P&H High Court: పరస్పర అంగీకారంతో పెళ్లికి ముందు సెక్స్ చేస్తే తప్పుకాదు, పంజాబ్&హర్యానా హైకోర్టు సంచలన తీర్పు, పెళ్లయ్యాక కూడా ఆ వ్యక్తితో లైంగిక సంబంధం కొనసాగించినప్పుడు మాత్రమే
Representational Image (Photo Credit: ANI/File)

Chandigarh, FEB 15: పెళ్లిపేరుతో లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో (Consent On Pretext Of Marriage) కీలక వ్యాఖ్యలు చేసింది పంజాబ్ & హర్యానా హైకోర్టు. నిందితుడికి పెళ్లి అయిన తర్వాత కూడా అతనితో బాధితురాలు లైంగిక సంబంధం కొనసాగిస్తే (Continues Relationship With Man)...అది రేప్ కిందకు రాదని స్పష్టం చేసింది. ఓ కేసులో విచారణ చేపట్టిన కోర్టు... ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్రయల్ కోర్టు దోషిగా తేల్చిన వ్యక్తిపై అభియాగాలను కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటానని లైంగికంగా వాడుకున్న వ్యక్తికి వేరే మహిళతో పెళ్లయిన తర్వాత కూడా లైంగిక సంబంధం కొనసాగిస్తే ఆరోపణల్లో బలం ఉండదని తెలిపారు న్యాయమూర్తులు.

పంజాబ్‌ కు చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఓ వ్యక్తితో పెళ్లికి ముందు సంబంధం పెట్టుకుంది. అయితే అతనికి పెళ్లయిన తర్వాత కూడా లైంగిక సంబంధాన్ని కొనసాగించింది. కానీ అతనిపై రేప్ కేసు పెట్టింది. దీంతో ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. కానీ నిందితుడు పంజాబ్& హర్యానా హైకోర్టును (P&H High Court) ఆశ్రయించడంతో, ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జస్టిస్ సురేశ్వర్ ఠాకూర్, జస్టిస్ కుల్దీప్ తివారీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.