News

Viral Video: సోషల్ మీడియాలో వైరల్‌ కావడానికి ప్రమాదకర స్టంట్లు, గచ్చిబౌలిలో షాకింగ్ స్టంట్...వీడియో ఇదిగో

Arun Charagonda

సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నారు యువకులు. గచ్చిబౌలి వైపు ORR వద్ద గురువారం రోజు రాత్రి ఓ యువకుడు ప్రయాణం చేస్తున్న కారులో నుండి బయటకు వచ్చి ప్రమాదకర రీతిలో స్టంట్లు చేస్తున్నాడు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Formula E Case Updates: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం...తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ, FIR కాపీతో పాటు నగదు బదిలీ వివరాలను అడిగిన ఈడీ

Arun Charagonda

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు HMDA అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలు కోరింది ఈడీ. దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని...అలాగే ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది ఈడీ.

Uttar Pradesh: యూపీలో బస్తీ రైల్వేస్టేషన్లో తెరుచుకోని రైలు తలుపులు, రాళ్లతో కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలకు వెళ్లిన ప్రయాణికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల బృందం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ తలుపులు లాక్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూపిస్తుంది. వైరల్ క్లిప్‌లో, కోపంతో ఉన్న ప్రయాణీకులు రైలు ప్రవేశ ద్వారం అద్దాలు పగలగొట్టడానికి రాళ్లను ఉపయోగించడం చూడవచ్చు

TTD Action On Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు సిద్ధమైన టీటీడీ, దర్శనాలు- గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్

Arun Charagonda

తిరుమల శ్రీవారిని గురువారం శ్రీనివాస్ గౌడ్ దర్శించుకునన్ సంగతి తెలిసిందే. తిరుమలలో టీటీడీ అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టారు శ్రీనివాస్ గౌడ్. తిరుమలలో దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు..గడచిన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఇప్పుడు ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

Advertisement

Surat Bank Robbery: బ్యాంకు గోడ పగులగొట్టి రూ. 40 లక్షలు దోచుకెళ్లిన దొంగలు, ఘటనా స్థలంలో దోసకాయ, ఆపిల్ ముక్కలు, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

సూరత్‌లోని కిమ్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పాలోడ్ శాఖలో బ్యాంక్ లాకర్ గదిని, మార్బుల్ పాలిషింగ్ యూనిట్‌ను వేరు చేసే గోడకు రంధ్రం చేసి దొంగలు INR 40.36 లక్షల విలువైన నగదు, ఆభరణాలను దోచుకున్నారు.

Dead Body In Parcel: ఆర్థిక సాయం కోసం అప్లై చేస్తే డెడ్ బాడీ వచ్చింది... ఇంటికి వచ్చిన పార్శిల్‌లో మృతదేహం, భయాందోళనకు గురైన స్థానికులు..వీడియో

Arun Charagonda

పశ్చిమగోదావరి - యండగండిలో పార్శిల్‌లో డెడ్ బాడీ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తన ఇంటి నిర్మాణం కోసం క్షత్రియ సేవా సమితిని యండగండికి చెందిన మహిళ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేశారు.

Mufasa: The Lion King Telugu Review: ముఫాసాః ది లయన్ కింగ్ తెలుగు రివ్యూ ఇదిగో, సినిమాను పైకి లేపిన మహేష్ బాబు వాయిస్‌తో పాటు ఇతర నటుల వాయిస్, ఎలా ఉందంటే..

Hazarath Reddy

ది లయన్ కింగ్ కు హీరో నాని డబ్బింగ్ చెప్పడం కూడా ఇంకా క్యూరియాసిటిని రేపింది. ఇంకా తెలుగు నటులు బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు,సత్యదేవ్, అయ్యప్ప శర్మ, ఆర్.సి.ఎం రాజు వంటి వారు ఈ సినిమాకు వాయిస్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఇది చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవాలి

KTR: అవినీతి జరగలేదని మంత్రులే చెప్పారు...ఈ కేసు నిలబడదన్న కేటీఆర్, అందరిని తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి...కేసులను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పిన కేటీ రామారావు

Arun Charagonda

ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెల్లడించారని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్...ముఖ్యమంత్రిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు అన్నారు.

Advertisement

Hyderabad: హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు...సికింద్రాబాద్‌లోని పలు రెస్టారెంట్లపై దాడులు, హోటళ్లపై కేసులు నమోదు

Arun Charagonda

సికింద్రాబాద్ లోని గోల్డెన్ డ్రాగన్ రెస్టారెంట్, సర్వి రెస్టారెంట్, చిల్లిస్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అన్నిట్లో నిబంధనలకు విరుద్ధంగా ఆహారోత్పత్తులు, బొద్దింకలు, అపరిశుభ్రతను గుర్తించారు. ఈ నేపథ్యంలో అన్ని హోటళ్ళపై కేసులు నమోదు చేశారు.

