News
Telugu States Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన.. తెలంగాణను వణికిస్తున్న చలి-పులి
Rudraబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని మూడు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
Game Changer Trailer Event: పుష్ప కంటే ఏ మాత్రం తగ్గేదే లే అంటున్న రామ్ చరణ్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈవెంట్ భారీగా ప్లాన్
VNSమెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రాబోతున్నట్లు తెలుస్తుంది. ‘గేమ్ ఛేంజర్ ట్రైలర్ (Game Changer Trailer) ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను (Game Changer Trailer Event) ముంబైలో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది
India Women Beat West Indies Women: టీమిండియా జైత్రయాత్ర, వెస్టిండిస్ పై ఘన విజయం, 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న మహిళా జట్టు
VNSమహిళల మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక చివరి మ్యాచ్‌లో (IND-W vs WI-W) భారత్ విజయ ఢంకా మోగించింది. 60 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడించింది. 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది.
Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్లోకి వచ్చే తేదీ ఖరారు, మిడ్ రేంజ్ ఎస్ యూవీల్లో గట్టి పోటీ ఇవ్వనున్న కారు
VNSప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) భారత్ మార్కెట్లో అత్యంత పాపులర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లు విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో-2025లో జనవరి 17న తన పాపులర్ ఎస్‌యూవీ కారు హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) కారు ఆవిష్కరించనున్నది.
ChatGpt On WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, ఇకపై చాట్ జీపీటీని ఇలా కూడా వాడుకోవచ్చు
VNSమైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ఓపెన్‌ఏఐ (OpenAI) మరో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ‘12 డేస్ ఆఫ్ ఓపెన్‌ఏఐ’ అనౌన్స్‌మెంట్స్‌లో భాగంగా తన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని (chatGPT) వాట్సప్‌లో అందుబాటులోకి తెచ్చింది. వేరే యాప్, అకౌంట్‌తో పనిలేకుండా నేరుగా వాట్సప్‌లోనే (Whatsapp) చాట్‌జీపీటీని వినియోగించొచ్చు.
KTR on ACB Case: రేవంత్ రెడ్డికి ఉన్న భయం అదే! అందుకే నాపై కేసు పెట్టారు, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
VNSరెండు రోజులుగా స్పీకర్‌ను కోరాం.. సభ నడుస్తోంది. కుంభకోణం లంబకోణం అని కేబినెట్‌లో పరిశోధించి.. ఏదో సాధించినట్లు లీకులు ఇస్తున్నారు. నాలుగు గోడల మధ్య నలుగురు సన్నాలు మాట్లాడుడు ఏంటి..? నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడుదాం.. దూద్ కా దూద్ పానీ కా పానీ అయితదిని చెప్పినం. కానీ ప్రభుత్వం భయపడుతోంది.
ACB Files Case Against KTR: కేటీఆర్‌కు షాక్, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏ1గా కేటీఆర్..ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ
Arun Charagondaఫార్మూలా ఈ- కార్ రేస్‌లో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ స్కాంలో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కేసు నమోదైంది. ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ. ఏ-1గా కేటీఆర్ పేరుని నమోదు చేశారు ఏసీబీ.
KTR on Formula E Race Case: రేవంత్ రెడ్డి చేసేది లత్కోర్ పని, ఫార్ములా -ఈ రేస్ కేసుపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్
Hazarath Reddyఫార్ములా – ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసేది లత్కోర్ పని అని ధ్వజమెత్తారు కేటీఆర్. ఫార్ములా -ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చించేందుకు రేవంత్ సర్కార్ భయపడుతోందని కేటీఆర్ తేల్చిచెప్పారు.
Telangana: ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ అవకతవకలపై విచారణ జరిపించేందుకు సిట్ ఏర్పాటు, హరీష్‌రావు విజ్ఞప్తి మేరకు సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్ట్ (ORR Toll contract)లో జరిగిన అవకతవకలపై సిఎం రేవంత్ రెడ్డి SIT విచారణకు ఆదేశించారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం
Hazarath Reddyముంబయి బోటు ప్రమాదంలో మొత్తం 105 మందిని ఐదు వేర్వేరు ఆసుపత్రుల్లో చేర్చామని, వారిలో 90 మంది డిశ్చార్జ్ అయ్యారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) గురువారం తెలిపింది. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉందని, 13 మంది మరణించారని BMC పేర్కొంది.
