News
Vizag Student Dies in Canada: కెనడాలో గాజువాక విద్యార్థి అనుమానాస్పద మృతి, స్పందించిన నారా లోకేష్, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి
Hazarath Reddyవైజాగ్‌కు చెందిన ఓ యువకుడు కెనడాలోని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైజాగ్ నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన పిల్లి ఫణి కుమార్ (36) కెనడాలోని కాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లయ్ చైన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నాడు
Leopard Dies in Metlapalli: రైతు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మృతి, గన్నవరం మండలం మెట్లపల్లిలో విషాదకర ఘటన
Hazarath Reddyకృష్ణాజిల్లా(Krishna District) కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుతపులి(Leopard) మృతి చెందింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి కనిపించింది.
Online Betting Trap: ఆన్‌లైన్ బెట్టింగ్ ట్రాప్..వీసీ సజ్జనార్ ట్వీట్ వైరల్, అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఎలాంటి వేశాలు వేస్తున్నారో మీరు చూడండి..
Arun Charagondaఆన్ లైన్ బెట్టింగ్ ఫ్రాడ్‌పై ట్విట్ చేశారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. అమాయకులను బెట్టింగ్ కూపంలోకి లాగేందుకు ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. తమ వ్యక్తిగత స్వార్థం కోసం ఎంతో మందిని అన్ లైన్ జూదానికి వ్యసనపరులను చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. యువకుల్లారా!! అరచేతిలో వైకుంఠం చూపించే ఇలాంటి సంఘవిద్రోహ శక్తుల వలలో చిక్కుకోకండి. బెట్టింగ్ కు బానిసై బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోకండిని సూచించారు.
JPC On Jamili Elections: జమిలీ ఎన్నికలు...31 మందితో జేపీసీ ఏర్పాటు చేసిన కేంద్రం, ప్రియాంక గాంధీ..మనీష్ తివారి సహా కమిటీలో ఉంది వీరే...పూర్తి వివరాలివిగో
Arun Charagondaఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశంలో జమిలీ ఎన్నికలను తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టగా తాజాగా 31 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసింది కేంద్రం.
YouTuber Prasad Behra: లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్... షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు, అరెస్ట్
Arun Charagondaలైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు పోలీసులు. షూటింగ్ సమయంలో ప్రైవేట్ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రసాద్ బేహేరాను రిమాండ్‌కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు.
Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, 24 గంటలు గడవకముందే మరో విద్యార్థిని కాటు వేసిన పాము...భయాందోళనలో విద్యార్థులు
Arun Charagondaజగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం పెద్దాపుర్ గురుకుల పాఠశాలలో ఉదయం యశ్వంత్ అనే మరో విద్యార్థికి పాము కాటు వేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్నారు యశ్వంత్. వెంటనే కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించింది సిబ్బంది. నిన్న అఖిల్ అనే విద్యార్థికి పాముకాటు వేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అఖిల్. గతంలో ఇదే గురుకులంలో ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందారు.
Keerthy Suresh: మెడలో మంగళ సూత్రం..సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేష్, ఫస్ట్ బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రచార కార్యక్రమంలో సందడి చేసిన కీర్తి సురేష్
Arun Charagondaఇటీవలె తన చిన నాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకుంది నటి కీర్తి సురేష్. పెళ్లై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే తన ఫస్ట్ మూవీ 'బేబీ జాన్' సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి హాజరయ్యారు కీర్తి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మోడ్రన్ డ్రెస్ ధరించి, మెడలో మంగళ సూత్రంతో హాజరయ్యారు కీర్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Andhra Pradesh: జనసేన నేత పుట్టినరోజు వేడుకలు..రేవ్ పార్టీ, యువతుల అశ్లీల నృత్యాలు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...వీడియోలు వైరల్
Arun Charagondaజనసేన నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీ నిర్వహించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు వైరల్‌గా మారాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర..జన్మదినం సందర్భంగా క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో పార్టీ నిర్వహించారు.
