సమాచారం
Cyclone Hamoon: ఈ ఉదయం 6 గంటలకు తీవ్ర తుపానుగా మారిన హమూన్.. ఏడు రాష్ట్రాలకు హెచ్చరిక.. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక.. రేపు బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం..
Rudraవాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘హమూన్’ తీవ్ర తుపానుగా మారినట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి బుధవారం మధ్యాహ్నం బంగ్లాదేశ్‌ లోని ఖేపుపారా-చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది.
Winter Season: తెలంగాణలో మొదలైన చలి పంజా.. త‌గ్గుముఖం ప‌ట్టిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆదిలాబాద్‌ లో 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ నమోదు
Rudraతెలంగాణలో గ‌జ‌గ‌జ మొద‌లైంది. చ‌లి వ‌ణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వ‌ర‌కు ప‌గ‌లు, రాత్రి స‌మ‌యాల్లో ప్ర‌జ‌లు ఉక్క‌పోత‌తో అల్లాడిపోయారు. నైరుతి రుతుప‌వ‌నాలు తిరుగుముఖం ప‌ట్ట‌డంతో తెలంగాణ వైపు శీత‌ల గాలులు వీస్తున్నాయి.
Cyclone Tej Update: రాత్రికి తేజ్ తుఫానుగా మారనున్న వాయుగుండం, ఒడిశా తీరానికి హై అలర్ట్, ఈ సైక్లోన్ తీరం ఎక్కడ దాటుతుందంటే..
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన లోతైన అల్పపీడనం సోమవారం సాయంత్రం నాటికి తుఫానుగా మారవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) బులెటిన్‌లో తెలిపింది. తుఫాను ఏర్పడిన తర్వాత దీనిని ఇరాన్ పెట్టిన పేరు 'హమూన్' అని పిలుస్తారు
Cyclone Tej: బలపడుతున్న తేజ్ తుఫాను.. ఆదివారం మధ్నాహ్నానికి మరింత తీవ్రం.. తీవ్ర తుఫానుగా మారే అవకాశం.. గుజరాత్‌ కు ఐఎండీ అలర్ట్
Rudraభారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత తీవ్రంగా బలపడుతోందని ప్రకటించింది.
Weather Forecast: బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, ఈనెల 23తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం, ఏపీలో భారీ వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ
Hazarath Reddyనేడు అండమాన్‌ సముద్రా­నికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రేపటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.
Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ జీవో విడుదల
Hazarath Reddyనిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలోనే గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది.
NaMo Bharat RapidX Train: గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో ర్యాపిడ్‌ ఎక్స్‌ రైలు, నమో భారత్ సెమీ హైస్పీడ్‌ ట్రైన్ ప్రత్యేకతలు ఇవిగో..
Hazarath Reddyనమోభారత్‌ రైళ్లలో అన్నీ ఏసీ పెట్టెలే ఉంటాయి. ప్రతి రైలులో 2+2 తరహాలో సీట్లు ఉంటాయి. నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, సామాన్లు ఉంచేందుకు అరలు, సీసీటీవీ కెమెరాలు, అత్యవసర నిష్క్రమణ మార్గాలు, లాప్‌టాప్‌/మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, రూట్‌మ్యాప్‌లు, దానంతట అదే నియంత్రించుకునే లైటింగ్‌ వ్యవస్థ ఉంటాయి.
Dasara Special Trains: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. నేడు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు
Rudraదసరా (Dasara) సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరోమారు గుడ్‌ న్యూస్ (Good News) చెప్పింది.
Weather Forecast: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, అల్పపీడనం ప్రభావంతో పొంచి ఉన్న తుఫాను ముప్పు, మళ్లీ భారీ వర్షాలు తప్పవని హెచ్చరిక
Hazarath Reddyమండే ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురును వాతావరణ శాఖ అందించింది.ముఖ్యంగా ఏపీలో మళ్లీ వానలు భారీగా కురుస్తాయని తెలిపింది. అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. ఇది సముద్రమట్టానికి 4.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ అధికారులు చెప్పారు.