KISSIK Full Video Song: పుష్ప 2 ది రూల్ నుంచి కిస్ కిస్ కిస్ కిస్సిక్ ఫుల్ వీడియో సాంగ్ ఇదిగో, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్
Hazarath Reddyఅల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం నటి శ్రీలీల (Sreeleela) ఆడిపాడిన విషయం తెలిసిందే. ‘కిస్ కిస్ కిస్ కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట ఓ ఊపు ఊపింది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘కిస్సిక్’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది
Bizarre Incident: భర్తతో 12 ఏళ్లు కాపురం చేసిన భార్య, ప్రియుడితో రూంలో ఆ పనిలో ఉండి భర్తకు చిక్కడంతో ఇద్దరికీ పెళ్లి చేసిన భర్త, బీహర్‌లో విచిత్రకరమైన వార్త వెలుగులోకి..
Hazarath Reddyబీహార్‌లోని సహర్సా నగరంలో ఐకానిక్ బాలీవుడ్ చిత్రం హమ్ దిల్ దే చుకే సనమ్ యొక్క కథాంశం ప్రాణం పోసుకుంది. అక్కడ ఒక వ్యక్తి 12 సంవత్సరాల తన భార్యను వారి ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె ప్రియుడికి ఇచ్చి వివాహం చేశాడు.
Viral Video: షాకింగ్ వీడియో, మహిళను నీటిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి, గంట తర్వాత మృతదేహాన్ని నోట్లో పెట్టుకుని బయటకు రావడంతో షాక్
Hazarath Reddyనలుగురి పిల్లల తల్లి అయిన నూర్హవతి జిహురా (46) ఉత్తర సుమత్రాలోని తన తీరప్రాంత గ్రామం పక్కన ఉన్న సముద్రపు నీటిలో తన పాదాలను కడుగుతుండగా, మొసలి ఆమెపై దాడి చేసి నీటిలోకి లాగింది. ఆమె కేకలు విన్న స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు,
Nara Bhuvaneshwari on Balakrishna: బాలకృష్ణ నా తమ్ముడు కాదు అన్న, నా కన్నా రెండేళ్లు పెద్ద, నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..అందరు బాలకృష్ణ నా తమ్ముడు అనుకుంటారు కానీ ఆయన నా అన్న. నా కన్నా రెండేళ్లు పెద్దవాడని తెలిపారు.
Year Ender 2024: దేశంలో ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన సెలబ్రిటీ ఎవరో తెలుసా, అల్లు అర్జున్ ఎంత ట్యాక్స్ కట్టాడో తెలుసుకోండి, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddy2024లో భారతదేశం వివిధ రంగాలలో అపూర్వమైన అభివృద్ధిని చూసింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా త్రివర్ణాన్ని అలరించింది. వినోదం, క్రీడలు మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు 2024 సంపన్నుల జాబితాలో ఆధిపత్యం చెలాయించారు.
Viral Video: వీడియో ఇదిగో, బస్సులో తనను వేధించాడనే ఆరోపణతో తాగిన వ్యక్తిని 25 సార్లు చెంపదెబ్బలు కొట్టిన యువతి, పూణేలో ఘటన
Hazarath Reddyబస్సులో నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించిన యువతిని అనుచితంగా తాకేందుకు ప్రయత్నించిన యువకుడిపై మహిళ వరుసగా 26 సార్లు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. అయితే యువకుడు క్షమాపణలు కోరుతూ తన తప్పును అంగీకరిస్తున్నాడు.
Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి
Hazarath Reddyఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో కుంభకోణాల మీద కుంభకోణాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పూర్తిగా చంద్రముఖిగా మారిపోయారు..
Telangana: సూర్యాపేటలో అద్భుతం, శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం..పూజలు చేస్తున్న భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaసూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అద్భుతం జరిగింది. శివాలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. శివలింగం వద్ద నాగుపాము వచ్చి ఉండటంతో భక్తులు పూజలు చేస్తున్నారు. శివాలయంలో నాగు పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Telangana SSC Exam Dates: తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు, వచ్చే ఏడాది మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు..వివరాలివే
Arun Charagondaతెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి పదో తరగతి పరీక్షలు. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది ఎస్‌ఎస్‌సీ బోర్డు.