News
Harishrao Vs Rajagopal Reddy: అసెంబ్లీలో హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం, హరీశ్ రావు దొంగ...కోమటిరెడ్డి యూజ్‌లెస్ ఫెలో అని తిట్టుకున్న ఇద్దరు నేతలు...తీవ్ర వాగ్వాదం
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్ రావు వర్సెస్ కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి దొంగ అని హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించగా ఎవడా యూజ్‌లెస్‌ఫెలో అని ఫైర్ అయ్యారు హరీశ్. దీంతో తీవ్ర వాగ్వాదం జరుగగా ఇద్దరి మాటలను రికార్డుల నుండి తొలగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
Hydra Demolitions: మణికొండలో ఆక్రమణల తొలగింపు, అధికారులు - వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ లోని మణికొండ అల్కపూరి కాలనీలో ఆక్రమణలను తొలగించారు అధికారులు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ గా వ్యాపార సముదాయాలు నడుపుతున్నారు. వారం రోజుల క్రితం స్పాట్ ను విజిట్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా కమిషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాల తొలగించారు అధికారులు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, అసెంబ్లీ సరిగా నడపడానికి చేతకాని వాళ్లు అసలు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నారు, మండిపడిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
Hazarath Reddyవీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపకలేపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కోపంతో తన చేతిలో ఉన్న పేపర్‌ను విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్
Arun Charagondaఎన్టీఆర్ ఘాట్ కూల్చేయాలని తాను అన్నట్లు కొంతమంది కావాలనే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ లాబిలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే వివేకానంద, బాల్క సుమన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని ఆ పార్టీ ట్రాప్‌లో పడేది లేదన్నారు.
Virat Kohli: వీడియో ఇదిగో, తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారంటూ మీడియాపై మండిపడిన విరాట్ కోహ్లీ
Hazarath Reddyఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్‌లో విమానాశ్రయం నుంచి హోటల్ రూమ్‌కు వెళ్తుండగా ఆయన కుటుంబాన్ని ఫొటోలు, వీడియోలు తీయడానికి మీడియా ప్రయత్నించింది. తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు ఎలా తీస్తారని కోహ్లి ఓ మహిళా జర్నలిస్టుతో గొడవకు దిగారు
Uttar Pradesh: దారుణం, న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తిని 41 సెకండ్లలో 31 సార్లు చెంపల మీద కొట్టిన పోలీస్ అధికారి, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyస్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) సుధాకర్ కశ్యప్ న్యాయం కోరుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తిని పదే పదే కొట్టాడు. ఎస్‌హెచ్‌ఓ ప్రవర్తనను చూపించే కలతపెట్టే వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. 41 సెకన్ల వ్యవధిలో ఎస్‌హెచ్‌ఓ వ్యక్తిపై 31 సార్లు కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
Bird Flu in US: అమెరికాలో పక్షుల నుంచి మనిషికి సోకిన బర్డ్‌ఫ్లూ వైరస్, కాలిఫోర్నియాలో ఏకంగా 34 మందికి H5N1 వైరస్, రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన గవర్నర్
Hazarath Reddyసెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) డిసెంబర్ 18 బుధవారం నాడు, మానవునిలో బర్డ్ ఫ్లూ లేదా H5N1 వైరస్ యొక్క మొదటి తీవ్రమైన కేసును US నివేదించింది. ఒక ప్రకటనలో, CDC ఒక రోగి సంక్రమణ యొక్క తీవ్రమైన కేసుతో లూసియానాలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది
Argentina Plane Crash: వీడియో ఇదిగో, అర్జెంటీనాలో ఘోర విమాన ప్రమాదం, విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ సమీపంలోని భవనంపైకి దూసుకెళ్లిన ఫ్లైట్
Hazarath Reddyఅర్జెంటీనాలోని శాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ విమానం భవనంపైకి దూసుకెళ్లింది. అర్జెంటీనాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి
Hazarath Reddyభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను వివాదాన్ని రేకెత్తించగా, దానికి ప్రతిగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు
Tirumala: తిరుమల సమాచారం..జనవరి 10 నుండి వైకుంఠ ద్వారా దర్శనం, వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ
Arun Charagondaతిరుమల వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల షెడ్యూల్‌ను జారీ చేసింది టీటీడీ. ఈనెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‍లైన్‍లో శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుండగా 24న ఉదయం 10 గంటలకు ఆన్‍లైన్‍లో ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Hazarath Reddyబీఆర్ అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం మండిపడ్డారు. పార్లమెంట్‌లో షా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాల ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి పొడిగింపు మాత్రమేనని ఆయన అన్నారు
Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Hazarath Reddyపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్లమెంటులో పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
Telangana Assembly Sessions: మంత్రులే ప్రశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్
Arun Charagondaతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తొలుత మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటి అని చురకలు అంటించారు.
‘BJP MPs Pushed Me’: వీడియో ఇదిగో, బీజేపీ ఎంపీలే తనను నెట్టివేశారు, తోపులాటపై స్పందించిన రాహుల్ గాంధీ, పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారని వెల్లడి
Hazarath Reddyపార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. నేడు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు.
Parliament Chaos: వీడియో ఇదిగో, పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లకు గాయాలు, అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి డిమాండ్
Hazarath Reddyపార్లమెంట్‌లోని మకర ద్వారం వద్ద .. ఇండియా కూటమి, బీజేపీ ఎంపీలు ఎదురుపడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఆ ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.
Parliament Chaos: పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం, రాహుల్ గాంధీ తోయడంతోనే కిందపడ్డానని తెలిపిన ఒడిషా ఎంపీ
Hazarath Reddyపార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనల సందర్భంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారు. ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తోపులాటలో కిందపడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది
Viral Video: చెస్ నాట్యం... చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ఎత్తులతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Arun Charagondaచెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ఎత్తులతో డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు భారత క్రీడాకారుడు గుకేశ్. ఫైనల్‌లో ప్రత్యర్థిని గుకేశ్ ఓడించిన తీరును ఆధారంగా చేసుకుని నాట్యం చేశారు ఇద్దరు కళాకారిణులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, డోర్ బెల్ కొట్టి మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లిన దొంగ, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
Hazarath Reddyనార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్షి కోట్ సన్ సిటీలో ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్థులో కాలింగ్ బెల్ కొట్టి తెరిచిన వెంటనే మహిళ మెడలో నుంచి 4 తులాల పుస్తెలతాడును లాకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Rupee Falls to All-Time Low: డాలర్‌తో పోలిస్తే దారుణంగా క్షీణించిన రూపాయి విలువ, కేవలం రెండు నెలల్లోనే రూ.84 నుంచి రూ.85కు పడిపోయిన భారత కరెన్సీ
Hazarath Reddyడాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నేడు దారుణంగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే తొలిసారిగా 85 రూపాయలకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 25 బీపీఎస్‌ను తగ్గించడం, 2025 నాటికి మరిన్ని తగ్గింపులు ఉండే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది