Information

Bank Holidays in August 2023: బ్యాంకు పనులు ఉంటే వెంటనే పూర్తి చేయండి, ఆగస్టులో 14 రోజులు బ్యాంకులు క్లోజ్, తెలుగు రాష్ట్రాల అప్‌డేట్ ఇదిగో..

Hazarath Reddy

బ్యాంకు పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవద్దు ఎందుకంటే వచ్చే ఆగస్టు నెల లో బ్యాంకులకు ఎక్కువగా సెలవులు వస్తున్నాయి. రాష్ట్రాల వారీగా ఈ సెలవులు మారాయి. స్థానిక పండగలు ఆయా రాష్ట్రాల్లో బ్యాంక్ సెలవులను నిర్ణయించడం జరుగుతుంది. ఆగస్టు, 2023లో బ్యాంకులు ఏకంగా 14 రోజుల పాటు పని చేయవని తెలుస్తోంది.

PM Kisan Installment Date: రైతులకు గుడ్ న్యూస్, ఈ నెల 27న పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి, PM కిసాన్ స్థితిని ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 14వ విడతను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రభుత్వం దాదాపు రూ.8.5 కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ఒక విడతకు రూ. 2000 మరియు ఒక సంవత్సరంలో మొత్తం రూ. 6000 అందుకుంటారు.

PM Kisan 14th Installment Date: ఈ నెల 27న రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు, లిస్టులో మీ పేరు ఉందో లేదో ఈ ప్రాసెస్ ద్వారా తెలుసుకోండి

Hazarath Reddy

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 14వ విడతను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ప్రభుత్వం దాదాపు రూ.8.5 కోట్లు విడుదల చేయనుంది. ఈ పథకం కింద, అర్హులైన రైతులు ఒక విడతకు రూ. 2000 మరియు ఒక సంవత్సరంలో మొత్తం రూ. 6000 అందుకుంటారు.

Typhoon Doksuri: పసిఫిక్ మహాసముద్రంలో మరో తుపాన్, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాగల కొన్ని గంటల్లో డోక్సురి టైఫూన్‌గా బలపడే అవకాశం

Hazarath Reddy

ప్రమాదకర టైఫూన్ (తుపాను)లకు పుట్టినిల్లుగా నిలిచే పసిఫిక్ మహాసముద్రంలో మరొక భీకర టైఫూన్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఇది టైఫూన్ స్థాయికి చేరుకుంది. అంటే, దీని ప్రభావంతో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇది ఫిలిప్పీన్స్ దీవులకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఈ టైఫూన్ కు డోక్సురి అని నామకరణం చేశారు.

Advertisement

Justice Dhiraj Singh Thakur: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ను నియమించాలన్న సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు

IRCTC Down: ఐఆర్సీటీసీ యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు.. ట్విట్టర్ లో వెల్లడించిన ఐఆర్సీటీసీ

Rudra

రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ముఖ్య సూచన చేసింది. టికెట్ కొనుగోలు విషయంలో యాప్, వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొంది. దీని కారణంగా టికెట్ చెల్లింపులు జరపడం కష్టంగా మారిందని.. దీనికి ప్రత్యామ్నయంగా ఆస్క్ దిశాను సంప్రదించాల్సిదిగా కోరారు.

Telangana Rains: రానున్న మూడ్రోజులు మరింత దంచికొట్టనున్న వానలు.. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌

Rudra

తెలంగాణలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్‌, ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని సూచించింది.

IMD Weather Forecast: వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం, ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

Hazarath Reddy

దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది.

Advertisement

Telangana Weather Update: తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ, రాగల 3 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచన

Hazarath Reddy

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది.

Rains in Telugu States: రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

Rudra

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Tirumala Venkateswara Swamy Assets: తిరుమల శ్రీవారి పేరిట రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు.. బ్యాంకులో 11 టన్నుల బంగారం.. టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీప్రాంతం.. తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలను వెల్లడించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించేందుకు రోజూ లక్షలాది మంది ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడు అని తెలిసిందే.

IND vs WI, Ishan kishan: రిషబ్ పంత్ స్థానంలో టీమిండియాకు మరో కీపర్ బ్యాట్స్ మన్ దొరికేశాడు, వెస్టిండీస్ తో రెండో టెస్టు మ్యాచ్‌లో మెరిసిన ఇషాన్ కిషన్..

kanha

వెస్టిండీస్ తో రెండవ టెస్ట్ మ్యాచ్‌లో, ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన విధానం ద్వారా అతని ఇన్నింగ్స్‌లో పంత్ లాంటి బ్యాటింగ్ ఉంది. ఈ యువ వికెట్ కీపర్ ఆటగాడు మైదానంలోకి ప్రవేశించిన వెంటనే దూకుడుగా నిలిచాడు. తక్కువ సమయంలో నాలుగు ఫోర్లు కొట్టాడు.

Advertisement

D K Shivakumar Is Richest MLA: దేశంలోనే అత్యంత ధనవంత ఎమ్మెల్యే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు

kanha

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు కాగా ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నవారు కర్ణాటకకు చెందిన వారేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది.

Rains Alert to Hyderabad: రానున్న 12 గంటల్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక.. ప్రమాదకరస్థాయికి హుస్సేన్ సాగర్

Rudra

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్ వర్షాలతో తడిసి ముద్దవుతుంది. రానున్న 12 గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

IMD Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, వచ్చే 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

Hazarath Reddy

కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Warning about Manholes: మ్యాన్‌ హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు.. భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి వార్నింగ్‌

Rudra

గడిచిన మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది.

Advertisement

Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు అతిభారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్న వాతావరణశాఖ.. 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ నెల 26 వరకు జోరువానలే

Rudra

భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతున్నది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉంది.

Earthquakes in Rajasthan: వరుస భూకంపాలతో వణికిపోయిన జైపూర్.. తెల్లవారుజామున 4.09 గంటల నుంచి 4.26 గంటల మధ్య మూడు భూకంపాలు.. ఏం జరుగుతోందో తెలియక హడలిపోయిన ప్రజలు

Rudra

వరుస భూకంపాలతో రాజస్థాన్ రాజధాని జైపూర్ వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.23 గంటల మధ్య మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.1 నుంచి 4.22 మధ్య ఉంది. భూకంప కేంద్రం భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు అధికారులు తెలిపారు.

SBI WhatsApp Banking: వాట్సాప్ ద్వారా 13 రకాల ఎస్‌బీఐ సేవలు పొందవచ్చు, ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ కోసం నమోదు, ప్రారంభించడానికి దశల కోసం క్లిక్ చేయండి

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాట్సాప్‌లో అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా WhatsApp ద్వారా SBI బ్యాంక్ సేవలను పొందవచ్చు. ఖాతా బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, పెన్షన్ స్లిప్, లోన్ సమాచారం, అనేక ఇతర SBI బ్యాంకింగ్ సేవలు WhatsAppలో అందుబాటులో ఉన్నాయి.

'No Caste' and 'No Religion': దరఖాస్తుల్లో విద్యతో పాటు నో క్యాస్ట్‌ , నో రిలీజియన్‌ కాలమ్‌ తప్పనిసరిగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం కోసం పెట్టుకునే దరఖాస్తులో కులం, మతం వద్దనుకునేవారికి వీలుగా ఓ కాలమ్‌ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. విద్యతో పాటు ఇతర అన్ని దరఖాస్తుల్లో ‘నో క్యాస్ట్‌’, ‘నో రిలీజియన్‌’ అనే కాలమ్‌ను తప్పుకుండా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement