News

Aghathiyaa: జీవా, రాశీఖన్నా లేటెస్ట్ మూవీ Aghathiyaa నుంచి ఫస్ట్ లుక్ విడుదల, యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కీలక పాత్రలో, హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో రానున్న సినిమా

Vikas M

రంగం, యాత్ర 2 సినిమాతో తెలుగు, తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జీవా నటిస్తోన్న తాజా చిత్రం Aghathiyaa, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. యాక్షన్‌ కింగ్ అర్జున్‌ కీలక పాత్ర నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు మేకర్స్‌.

Amazon Buys MX Player: ఎంఎక్స్‌ ప్లేయర్‌‌ని కొనుగోలు చేసిన అమెజాన్, మున్ముందూ ఎంఎక్స్‌ప్లేయర్‌ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని వెల్లడి

Vikas M

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే దిశలో మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ను (MX player) కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

Zomato CEO Deepinder Goyal: డెలివ‌రీ బాయ్‌గా వెళ్లిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం, మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్..

Vikas M

జొమాటో డెలివ‌రీ బాయ్స్ విధుల్లో ఉండ‌గా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్ చేసుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది దీపింద‌ర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు.

UPI Transactions in India: దేశంలో ప్రతిరోజు సగటున 493 మిలియన్ల UPI లావాదేవీలు, కీలక విషయాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Vikas M

Advertisement

Marriage Fraud in Hathras: సీఎం వివాహ యోజన పథకం కింద డబ్బులు పొందేందుకు అన్నా చెల్లెలు సరికొత్త స్కెచ్, పెళ్లి చేసుకున్నట్లుగా నటించి ప్రభుత్వాన్ని బురిడీ..

Vikas M

వధువు బ్యాంక్ ఖాతాలో INR 35,000, జంటకు INR 10,000 విలువైన నిత్యావసర వస్తువులు, వివాహ వేడుక కోసం INR 6,000, ముఖ్యమంత్రి సముహిక్ వివాహ్ యోజన కింద ప్రయోజనాలను పొందేందుకు తోబుట్టువులిద్దరూ ఈ స్కామ్‌కు పాల్పడినట్లు తెలిసింది.

Duvvada Srinivas: వీడియో ఇదిగో, తిరుమలలో ప్రియురాలితో దువ్వాడ శ్రీనివాస్, పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాధురి

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులిచ్చారు.

Theft Caught on Camera: పట్ట పగలు చైన్ స్నాచింగ్ వీడియో ఇదిగో, వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా మెడలోంచి తాళిబొట్టు లాక్కెళ్లిన దుండగులు

Hazarath Reddy

తుని పట్టణంలో పట్ట పగలు చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పోస్ట్ ఆఫీస్ వీధిలో మహిళ నడిచి వెళ్తుండగా ఆ మహిళ మెడలోంచి దుండగులు తాళిబొట్టును లాక్కెళ్లారు. బైకుపై ఇద్దరు యువకులు పరారయ్యారు. కాగా అక్కడున్న సీసీ కెమెరాలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

Delhi: వీడియో ఇదిగో, బస్సులో అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రయాణికుడు, గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటన

Hazarath Reddy

అక్టోబరు 7, సోమవారం నాడు ముబారక్‌పూర్ నుండి పాత ఢిల్లీకి వెళుతున్న బస్సులో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో ఒక యువకుడు గుండెపోటుతో మరణించాడు. నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి బస్సులో ఉండగానే తల తిరగుతుందంటూ కుప్పకూలిపోయాడు,

Advertisement

Chandrababu Meet PM Modi: ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ, అమరావతి, పోలవరం నిధులుపై చర్చలు, విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లుగా వార్తలు

Hazarath Reddy

రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు.. ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.

Theft Caught on Camera: వీడియో ఇదిగో, పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ కెమెరాకు చిక్కిన దొంగ, మేడ్చల్ నందిని డెయిరీ నుండి కొద్ది రోజులుగా పాల ప్యాకెట్లు మాయం

Hazarath Reddy

మేడ్చల్ - రాఘవేంద్ర నగర్ కాలనీలో ఉన్న నందిని డెయిరీ నుండి కొన్ని రోజులుగా దొంగ పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ సీసీ కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ దొంగ కొన్ని పాల పాకెట్లను దొంగిలించడం చూడవచ్చు.

Rajendra Prasad Daughter Dies: వీడియో ఇదిగో, మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించి వస్తానంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

Hazarath Reddy

అలనాటి నటి రమాప్రభతో పాటు మరికొందరు మహిళా నటులు రాజేంద్రప్రసాద్ను నిన్న కలవగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'మా అమ్మ మళ్లీ చచ్చిపోయింది. పంపించేసి వస్తా' అని వారితో చెప్పారు. వారు ఆయనను ఓదార్చారు.

Astrology: అక్టోబర్ 11న దుర్గాష్టమి పండగ, ఈ 4 రాశుల వారికి దుర్గమ్మ తల్లి దీవెనతో శత్రువుల పీడ విరిగి, ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

sajaya

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దుర్గాష్టమి తిథి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున కొన్ని యోగాలు ఉన్నాయి. వీటి ద్వారా ముఖ్యంగా 4 రాశులకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఈసారి మహా అష్టమిని అక్టోబర్ 11న జరుపుకుంటున్నారు.

Advertisement

Congress Vs MIM Leaders Clash: వీడియో ఇదిగో, కాంగ్రెస్‌, ఎంఐఎం నేతలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి, ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత

Hazarath Reddy

హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్‌, కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్‌ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు

Teegala Krishna Reddy Meet Chandrababu: మలుపులు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన తీగల కృష్ణారెడ్డి, మ‌న‌వ‌రాలి పెళ్లికి ఏపీ సీఎంను ఆహ్వానించిన ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి జూబ్లీహిల్స్ లోని చంద్ర‌బాబు నివాసంలో ఆయ‌న్ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తీగ‌ల కృష్ణారెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

KA Paul on Pawan Kalyan: వీడియో ఇదిగో, పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఎ పాల్, మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Hazarath Reddy

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Health Tips: ఖాళీ కడుపుతో వేడి నీటిలో పసుపు కలిపి తీసుకున్నట్లయితే, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

చాలామంది ఉదయం పూట వేడి నీరును తాగుతూ ఉంటారు దీనివల్ల అనేక సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా బరువు తగ్గడం మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయి అయితే పసుపు కలిపిన వేడి నీటిని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

India-Maldives Relations: భారత్ మాకు చాలా అవసరం, యూటర్న్ తీసుకున్న మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు, ఏమన్నారంటే..

Hazarath Reddy

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఆదివారం దేశానికి వచ్చిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)తో తాజాగా భేటీ అయ్యారు.

Karnataka: అక్రమ సంబంధం పేరుతో బ్లాక్ మెయిల్, నదిలో శవమై తేలిన ప్రముఖ వ్యాపారవేత్త, 12 గంటల గాలింపు అనంతరం దొరికిన డెడ్ బాడీ

Hazarath Reddy

కర్ణాటకలో అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త బీఎం ముంతాజ్‌ అలీ (52) ఫాల్గుణి నది ముఖద్వారం వద్ద శవమై తేలారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మౌయిద్దీన్ భవ సోదరుడు BM ముంతాజ్ అలీ కూలూర్ వంతెన సమీపంలో నదిలో దూకి గల్లంతయ్యాడు .

Nandigam Suresh: దళిత మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌కు 14 రోజులు రిమాండ్, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ వచ్చినా జైలులోనే..

Hazarath Reddy

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు మరోసారి అరెస్ట్‌ చేశారు. మంగళగిరి కోర్టులో ఆయన్ను ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేశ్‌ అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే పూచీకత్తు సమర్పించకపోవడంతో సురేశ్‌ జైలులోనే ఉన్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గ గుడిలో విధులకు వచ్చి పేకాడుతూ అడ్డంగా బుక్కైన పోలీసులు, నలుగురు సీఐలు హోటల్ రూమ్‌లో పేకాట ఆడుతూ కెమెరాకు..

Hazarath Reddy

పేకాట ఆడుతూ దొరికిన వారిలో టూ టౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement