Information

Bank Holidays in April 2022: ఏప్రిల్ నెలలో 15 రోజులు బ్యాంకులకు సెలవులు, రాష్ట్రాన్ని బట్టి సెలవుల్లో మార్పు, ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు పూర్తి జాబితా ఇదే..!

Hazarath Reddy

ఏప్రిల్ నెలలో మీకు ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే మీరు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు (Bank Holidays in April 2022) మొత్తం 15 రోజులు సెలవులు వస్తున్నాయి.

Weather Forecast: ఎండలు బాబోయ్ ఎండలు, తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వడగాడ్పులు, తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే వడగాడ్పులు రంగప్రవేశం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎండలు (Heat Wave) పెరుగుతున్నాయి. క్రమేపి పగటి ఉష్ణోగ్రతలలో మార్పు కనిపిస్తోంది.

TS EAMCET 2022: టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్ విడుదల, ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

Hazarath Reddy

టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను (TS EAMCET 2022) స్వీక‌రిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు.

Aadhaar Seeding With Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆధార్‌తో రేషన్‌కార్డు లింక్ గడువు పొడిగింపు, జూన్ 30 వరకు తేదీ పొడిగించిన శాఖ, రేషన్ కార్డుకు ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసా?

Naresh. VNS

దేశంలో రేషన్ కార్డుదారులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా రేషన్ కార్డును ఆధార్ తో అనుసంధానం (Aadhaar seeding) గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్ 30 వరకు కార్డుదారులు రేషన్ సరఫరాలను పొందడంతో పాటు ఇతర పధకాలను, ప్రభుత్వ సౌకర్యాలను పొందుతారని ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు చివరి తేదీని (Last Date) మార్చి 31, 2022గా నిర్ణయించారు.

Advertisement

AP EAPCET 2022: ఏపీ ఈఏపీ సెట్‌ షెడ్యూల్ విడుదల, జూలై 24 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ విభాగపు పరీక్షలు, ఏప్రిల్‌ 11న ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలిపిన మంత్రి సురేష్

Hazarath Reddy

ఏపీ ఈఏపీ సెట్‌(EAPCET) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. అగ్రికల్చర్‌ విభాగంలో జూలై 11, 12 తేదీలలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిచనున్నట్లు తెలిపారు.

TS EAMCET 2022: తెలంగాణలో జూలై 14 నుంచి ఎంసెట్, జూలై 13న ఈసెట్, జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు, జూలై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. జూలై 13న ఈసెట్ జరగనుండగా, జులై 14 నుంచి ఎంసెట్ (TS EAMCET 2022) షురూ కానుంది. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరపనున్నారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Cyclone Asani: ముంచుకొస్తున్న ముప్పు, దూసుకొస్తున్న మరో తుఫాన్, అసని నుంచి భారత్‌కు ముప్పు తక్కువని తెలిపిన ఐఎండీ, తాండ్వే సమీపంలో తీరం దాటే అవకాశం

Hazarath Reddy

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముందుగా తీవ్ర అల్పపీడనంగా మారి తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సోమవారం వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది

Cyclone Asani: తీరం వైపు దూసుకొస్తున్న అసని తుఫాన్, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఏపీలో కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు

Hazarath Reddy

దేశాన్ని వణికించడానికి ఈ ఏడాది తొలి తుఫాన్ (Cyclone Asani) రెడీ అయింది. అసని తుఫాను కల్లోలం రేపడానికి తీరం వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 12 గంటల్లో (Deep Depression During Next 12 Hours) తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది.

Advertisement

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, గుంటూరు డివిజన్‌ మీదుగా రామేశ్వరం వెళ్లేందుకు స్పెషల్ ట్రైన్స్, సికింద్రాబాద్‌–రామేశ్వరం–సికింద్రాబాద్‌ వయా గుంటూరు మీదుగా రాకపోకలు

Hazarath Reddy

ఏపీ నుంచి రామేశ్వరం వెళ్లేవారికి ఇండియన్ రైల్వే శుభవార్త తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని సికింద్రాబాద్‌–రామేశ్వరం–సికింద్రాబాద్‌ వయా గుంటూరు డివిజన్‌ మీదుగా పలు రైళ్లు కేటాయించడం జరిగిందని రైల్వే డివిజన్‌ సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ గురువారం వెల్లడించారు

Cyclone Asani: అసని తుఫాను అలజడి, ఈ ఏడాది భారత్‌ను తాకడానికి దూసుకొస్తున్న తొలి సైక్లోన్, మధ్య బంగాళాఖాతంలో మార్చి 21న ఆసని తుఫాన్‌ ఏర్పడే అవకాశం

Hazarath Reddy

ఈ ఏడాది భారత్‌ను తాకడానికి తొలి తుఫాన్ ఆసని దూసుకొస్తోంది. నైరుతి హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని.. వచ్చే వారం ప్రారంభంలో అది తుఫానుగా మారుతుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (IMD) ఇది వరకే హెచ్చరించింది.

