
Maha Shivaratri 2025 Wishes In Telugu: మహా శివరాత్రి సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున పరమశివుడిని ఆరాధిస్తారు. ఈ రోజు శివుడు లింగ రూపంలో ప్రథమంగా అవతరించారని నమ్ముతారు. అలాగే ఈ రోజునే సృష్టి ప్రారంభమైందని పురుణాలు చెబుతున్నాయి. సృష్టి, స్థితి, లయలో లయకారుడు శివుడు. అందుకే ఈ రోజు ఎంతో ప్రాశస్త్యం తెచ్చుకుంది. మహా శివరాత్రి రాత్రి జాగరణ చేయడం, ధ్యానం చేయడం మరియు ప్రార్థనలు చేయడం వలన ఆధ్యాత్మిక ఉన్నతికి దారి తీస్తుందని, ఇది మోక్షం పొందడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఈ రోజు నక్షత్రాలు అత్యంత అనుకూలంగా ఉంటాయని, ఈ సమయంలో చేసే ధ్యానం మనిషి చైతన్యాన్ని పెంచుతాయని నమ్ముతారు. శివుని ఈ రోజు ఆరాధించడం ద్వారా అతని కరుణ, ఆశీర్వాదాలు పొందవచ్చని హిందువులు నమ్ముతారు, ఇది జీవితంలో సుఖం, సంపద మరియు విజయానికి దారి తీస్తుంది. మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, పూజలు చేయడం వలన మన పాపాలు నశించి, ముక్తి మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు. శివరాత్రి ఉత్సవాలు సాధారణంగా శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, జాగరణలు మరియు భక్తి సంగీతం ద్వారా జరుపుకుంటారు. ఈ రోజు ఉపవాసం ఉండటం కూడా పవిత్రమైన ఆచారంగా భావిస్తారు.
మృత్యుంజయ మంత్రం - ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
శివ పంచాక్షర స్తోత్రం - నగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ
ఓం నమః శివాయ - పంచాక్షరి మంత్రం, అన్ని శివ మంత్రాలలో అత్యంత శక్తివంతమైనది.
శివ తాండవ స్తోత్రం - జటాటవీగలజ్జల ప్రవాహపావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్
శివాష్టకం - ప్రభో శివాయ శాశ్వతాయ దేవదేవ నాగభూషణాయ గౌరీపతయే పశూనాం పతయే నమో నమః