News

Bengal CM Mamata Banerjee: మహిళా డాక్టర్ హత్యాచారంపై సీఎం మమతా బెనర్జీ నిరసన, నిందితులను ఉరి తీయాలని డిమాండ్

Arun Charagonda

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య ఘటనకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

Hanumakonda: అమెరికాలో మ‌రో తెలుగు యువ‌కుడు మృతి, గుండెపోటుతో మ‌ర‌ణించిన హ‌న్మ‌కొండ వ్య‌క్తి, కొద్దిరోజుల‌ క్రిత‌మే తండ్రి...ఇప్పుడు కొడుకు మ‌ర‌ణంతో విషాదం

VNS

అమెరికాలో మరో తెలుగు యువకుడు (Young Man Died) మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్‌(32) మరణించాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేశ్‌ ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే రాజేశ్‌ ఉద్యోగం చేస్తున్నాడు

Rahul Gandhi Indian Citizenship Issue: రాహుల్ గాంధీ భార‌త పౌర‌సత్వాన్ని ర‌ద్దు చేయండి! కోర్టును ఆశ్ర‌యించిన బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి

VNS

లోక్‌సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత పౌరసత్వం (citizenship) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు భారత పౌరసత్వం ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ (BJP) నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టు కు వెళ్లారు. రాహుల్‌గాంధీ భారత పౌరసత్వాన్ని రద్దు చేయాల్సిందింగా కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) కు ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు.

Redmi A3x: రూ. 7 వేల ధరలో రెడ్ మీ ఏ3ఎక్స్ మార్కెట్లోకి వచ్చేసింది, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Vikas M

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం రెడ్‌మీ (Redmi) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X) ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999 పలుకుతుంది.

Advertisement

Manu Bhaker: ఒలింపిక్స్ అల‌స‌ట నుంచి రిలాక్స్ అవుతున్న మ‌నూ భాక‌ర్, షూటింగ్ ప‌క్క‌న పెట్టి ఏం చేస్తుందో చూడండి

VNS

పారిస్ ఒలింపిక్స్‌ షూట‌ర్ మ‌ను భాక‌ర్ (Manu Bhaker) కెరీర్‌ను మ‌రో మెట్టు ఎక్కించాయి. విశ్వ క్రీడ‌ల్లో రెండు కాంస్య ప‌త‌కాల‌(Bronze Medals)తో చ‌రిత్ర సృష్టించిన ఆమె యావ‌త్ దేశం గ‌ర్వ‌ప‌డేలా చేసింది. ఒలింపిక్ విజేత‌గా స్వ‌దేశంలో అడుగుపెట్టిన మ‌ను కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనుంది.

Brahma Anandam: పంచెక‌ట్టులో అదరగొడుతున్న కామెడీ కింగ్ బ్రహ్మానందం, బ్రహ్మ ఆనందం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్

Vikas M

ఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ (బ్రహ్మానందం – రాజా గౌతమ్‌) ఆన్ స్క్రీన్‌లో తాతామనవళ్లుగా నటిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.

Devara Update: దేవర నుంచి భైరా గ్లింప్స్ విడుద‌ల, మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తున్న సైఫ్ అలీ ఖాన్, వీడియో ఇదిగో..

Vikas M

నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేకర్స్ సైఫ్‌కి విషెస్ తెలుపుతూ.. దేవ‌ర నుంచి భైరా గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ వీడియోలో యోధుడిలా కనిపిస్తున్న బైరా మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని ఎత్తి విసిరేస్తునట్టుగా వీడియోలో చూపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది

Telangana LRS Scheme 2024: రుణమాఫీ తరహాలోనే ఎల్‌ఆర్‌ఎస్‌, వారికే వర్తింపు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, హెల్ప్‌లైన్‌లను సంప్రదించి మీ దరఖాస్తు స్టేటస్ చెక్‌చేసుకోండి

Arun Charagonda

లేఔట్ రిజిస్ట్రేషన్ స్కీమ్(LRS)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయగా తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై ఉత్తర్వులు వెలువరించింది ప్రభుత్వం. 2020 ఆగస్ట్ 26కు ముందు రిజిస్టర్ చేసిన లేఔట్లకే ఎల్ఆర్ఎస్ వర్తిస్తుందని తెలిపింది. 2020 అక్టోబర్ 15 వరకు స్వీకరించిన దరఖాస్తులనూ మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి 2020లో జారీ చేసిన జీవో 131, జీవో 135 ప్రకారం రాష్ట్రంలో అక్రమ లేఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ సిద్ధం చేసింది.

Advertisement

Ola Launches Roadster Electric: ఓలా ఎల‌క్ట్రిక్ మోటార్ సైకిల్ చూశారా? రూ.75000 నుంచే ప్రారంభం, 8 ఏళ్ల వారెంటీతో అందిస్తున్న కంపెనీ, ఎప్ప‌టి నుంచి డెలివ‌రీ ప్రారంభం అంటే..