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాక్, యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ ఎవరికైనా ఫార‍్వడ్‌ చేస్తే అదనంగా డబ్బులు చెల్లించాల్సిందే

Hazarath Reddy

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాకిచ్చింది. ప్రీమియం యూజర్లు అకౌంట్‌ డీటెయిల్స్‌ వారి కుటుంబ సభ్యులకు,లేదంటే స్నేహితులకు ఫార‍్వడ్‌ చేస్తే (Sharing your Netflix password ) అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి (charge you extra for sharing your password) ఉంటుందని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Jet Fuel Prices Hiked: చమురు సంస్థల షాక్, భారీగా పెరిగిన జెట్‌ ఇంధనం ధరలు, సామాన్యులకు విమాన ప్రయాణం ఇక భారమే

Hazarath Reddy

కరోనావైరస్ రాకతో ఏవియేషన్ రంగం పూర్తిగా కుదేలైన సంగతి విదితమే. కోవిడ్ లాక్ డౌన్ లో భాగంగా పలుదేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా కాస్త తగ్గడంతో విమానయాన రంగం వేగం పుంజుకుంది.

Advertisement

Provident Fund Rate Slashed: ఉద్యోగులకు కేంద్రం షాక్, పీఎఫ్ వడ్డీరేటు భారీగా తగ్గింపు, 40 ఏళ్లలో ఇంత తక్కువ వడ్డీరేటు ఎన్నడూ లేదు, ప్రభుత్వానికి ప్రతిపాదించింది ఎంతంటే?

Naresh. VNS

ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది కేంద్ర ప్రభుత్వం. ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund ) పై వడ్డీరేటును భారీగా తగ్గించే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్‌పై వడ్డీరేటును (Interest rate) 40 ఏళ్ల కనిష్ఠానికి తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ జమలపై 8.1శాతం వడ్డీ ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Odisha MLA Vehicle On Crowd: ఒడిశాలో మరో లఖీంపూర్ ఖేరీ తరహా ఘటన, ప్రజలపై దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు, ఒకరు మృతి, 22 మందికి పైగా గాయాలు

Krishna

ఒడిశా ఖుర్దాలో విషాదం చోటు చేసుకుంది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్​ జగ్​దేవ్​ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది ప్రజలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.

Rape On Woman: భర్త పరాయి మహిళపై అత్యాచారం చేస్తుంటే, దగ్గరుండి ప్రోత్సహిస్తూ, వీడియో తీసిన భార్య, ఆపై బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేయడంతో, ఏం జరిగిందంటే..

Krishna

నిందితుడు బాధితురాలిపై బలవంతంగా అత్యాచారం చేశాడు. తన భర్త అలా చేస్తుండగా ఆ భార్య ఫోటోలు, వీడియోలు తీసింది. వాటిని చూపించి ఇంకో రోజు మళ్లీ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ పిల్లల్ని చంపేస్తామని, ఈ ఫోటోలు అందరికీ చూపించి మీ పరువు తీస్తామని బెదిరించారు.

Pulwama Encounter: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్, ఒక ఉగ్రవాది హతం, మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న భారత జవాన్లు

Krishna

జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

7 Dead In Major Fire At Delhi Gokalpuri: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, మురికివాడలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం, 60 గుడిసెలు దగ్ధం,

Krishna

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మురికివాడలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఢిల్లీలోని గోకుల్ పురిలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది.

RBI Bans Paytm Payments Bank: పేటీఎంకు ఆర్బీఐ షాక్! కొత్త కస్టమర్లను తీసుకోకుండా నిషేదం, ఆడిట్ పూర్తయ్యేవరకు పేటీఎంపై కొనసాగనున్న ఆంక్షలు, నిషేదం ఎందుకో తెలుసా?

Naresh. VNS

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు (Paytm Payments Bank)పై భారత రిజర్వ్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కొన్ని మెటీరియల్ సూపర్ వైజరీ సమస్యల కారణంగా ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై తాత్కాలిక నిషేధం విధించింది.

SBI Hikes FD Interest Rates: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంపు, తక్షణమే అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు, వివరాలివే!

Naresh. VNS

ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంటుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)పై చెల్లించే వడ్డీ (Interest) రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. SBI వెబ్‌సైట్ ప్రకారం.. రూ.2 కోట్ల కన్నా ఎక్కువ బల్క్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను (Interest Rates) 20 నుంచి 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు SBI తెలిపింది.

Uttar Pradesh Assembly Election Results 2022: అఖిలేష్ యాదవ్‌కు రెండో సారి కూడా దక్కని విజయం, తండ్రి వ్యూహాలను పక్కన పెట్టడమే కొంప ముంచిందా, సమాజ్‌వాదీ పార్టీ ఓటమికి కారణాలు ఇవే..

Krishna

2012 ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గెలిచింది. అయితే ఆ గెలుపు తన వల్లనేనన్న భ్రమలో ఉన్న అఖిలేష్ యాదవ్ కుటుంబాన్ని పక్కన పెట్టారు. సొంత బాబాయిని దూరం చేసుకున్నారు. ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు తనదేనని బలంగా విశ్వసించిన అఖిలేష్ కు నిరాశే ఎదురయింది.

Advertisement
Advertisement