ఏపీలోని నందిగామలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఒక RTC డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. 112 అత్యవసర కాల్ కు స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, CPR ఇచ్చి, అతని ప్రాణాలను కాపాడి, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. సమాజానికి నిజమైన సంరక్షకులు పోలీసులు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్స్ వేదికగా ఏపీ పోలీస్ ట్వీట్ చేస్తూ ఒక ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలను కాపాడడంలో వీరోచిత చర్య చేసిన VjaCityPoliceకు అభినందనలు.
మీ అంకితభావం, ధైర్యం మరియు మనస్సాక్షికి అత్యున్నత ప్రశంసలు అని DGP హరీష్ కుమార్ గుప్తా ప్రశంసించారు. ప్రస్తుతం పేషెంట్ పరిస్థితి నిలకడగా ఉంది. సమయస్పూర్తితోడ్రైవర్ ప్రాణాలు కాపాడిన ఏపీ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
AP Police Saved RTC Driver Life Who suffer sudden cardiac arrest
✅#APPolice Always There In Times Of Crisis.
An RTC driver suffered a sudden cardiac arrest near the old bus stand in Nandigama. Responding to a 112 emergency call, the police swiftly arrived, administered CPR, and saved his life before ensuring his prompt hospitalization.(1/2) pic.twitter.com/RadKWZLTon
— Andhra Pradesh Police (@APPOLICE100) February 25, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)