Telangana High Court: అధికారులకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు, స్టే ఆర్డర్ ఉన్న ఇంటిని కూల్చేయడంపై ఆగ్రహం..అధికారుల సొంత ఖర్చులతో తిరిగి కట్టించాలని ఆదేశం
Arun Charagondaతెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా ఇంటిని, హోటల్‌ని కూల్చేశారు అధికారులు. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కూడా కూల్చివేతలకు పాల్పడ్డ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అధికారుల సొంత ఖర్చుతో తిరిగి కట్టించి ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు తీర్పు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
Balagam Mogilaiah: బలగం మూవీ నటుడు మొగిలయ్య కన్నుమూత, కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మొగిలయ్య...స్వగ్రామంలో జరగనున్న అంత్యక్రియలు
Arun Charagondaబలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మొగులయ్య..ఇవాళ ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలపగా మొగిలయ్య స్వగ్రామం నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రం. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
Hyderabad: వనస్థలిపురంలో షాకింగ్ సంఘటన, కారులో మహిళ ఆత్మహత్య, పురుగుల మందు తాగి సూసైడ్...పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి సోదరుడు
Arun Charagondaవనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఇంజాపూర్ రాజశ్రీ ఎన్ క్లేవ్ లో నివాసముంటున్నారు రామకృష్ణారెడ్డి, ఉమాశ్రీ దంపతులు. తమ కారులో కూర్చుని పురుగు మందు తాగి సూసైడ్ చేసుకుంది ఉమాశ్రీ. ఉమాశ్రీ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోదరుడు.
Vijay At Keerthi Suresh Wedding: కీర్తి సురేష్ పెళ్లిలో సందడి చేసిన దళపతి విజయ్, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన కీర్తి..డ్రీమ్ ఐకాన్ అంటూ ప్రశంసలు
Arun Charagondaఇటీవలె నటి కీర్తి సురేశ్ - ఆంటోని తట్టిల్ వివాహం గోవాలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో సందడి చేశారు దళపతి విజయ్. డ్రీమ్ ఐకాన్ ఆశీర్వదించిన క్షణాలు అంటూ విజయ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశారు కీర్తి. హిందూ సంప్రదాయంతో పాటు క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో కూడా వివాహం చేసుకుంది ఈ జంట.
Telangana: గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, స్నానం చేసే సమయంలో కాటు వేసిన పాము..పెద్దాపూర్ గురుకులంలో ఘటన, వీడియో
Arun Charagondaగురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు కలకలం రేపింది. జగిత్యాల - పెద్దాపూర్ 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థికి స్నానం చేసే సమయంలో కాటు వేసింది పాము. హుటాహుటిన విద్యార్దిని ఆస్పత్రికి తరలించగా 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో కొనసాగుతోంది చికిత్స.
Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.
‘The Raja Saab’: ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, 80 శాతం పూర్తయిన రాజాసాబ్ షూటింగ్..టీజర్ పై టీం ఏమందంటే?
VNSరాజాసాబ్ టీజర్ క్రిస్మస్ కి లేదా న్యూ ఇయర్ కి వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అలాగే రాజాసాబ్ వాయిదా పడుతుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ అధికారికంగా ఓ లెటర్ విడుదల చేసింది.
Folk Singer Shruthi Dies by Suicide: వరకట్న వేధింపులకు సింగర్ మృతి, పెళ్లైన 20 రోజులకే అత్తవారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య
VNS20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి వేధింపులు మొదలయ్యాయి. కట్నం (Dowry) తీసుకురావాలని అత్తమామలు వేధించారు.
Sunita Williams Return Delayed Again: సునితా విలియమ్స్ ఇప్పట్లో భూమి పైకి రావడం కష్టమే! మరోసారి సాంకేతిక కారణాలతో మిషన్ ఆలస్యం
VNSభారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ (Sunita Williams) రాక మరింత ఆలస్యం కానున్నది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం నాసా (NASA) షెడ్యూల్‌ను సవరించింది. దాంతో ఆమె మరో నెల రోజుల పాటు ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే (ISS) నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది.
Cherlapally Terminal: చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు. ఈ నెల 28న రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
VNSసికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపై ఒత్తిడి తగ్గిచేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను రైల్వేశాఖ (Railway Ministry) అభివృద్ధి చేసింది. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
QR Code Scams: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోకపోతే మీ అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం
VNSఫేక్ లేదా హానికరమైన క్యూఆర్ కోడ్ అందిస్తారు. తరచుగా లోకల్ స్టోర్లు, డెలివరీ సర్వీసులు లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వంటి ప్రదేశాలలో ఈ క్యూఆర్ కోడ్ మోసాలకు ఎక్కువగా అవకాశం ఉంది.
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, జేపీసీ సభ్యులుగా ప్రియాంక గాంధీ వాద్రాతో సహా 31 మంది నియామకం
Hazarath Reddyవన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సభ్యులుగా లోక్ సభ నుండి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. వీరిలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, అనురాగ్ సింగ్ ఠాకూర్ JPC సభ్యులుగా ఉన్నారు.