New Delhi, AUG 03: ఏడేళ్ల వయసులోనే తలకు మించిన బాధ్యతను మోస్తున్నాడో బాలుడు. తండ్రి ప్రమాదానికి గురై ఇంట్లో ఉంటే.. అతడి స్థానంలో పనిచేస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ బాలుడికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా (viral)మారింది. తండ్రిగా అండగా నిలబడటంతోపాటు, కుటుంబాన్ని పోషిస్తున్నందుకు నెటిజన్లు ఆ బాలుడ్ని ప్రశంసిస్తున్నారు. రాహుల్ మిట్టల్ (Rahul mittal) అనే సామాజిక కార్యకర్త తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వివరాల్ని షేర్ చేశారు. అయితే, బాలుడికి సంబంధించిన పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. రాహుల్ ట్విట్టర్ ప్రకారం.. ఏడేళ్ల ఒక బాలుడి (7-Year-Old Boy) తండ్రికి ఇటీవల యాక్సిడెంట్ జరిగింది. అతడి తండ్రి జొమాటో డెలివరీ బాయ్‌గా(Zomato Delivery) పని చేసేవాడు. కానీ, ప్రస్తుతం అతడు ఫుడ్ డెలివరీ చేసే అవకాశం లేకుండా పోయింది.

దీంతో అతడి ఏడేళ్ల కొడుకు (7-Year-Old Boy)ఆ బాధ్యత తీసుకున్నాడు. ఉదయం పూట స్కూల్‌కు వెళ్లడానికి ముందు, స్కూల్ ముగిసిన తర్వాత సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు బాలుడు జొమాటో ఫుడ్ డెలివరీ (Zomato Delivery) చేస్తున్నాడు. అది కూడా సైకిల్‌పై తిరుగుతూ. తన తండ్రి కోలుకునేంత వరకు ఈ పని చేయనున్నట్లు బాలుడు చెప్పాడు. తండ్రి అకౌంట్ నుంచి బాలుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు. బాలుడు ఫుడ్ డెలివరీ చేస్తున్న దృశ్యాన్ని రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేశాడు.

Specially-Abled Zomato Agent: వీల్‌ఛైర్‌పై ఫుడ్‌ డెలివరీ చేస్తున్న దివ్యాంగుడు, హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు, వీల్‌ఛైర్‌లో ఫుడ్‌డెలివరీ చేస్తూ బతుకుబండి ఈడుస్తున్న చెన్నైవాసి, గొప్పస్పూర్తికి సలాం కొడుతున్నామంటూ కామెంట్లు, వైరల్‌గా మారిన వీడియో! చూడండి  

ప్రస్తుతానికి దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. బాలుడి కష్టాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. తన తండ్రి త్వరగా కోలుకుని, బాలుడు చదువుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అయితే మరికొందరు మాత్రం చిన్నపిల్లాడితో పని చేయిస్తున్నందుకు నెగెటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు.