News
Goddess Kanaka Durga: నేటి నుండి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్న కనకదుర్గమ్మ, వజ్రాలతో కూడిన కిరీటాన్ని కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు
Arun Charagondaవిజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇవాళ్టి నుండి వజ్ర కిరీటంతో భక్తులను దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. 2.5 కోట్లతో వజ్రాలు, బంగారంతో చేసిన కిరీటాన్ని అమ్మవారికి బహుకరించారు అజ్ఞాత భక్తుడు.
2024 ICC Women's T20 World Cup Google Doodle: నేటి నుండి 2024 ICC మహిళల T20 ప్రపంచ కప్, ఆకట్టుకుంటున్న గూగుల్ డూడుల్,అక్టోబర్ 20న ఫైనల్
Arun Charagondaదుబాయ్ వేదికగా నేటి నుండి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 20 వరకు ఈ మెగా టోర్నీ జరగనుండగా యూఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూప్ లుగా విభజించగా గ్రూప్ Aలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ Bలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి.
Konda Surekha: సారీ చెప్పిన కొండా సురేఖ, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ట్వీట్, స్వయం శక్తితో ఎదిగిన సమంత అంటే గౌరవం ఉందని ప్రకటన
Arun Charagondaఅక్కినేని నాగచైతన్య - సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమని కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు మంత్రి కొండా సురేఖ. అన్ని వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కొండా సురేఖ.
Konda Surekha Comments Row: మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల, నిరాధారమైన ఆరోపణలు చేస్తే మౌనంగా ఉండబోమని హెచ్చరించిన జూనియర్ ఎన్టీఆర్
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపగా సమంత, నాగచైతన్య తీవ్రంగా ఖండించారు.తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇక తాజాగా నాగార్జున, అమల, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.
Konda Surekha Comments Row: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం, లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్, ఫైర్ బ్రాండ్‌ని నిద్ర లేపి తన్నించుకుంటున్నారంటున్న కాంగ్రెస్, ఎవరేమన్నారంటే..
Vikas Mసినిమా హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Boat Capsizes in Nigeria: నైజర్ నదిలో ఘోర పడవ ప్రమాదం, 100 మంది గల్లంతు, వేడుకకు వెళ్లి వెస్తుండగా దుర్ఘటన
Vikas Mనైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాద సమయంలో బోటులో 300 మంది ఉన్నారని, ఓ వేడుకకు వెళ్లి వెస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Bird Flu Kills 47 Tigers: బర్డ్‌ఫ్లూతో 47 పులులుతో పాటుగా మూడు సింహాలు మృతి, వియత్నాంలో తీవ్ర కలకలం రేపుతున్న హెచ్5ఎన్1 వైరస్
Vikas Mదక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్1) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి పలు జూలలో 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్ మృతిచెందినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్టు వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) పేర్కొంది
Marburg Virus Scare in Germany: మరో వైరస్ వచ్చేసింది, జర్మనీలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ వెలుగులోకి, దీని లక్షణాలు ఎంత డేంజర్ అంటే..
Vikas Mఇద్దరు ప్రయాణీకులకు ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ సోకినట్లు అనుమానించడంతో జర్మనీలోని హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. నివేదికల ప్రకారం, ఫెడరల్ పోలీసులు హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్ వద్ద అనేక రైల్వే ట్రాక్‌లను మూసివేశారు.
Auto Ride at Rs 1: రూపాయికే ఆటో రైడ్ , బెంగళూరు ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు
Vikas Mఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగళూరు ప్రజలకు కేవలం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత నెల 27 నుంచి ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది.
ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్,నంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వెనక్కి
Vikas Mఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నం.01 స్థానం కైవసం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 870 రేటింగ్ పాయింట్లతో నం.01 ర్యాంక్ దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి మరీ బుమ్రా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
BSNL 4G Mobiles: బీఎస్ఎన్ఎల్ మరో సంచలనం, దేశీయ మార్కెట్లోకి త్వరలొ 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు, కార్బన్ మొబైల్స్ జత కట్టిన ప్రభుత్వ రంగ దిగ్గజం
Vikas Mరిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడా ఐడియా) వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు పోటీగా 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి... తద్వారా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది.
Health Tips: ఎండిన ఈ అంజీర్ పండ్లను ఇలా తింటే చాలు మీ గుండెల్లో బ్లాకులు సైతం కరగడం ఖాయం....
sajayaఆయుర్వేదం ప్రకారం అంజీర్ ఒక అద్భుతమైన ఔషధ ఫలం. ఇది ఏకకాలంలో అనేక సమస్యలను తొలగిస్తుంది. అంజీర్ పండ్లలో విటమిన్ ఎ, బి , సిలతో పాటు కాపర్, సల్ఫర్ , క్లోరిన్ తగినంత పరిమాణంలో ఉంటాయి.
Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఘాటు కౌంటర్, ఇంతకీ నాగచైతన్య ఏమన్నారంటే?
VNSమంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్స్ వస్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున, నటి సమంత (Samantha) కూడా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. అయితే నాగ చైతన్య (Naga Chaithanya) ఎలా రియాక్ట్ అవుతారని అంతా ఎదురుచూశారు. కా
Telangana Rain Alert: రాబోయే రెండు రోజుల పాటూ తెలంగాణకు రెయిన్ అలర్ట్, హైదరాబాద్ తో పాటూ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
VNSతెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. బుధవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
‘Vettaiyan’ Trailer: తలైవా వెట్టయాన్ ట్రైలర్ వచ్చేసింది! సూపర్ కాప్ గా కనిపించబోతున్న రజినీకాంత్..ట్రైలర్ అదరగొట్టిందిగా
VNSతమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు
Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదు, అన్నదాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyటీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు . కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదంటూ బాంబు పేల్చారు.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyహైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ట్యూషన్ టీచర్ రాములు అసభ్యకరంగా ప్రవర్తించారు. ట్యూషన్ టీచర్ గురించి బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.
Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు, స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం తయారు కావాలని సీఎం చంద్రబాబు పిలుపు
Hazarath Reddyఏపీలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు (abolition of Garbage Tax) చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారులను ఎక్కడా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు.
Nagarjuna on Konda Surekha Comments: నాగచైతన్య-సమంత విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.