VNS

భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మూడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను (Ola Launches Roadster Electric) లాంచ్ చేసింది. ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (Roadster Electric) శ్రేణిలో రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్‌స్టర్ ఎక్స్ ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

Saarthi AI Layoffs: ఆగని లేఆప్స్, భారీగా తొలగింపులను చేపట్టిన సారథి AI గ్రూపు, సీఈఓ పాస్ పోర్టును దొంగిలించిన మాజీ ఉద్యోగి

Vikas M

తొలగింపుల వల్ల ప్రభావితమైన ఒక ఉద్యోగి US వీసాతో తన పాస్‌పోర్ట్‌ను దొంగిలించినప్పుడు సారథి AI CEO విశ్వ నాథ్ ఝా సమస్యాత్మక పరిస్థితిని ఎదుర్కొన్నారు.US వీసా కలిగి ఉన్న తన పాస్‌పోర్ట్ దొంగిలించబడిందని సారథి AI CEO పేర్కొన్నాడు, తద్వారా అతను ఇతర గమ్యస్థానాలకు విమానంలో ప్రయాణించడం అసాధ్యంగా మారింది.

Nara Lokesh on Red Book: మా గెలుపులో రెడ్ బుక్ కూడా ఒక భాగం, క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్, చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్

Hazarath Reddy

ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక, మరో 5 రోజులు వర్షాలు, విపత్తు సంభవిస్తే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచన

Arun Charagonda

గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. బోయిన్‌పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, ఆర్సీపురం, అమీన్ పూర్, అమీర్‌పేట్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోంది. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు...విపత్తు సంభవిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు అధికారులు.

Advertisement

Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ఇదిగో, మొత్తం 90 స్థానాలకు అక్టోబర్‌ 1న పోలింగ్, అక్టోబర్‌ 4న ఫలితాలు

Hazarath Reddy

మొత్తం 90 స్థానాలకు అక్టోబర్‌ 1న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్‌ 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం గత మూడు పర్యాయాలుగా కొనసాగుతోంది.

Jammu and Kashmir Assembly Elections 2024: జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్‌, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎన్నికలు

Hazarath Reddy

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది.జమ్మూ కశ్మీర్‌లో మొత్తం మూడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. సెప్టెంబర్‌ 18, 25, అక్టోబర్‌ 1న జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Nagpur Shocker: ఒళ్లు గగుర్పొడుస్తున్న వీడియో ఇదిగో, సరదాపడి చేసిన స్టంట్‌తో యువకుడు మృతి, డ్యాంలో మునిగిపోతున్న దృశ్యాలు వైరల్

Hazarath Reddy

మహారాష్ట్రలో యువకుడు తన స్నేహితులతో కలిసి జలాశయం వద్ద రిస్కీ స్టంట్స్‌ చేసి ప్రాణాలే కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్నేహితులు మకర్‌ధోక్డా డ్యామ్ కు ఆగస్టు 15న టూర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడకు వెళ్లిన అనంతరం అలుగుపారుతున్న డ్యామ్ కట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Telangana Shocker: సిద్దిపేటలో దారుణం, వదినను గుడి ప్రాంగణానికి కట్టేసిన మరిది, మిత్తి ఇవ్వలేదని అరాచకం

Arun Charagonda

సిద్దిపేట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. డబ్బులు విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ అన్న వదినను గుడి ప్రాంగణానికి కట్టేశాడు తమ్ముడు. కనకయ్య దగ్గర 1,20,000 అప్పుగా తీసుకున్నారు అన్న పరుశురాములు. తీసుకున్న అప్పు లక్ష చెల్లించగా మిగిలిన 20000 మిత్తి ఇవ్వాలంటూ వదినను అన్నను చెట్టుకు కట్టేశారు మరిది కనకయ్య .

Advertisement

Assembly Elections 2024 Schedule: మోగిన ఎన్నికల నగారా, జమ్మూ కశ్మీర్‌ , హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. జమ్మూకశ్మీర్‌, హరియాణాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు

Bandi Sanjay On BRS: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలినమన్న కేంద్రమంత్రి బండి సంజయ్, కేసీఆర్‌కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ అని కామెంట్

Arun Charagonda

కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంజయ్... కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలనం తర్వాత కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అన్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న పార్టీ కాంగ్రెస్‌ది అన్నారు. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు.

MLA Paritala Sunitha: పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత, నేల తల్లికి పూజలు...వీడియో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత రైతుగా మారారు. వెంకటాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్బంగా నేల తల్లికి పూజలు చేశారు. అనంతరం తోటి కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు పరిటాల సునీత

CM Revanth Reddy On BRS: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా, కేసీఆర్ గవర్నర్ అవుతారన్న సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఏ పదవో తెలుసా?

Arun Charagonda

బీజేపీ - బీఆర్ఎస్ విలీనంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్..మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం పక్కా అని తేల్చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నలుగురు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారు.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్ వస్తుందని జోస్యం చెప్పారు.

Advertisement
Advertisement