News

Assembly Elections 2024 Schedule: మళ్ళీ మోగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల నగారా, జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీకి తొలిసారి జరిగే ఎన్నికలు ఇవే, నేడే షెడ్యూల్ ప్రకటన

Hazarath Reddy

లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) నేడు షెడ్యూల్‌ విడుదల కానుంది.మధ్యాహ్నం 3 గంటలకు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్‌(ఈసీ) మీడియా సమావేశంలో ప్రకటించనుంది.

Dalit Woman Torture Case: దళిత మహిళపై థర్డ్‌ డిగ్రీ కేసు, షాద్‌నగర్‌ పోలీసులపై కేసు నమోదు, ఇప్పటికే డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డితో పాటు కానిస్టేబుళ్లు సస్పెండ్

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో షాద్ నగర్ ఇన్‌స్పెక్టర్‌ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులపై కేసులు నమోదయ్యాయి

Uttarakhand Nurse : నిన్న కోల్ కతా - నేడు ఉత్తరాఖండ్, నర్సుపై అత్యాచారం- హత్య, 9 రోజుల తర్వాత బాడీ గుర్తింపు,దారుణ సంఘటన

Arun Charagonda

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు మాత్రం ఆగడం లేదు. ఎంతదారుణానికైన తెగబడేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే జూనియర్ డాక్టర్ హత్యాచారంతో కోల్ కతా అట్టుడికిపోతుండగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతోంది.

Uttar Pradesh Horror: యూపీలో దారుణం, భార్య లేదని తాగిన మత్తులో కన్న కూతురుపై అత్యాచారం

Hazarath Reddy

యూపీలోని అమేథీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ నెల 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Harishrao : హైదరాబాద్‌లో హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం, దమ్ముంటే రాజీనామా చెయ్- అగ్గిపెట్ట హరీశ్ రావు అంటూ మైనంపల్లి అభిమానుల పేరిట ఫ్లెక్సీల ఏర్పాటు, వీడియో

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్ రావు రాజీనామాకు డిమాండ్ చేశారు.

Chaddi Gang Caught on Camera: తిరుపతిలో కెమెరాకు చిక్కిన చెడ్డి గ్యాంగ్, ఇంట్లో చొరబడి నగలు, నగదుతో పరార్, రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

తిరుపతి జిల్లా తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేశారు. కొత్తపాళెం లే అవుట్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఈ చెడ్డీ గ్యాంగ్. బీరువాలో నగలు, నగదుతో పరారయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Uttar Pradesh Shocker: యూపీ ఆస్పత్రిలో దారుణం, నగ్నంగా ఉన్న మహిళకు శస్త్రచికిత్స చేస్తూ వీడియో తీసిన వార్డు బాయ్, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని బస్తీ కేర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, ఐ సెంటర్‌లోని వార్డ్ బాయ్ నగ్నంగా ఉన్న మహిళా రోగికి శస్త్రచికిత్స చేశాడు. అనంతరం దాన్ని చిత్రీకరించి, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. శస్త్రచికిత్సలో చేస్తూ ఆపరేటింగ్ థియేటర్‌లో నగ్నంగా ఉన్న మహిళను రికార్డ్ చేసి, అతని వాట్సాప్ స్టేటస్‌లో ఫుటేజీని పోస్ట్ చేశాడు,

Telangana Shocker: 3 నెలలుగా ఓ మహిళపై పోలీసుల చిత్ర హింసలు, లవ్ మ్యారేజీ విషయంలో మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన బషీరాబాద్ పోలీసులు, ఆలస్యంగా వెలుగులోకి ఘటన

Arun Charagonda

వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. కొడుకు ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడని 3 నెలలుగా తల్లిని లాఠీలతో కొడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్(17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక(16) ప్రేమించుకొని 3 నెలల క్రితం ఇంట్లోనుండి వెళ్ళిపోయారు.

Advertisement

Telangana: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వదిలి వెళ్లిందని లైవ్‌లోనే పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం, సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం..

Hazarath Reddy

తెలంగాణలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండలం కోటి నాయక్ తండాకు చెందిన విజయ్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.అయితే భార్య నికిత తనను వదిలి వెళ్లిందని మనస్థాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

Thief at Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. గోడ దూకి చొరబడిన దుండగుడు.. చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ

Rudra

నిర్మల్ లోని బాస‌రలో కొలువైన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో చోరీ జ‌రిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు.

Schedule for Assembly Polls Today: మోగనున్న ఎన్నికల నగారా... పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

Rudra

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ ను నేడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

Telangana: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్, హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు

Arun Charagonda

తెలంగాణలో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు కోదండరాం, అమీర్ అలీఖాన్. మండలిలోని తన ఛాంబర్‌లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ....కోదండరాం, అమీర్ అలీఖాన్ చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విప్ బీర్ల ఐలయ్య యాదవ్, ఎమ్మెల్సీ మహేష్ కూమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement

CM Revanth Reddy Delhi Tour: హస్తినకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చ, ఆపిల్- ఫాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో భేటీ, పూర్తి వివరాలివే..

Arun Charagonda

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని ఆగస్టు 14న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కాగ్నిజెంట్ కంపెనీ విస్తరణ పనులు, మూడో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల, సీతారామ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.

Ram Narain Agarwal Passes Away: ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ రామ్ నరైన్ అగర్వాల్ కన్నుమూత

Rudra

డీఆర్డీవో మిస్సైల్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సెల్స్ గా పేరుగాంచిన రామ్ నరైన్ అగర్వాల్ (84) హైదరాబాద్‌ లో గురువారం కన్ను మూశారు. ఈ మేరకు డీఆర్డీవో అధికారికంగా ప్రకటించింది.

SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)

Rudra

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.

KTR-Women's Commission: మహిళలపై 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మహిళా కమిషన్ సీరియస్.. సుమోటోగా తీసుకున్న కమిషన్.. విచారణకు ఆదేశం.. మహిళలకు కేటీఆర్ క్షమాపణలు

Rudra

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు’ ప్రయాణ సదుపాయంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ విచారణకు ఆదేశించింది.

Advertisement

Menstrual Leave in Odisha: ఒడిశా మహిళా ఉద్యోగినులకు శుభ‌వార్త‌.. మాసంలో ఒక రోజు నెలసరి సెలవు.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు ప్రైవేటు సెక్టార్ లో కూడా..

Rudra

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఒడిశా స‌ర్కార్ అక్కడి మ‌హిళ‌ల‌కు తీపి కబురు చెప్పింది. ఒడిశాలోని ప్ర‌భుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు గురువారం ప్రకటించింది.

Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి

Rudra

తెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.

Taiwan Earthquake: తైవాన్‌ ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌ పై 6.1 తీవ్రత న‌మోదు (వీడియోతో)

Rudra

భారీ భూకంపంతో శుక్ర‌వారం తైవాన్‌ చిగురుటాకులా వణికిపోయింది. రిక్టర్‌ స్కేల్‌ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్టు అక్క‌డి వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది. తైవాన్‌ తూర్పు ప్రాంతంలోని హువాలియన్‌ నగరానికి 34 కిమీ దూరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది.

Jai Jawan Trailer Out: జై జవాన్ ట్రైలర్ విడుదల, దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలిపే మూవీ

Vikas M

సంతోష్‌ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'జై జవాన్‌'.ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు.

Advertisement
Advertisement