Cyclone Tej: తేజ్ తుఫానుపై ఐఎండీ భారీ హెచ్చరిక, అరేబియా సముద్రంలో సైక్లోన్ వచ్చే అవకాశం ఉందని వెల్లడి, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఏంటంటే..
Hazarath Reddyఅరేబియా సముద్రంలో ఏర్పడే అవకాశం ఉన్న తుఫాను కారణంగా మహారాష్ట్ర నగరంలో వాతావరణ మార్పుల గురించి భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది .రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని IMD వాతావరణ నవీకరణ సోమవారం వెల్లడించింది.
SSC Exams: మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు.. ఈసారీ ఆరు పేపర్లకే ఎగ్జామ్స్‌
Rudraవచ్చే ఏడాది మార్చిలో పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.
HC On Recording Phone Conversation: అది గోప్యత హక్కును ఉల్లంఘించడమే, భార్య ఫోన్ సంభాషణ ఆమెకు తెలియకుండా భర్త రికార్డు చేయడంపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyవ్యక్తికి తెలియకుండా అతని మొబైల్‌ ఫోన్‌ సంభాషణను రికార్డు చేయడం రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం వారి గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. 38 ఏండ్ల మహిళ తన భర్త నుంచి భరణం కోరుతూ వేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Dress Code in Puri Temple: పూరీ జగన్నాథ ఆలయంలో డ్రెస్‌ కోడ్‌.. వచ్చే జనవరి 1 నుంచి కోడ్ అమల్లోకి.. ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడమే లక్ష్యం
Rudraపూరీలోని శ్రీ జగన్నాథుని ఆలయంలో మెరుగైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పరచడం కోసం హుందాగా కనిపించే దుస్తులను ధరించాలని భక్తులను శ్రీ జగన్నాథ్‌ దేవాలయ పాలక మండలి కోరింది.
Dasara Holidays in AP: ఏపీ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు, అక్టోబరు 14 నుంచి 24 వరకూ 11 రోజుల పాటు హాలీడేస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
UTS Mobile App: కొత్త ట్రిక్‌ తో రైల్వేకు బురిడీ కొట్టిస్తున్న టికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న కేటుగాళ్లు.. యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ సాయంతో ట్రిక్
Rudraటికెట్‌ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న కొందరు కేటుగాళ్లు సరికొత్త విధానంతో ట్రైన్‌ టికెట్‌ ఎగ్జామినర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల కోసం రైల్వే యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ యాప్‌ ను తీసుకొచ్చింది.
ISRO: ఇస్రోలో చేరడానికి ఇంజనీర్లు ఇష్టపడటం లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఛైర్మెన్ సోమనాథ్, జీతాలు చాలా తక్కువని అందుకే దూరమవుతున్నారని వెల్లడి
Hazarath ReddyISRO..భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, దాని ప్రపంచ విజయాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు IITల నుండి అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడంలో సవాళ్లను ఎదుర్కొంటుంది.
SC on Marriage: భారతీయ సమాజంలో వివాహం అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, వృద్ధ దంపతుల కేసులో విడాకుల మంజూరుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
Hazarath Reddyచాలా ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నప్పటికీ 89 ఏళ్ల భర్తకు 82 ఏళ్ల వయసున్న 89 ఏళ్ల భర్తకు విడాకులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం అక్టోబర్ 10న తిరస్కరించింది.
Tirumala Srivari Brahmotsavam: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్, ఈ నెల 15వ తేదీ నుంచి 9 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు, 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
Hazarath Reddyఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీన గరుడ సేవ, 20వ పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.
Gold Rates Increased: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు.. 24 గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200
Rudraబంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది.
TSRTC Special Buses for Dasara: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేకుండానే..
Rudraబతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సుల ఏర్పాటు