సమాచారం

IND-W Win by Six Wickets: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్, బోణీ కొట్టిన టీమిండియా ఉమెన్, ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఉమెన్ మీద ఘనవిజయం

Vikas M

యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌ (Womens T20 World Cup 2024)లో టీమ్ఇండియా ఉమెన్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్.. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (IND vs PAK)పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది

Jio Plan Update: జియో ప్లాన్‌లో కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌, రెండు పరికరాల్లో కస్టమర్లు స్ట్రీమింగ్‌ను వీక్షించే అవకాశం

Vikas M

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే రూ.1029 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌ను జోడించింది.

SBI Jobs Update: నిరుద్యోగులకు అలర్ట్, ఎస్‌బీఐలో 10 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

Vikas M

దేశంలోని అతిపెద్ద రుణదాత, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ ఉద్యోగాల జాతరకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Bomb Threat To Vadodara Airport: నవరాత్రి ఉత్సవాలు, వడోదర ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు, అణువణువు తనిఖీ చేస్తున్న పోలీసులు

Arun Charagonda

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఇక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వడోదర విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపుకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్ రావడంతో పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు.

Advertisement

Pune Court Summons To Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్, పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పుణె ప్రత్యేక కోర్టు, విచారణకు హాజరుకావాలని ఆదేశం

Arun Charagonda

ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 2023 లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ.. వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పుణె కోర్టు పరువు నష్టం దావా దాఖలు చేయగా విచారణ సందర్భంగా రాహుల్‌కి సమన్లు జారీ చేసింది న్యాయస్థానం.

Chhattisgarh:కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్, ఛత్తిస్ ఘడ్ ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి!

Arun Charagonda

ఛత్తిస్ ఘడ్, అబుజమ్మడ్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బస్తర్ అడవుల నుంచి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. 31 మృతదేహాలను దంతెవాడకు మరియు 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించినట్లు తెలుస్తోండగా ఇందుకు సంబంధించి అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Supreme Court: జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు, ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు అని తేల్చిచెప్పిన సుప్రీం కోర్టు

Arun Charagonda

జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు.. విమర్శించినంత మాత్రాన కేసులు పెట్టడం తప్పు అని తేల్చిచెప్పింది. అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్‌పై యూపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

Advertisement

Google Pay personal Loan: గుడ్ న్యూస్...ఇకపై గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల పర్సనల్ లోన్, రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్..వివరాలివే

Arun Charagonda

ప్రముఖ పేమెంట్ యాప్ గూగుల్ పే గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి గూగుల్ పే ద్వారా ఇక నుంచి గూగుల్ పే ద్వారా రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఇందుకోసం ముత్తూట్ ఫైనాన్స్ తో జత కట్టినట్లు తెలిపింది. అలాగే తమ ప్లాట్ఫామ్ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది.

Pune Helicopter Crash Viral Video: మహారాష్ట్ర పుణెలోని బవధాన్ ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్. .. ముగ్గురు మృతి..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

sajaya

హెలికాప్టర్ పొదల్లో పడి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ దురదృష్టకర సంఘటనలో, బుధవారం ఉదయం పూణెలో హెలికాప్టర్ కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణె జిల్లాలోని బవ్‌ధాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

LPG Prices Hike: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

Rudra

దసరా, దీపావళి పండుగల ముందు హోటల్స్, ఇతరత్రా వాణిజ్య సముదాయాల్ని నిర్వహించే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడవ నెల అక్టోబర్‌ లో కూడా గ్యాస్ ధర పెరిగింది.

Bank Holidays in October 2024: అక్టోబరు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, తెలుగు రాష్ట్రాల్లో రెండు పెద్ద పండుగలు, బ్యాంకుల సెలవు లిస్టు ఇదిగో..

Vikas M

అక్టోబరు నెలలో దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అదే సమయంలో, పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక పండుగలు కూడా అక్టోబరు నెలలో ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనూ బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

Advertisement

Bomb Threat For Taj West End Hotel:బెంగళూరులోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు , బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీ, ఈమెయిల్‌ ద్వారా బెదిరింపులు

Arun Charagonda

బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌కు కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ప్రముఖ రాజకీయ నాయకులు మరియు క్రికెట్ క్రీడాకారులను ఆతిథ్యమిచ్చే ఈ హోటల్‌కు ఈ బెదిరింపు వచ్చిందని తెలిసింది. స్థానిక పోలీసులు మరియు బాంబు స్క్వాడ్ తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని సమగ్ర విచారణను కొనసాగిస్తున్నారు.

New Flight Services From Hyderabad: హైదరాబాద్‌ నుండి మూడు కొత్త విమాన సర్వీసులు నడపనున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, హర్షం వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాద్ నుంచి మూడు కొత్త విమాన స‌ర్వీసులు నడపనుంది ఇండిగో ఎయిర్‌లైన్స్. అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్‌ల‌తో స‌హా 7 రూట్లలో విమానాలు న‌డ‌ప‌నుంది ఇండిగో ఎయిర్‌లైన్స్‌.

Bihar Jivitputrika Festival Tragedy: బీహార్‌ జీవితపుత్రికా పండుగలో విషాదం, నీట మునిగి 46 మంది మృతి ఇందులో 36 మంది పిల్లలే

Arun Charagonda

బీహార్‌లో విషాదం నెలకొంది. జీవితపుత్రిక పర్వదినం సందర్బంగా వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో 46 మంది మృతి చెందారు. ఇందులో 36 మంది చిన్నారులే ఉండటం స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Maharashtra Rain Updates: ముంబైని ముంచెత్తిన భారీ వర్షం, రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ, స్కూళ్లకు సెలవు..వీడియోలు ఇవిగో

Arun Charagonda

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో రహదారులు జలమయం అయ్యాయి. పలు విమాన సర్వీసులు రద్దు కాగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ఇక ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.

Advertisement

Telugu States Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు భారీ వర్ష సూచన, హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, ఎమర్జెన్సీ నంబర్లు ఇవే..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్షాల అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్ల­డించింది.

Technical Glitch in Hyderabad-Tirupati Flight: హైదరాబాద్-తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్.. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య .. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన విమానంలో ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

Rain Alert: అల్పపీడనం ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అతి భారీ వర్షాలు

Rudra

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాలలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలు తూర్పు-పశ్చిమ ద్రోణితో కలిగి అల్పపీడనంగా మారాయి.

Supreme Court:సుప్రీం కోర్టు యూ ట్యూబ్ ఛానల్ హ్యాక్‌, త్వరలో సేవలు పునరుద్దమవుతాయని వెల్లడి

Arun Charagonda

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ఆ ఛానెల్‌ని తొలగిస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. యూట్యూబ్ ఛానెల్‌ సేవలు త్వరలో పునఃప్రారంభం చేస్తామని వెల్లడించారు.

Advertisement
Advertisement