గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన సభ కౌరవ సభ. కౌరవసభను గౌరవసభ చేశాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేశా. గౌరవసభను అవమానించే పార్టీ ఇవాళ అసెంబ్లీలో లేకుండా పోయింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం ఎప్పుడూ చూడలేదు. సంప్రదాయాలను మరిచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేం కాదు.. ప్రజలు. నిన్న వైసీపీ నేతలు కేవలం 11 నిమిషాలే సభలో ఉన్నారని అన్నారు.
CM Chandrababu on 11 Number:
నా 41 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి వాళ్ళను చూడలేదు..
11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు వచ్చి 11. 11 నిమిషాలకు బాయ్ కాట్ చేసి వెళ్లారు.. - సీఎం చంద్రబాబు #chandrababu #APAssembly pic.twitter.com/HTG6I1TlRX
— RTV (@RTVnewsnetwork) February 25, 2025
ప్రజలు వాళ్లకి 11 సీట్లు ఇస్తే
సరిగ్గా 11 గంటలకు అసెంబ్లీకి వచ్చి
11 గంటల 11 నిమిషాలకు వెళ్లిపోయారు
ఈ గ్యాప్ లోనే స్పీకర్ ని కూడా అవమానించారు
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు pic.twitter.com/RNTiqraY3T
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)