Telangana Assembly Sessions: అసెంబ్లీని కుదిపేసిన ఫార్ములా ఈ కార్ రేసు అంశం, కేటీఆర్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్, కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో కుదరదన్న ప్రభుత్వం

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీని ఫార్ములా- ఈ రేస్ అంశం కుదిపేసింది.ఈ అంశంపై వెంటనే సభలో చర్చ నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 420 కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

CIU On Formula E Race Case: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ వ్యవహారంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్ ఏర్పాటు, పలు శాఖల నుండి కీలక ఫైల్స్ తెప్పించుకుని విచారించనున్న ఏసీబీ

Arun Charagonda

ఫార్ములా ఈ-కార్ రేస్ విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ( CIU) ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ప్రత్యేక బృందానికి డైరెక్టర్ గా తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోండగా ఇవాళ HMDA తో పాటు పలు శాఖల నుంచి కీలక ఫైల్స్ తెప్పించుకొనుంది ఏసీబీ.

Delhi: అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి...పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన, అమిత్ షాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు..వీడియో

Arun Charagonda

రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు.

Advertisement

Lagacharla Farmers: సంగారెడ్డి జైలు నుండి లగచర్ల రైతులు రిలీజ్, 37 రోజుల తర్వాత బెయిల్..కంటతడి పెట్టిన కుటుంబ సభ్యులు, వీడియో ఇదిగో

Arun Charagonda

37 రోజుల తర్వాత సంగారెడ్డి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు లగచర్ల రైతులు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి చేశారన్న అభియోగాలపై పోలీసులు రైతులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం వీరికి బెయిల్ మంజూరు చేయగా రైతులకు స్వాగతం పలికారు గిరిజన సంఘాల నేతలు.

CM Revanth Reddy: గెలిచిన వారు రాసుకున్నదే చరిత్ర కాదు...వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు కవులు ముందుకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి, బుక్ ఫెయిర్ ఘనంగా ప్రారంభం

Arun Charagonda

ఉద్యమాల పట్ల చరిత్రకారులు వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, ఉద్యమాల్లో అసువులు బాసిన అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలంటే కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, తమ గళాలను విప్పాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Fire Accident in Jaipur: సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను ఢీకొట్టిన ట్రక్కు.. పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం మరో 35 మందికి గాయాలు.. జైపూర్ లో ఘటన (వీడియో)

Rudra

రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం అజ్మీర్‌ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న ఓ సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను మరో ట్రక్‌ వచ్చి బలంగా ఢీకొట్టింది.

Wife Eloped With Her Girlfriend: బాయ్ ఫ్రెండ్ తో కాదు.. గర్ల్‌ ఫ్రెండ్‌ తో వెళ్లిపోయిన భార్య.. కోర్టుకెక్కిన భర్త.. అసలేం జరిగింది?? ఎక్కడ జరిగింది??

Rudra

కొన్ని వార్తలు చదువుతుంటే తప్పు చదివామేమో లేదా పొరపాటుగా విన్నామేమో అనే భావన కలుగుతుంది. ఇప్పుడు మీరు చదువబోయే వార్త కూడా అలాంటిదే.

Advertisement

Ashwin Quit Because Of Humiliation: అవమానం వల్లే అశ్విన్ వీడ్కోలు.. తండ్రి సంచలన ఆరోపణలు.. దిద్దుబాటుకు దిగిన స్పిన్నర్‌ (వీడియో)

Rudra

భారత దిగ్గజ స్పిన్నర్‌ అశ్విన్‌ రవిచంద్రన్‌ అనూహ్య రిటైర్మెంట్‌ అంశంలో కీలక మలుపు చోటుచేసుకుంది. గబ్బా టెస్టు ముగిసిన వెంటనే తన సుదీర్ఘ కెరీర్‌ కు వీడ్కోలు పలికాడు అశ్విన్‌.

Hero Akhil At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో అఖిల్.. అభిషేక సేవలో పలువురు ప్రముఖులు (వీడియో)

Rudra

యువ నటుడు హీరో అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో పాల్గొన్నారు.తెలంగాణ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో అఖిల్ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Fire Accident in Secunderabad: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.. దేవుడికి పెట్టిన దీపం అంటుకొని పాన్ షాప్ లో మంటలు (వీడియో)

Rudra

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక మహంకాళి ఆలయ పరిసరాల్లోని తాజ్ మహల్ ట్రై స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ పాన్ షాప్‌‌లో మంటలు చెలరేగాయి.

Four Youth Attempts Suicide: పోలీసులు వేధిస్తున్నారంటూ నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం.. మంచిర్యాలలో ఘటన (వీడియో)

Rudra

పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన నలుగురు యువకులు సెల్ఫీ వీడియో తీసుకొని హెయిర్ డై తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం గురువారం కలకలం సృష్టించింది. బాధితులను శివ, అజయ్ కుమార్, రాజు, షారుక్ గా గుర్తించారు.

Advertisement
Advertisement