులై 21వతేదీన బ్యాంకులన్ని (Banks will be closed in these cities for the next 5 days) మూసి ఉంచుతారు.
AP Job Calendar: ఏపీలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, త్వరలో 1,200కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు జారీ, కసరత్తు చేస్తోన్న ఏపీ సర్కారు, ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో నోటిఫికేషన్లు జారీచేస్తామని తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్‌.సలాంబాబు
Hazarath Reddyఏపీలో త్వరలో కొలువుల జాతర రానుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై సీఎం జగన్ ప్రభుత్వం (CM Jagna Govt) కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.
BTech Programs in Regional Languages: తెలుగులోనే బీటెక్ చదువు, ప్రాంతీయ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు అనుమతించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి, వివరాలను వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Hazarath Reddyబీటెక్ కోర్సులను ఇక ఎంచక్కా ప్రాంతీయ భాషల్లో చదివేయండి. తెలుగు సహా హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాళీ, పంజాబీ, ఒడియా, అస్సామీ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు (BTech Programs in Regional Languages) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న తెలిపారు.
UGC Academic Calendar 2021: అక్టోబరు 1 నుంచి నూతన విద్యా సంవత్సరం, యూనివర్సిటీలకు గైడ్‌లైన్స్‌ను విడుదల చేసిన యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు
Hazarath Reddyదేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విడుదల చేసింది. కరోనావైరస్ ముప్పు కారణంగా గత విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారి పరీక్షలు అనుకున్న సమయానికి జరగలేదు.