Lucknow, September 16: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. భారీ వర్షాల ధాటికి ఓ గోడ కూలి 12 మంది కూలీలు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో నిన్న కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నిన్న ఈ నెలలోనే అక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు, అల్పపీడనం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వానల కారణంగా నేడు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
Lucknow city wall collapsed after Heavy #Rain near-Dilkusha in #Lucknow#HeavyRain #UP pic.twitter.com/bVPaz25gUB
— Himanshu dixit 🇮🇳💙 (@HimanshuDixitt) September 16, 2022