News

Andhra Pradesh: నంద్యాల స్కూల్‌లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థుల అస్వస్థత, స్కూల్‌ యాజమాన్యంపై అధికారుల సీరియస్!

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల SDR స్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విషయాన్ని గోప్యంగా ఉంచిన స్కూల్ యజమాన్యంపై ఉన్నత అధికారులు సీరియస్ అయ్యారు.

Slow Chewing: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తింటున్నారా? అయితే, మధుమేహానికి బైబై చెప్పినట్టే!

Rudra

షుగర్ వ్యాధి ఇప్పుడు అందర్నీ కలవరానికి గురి చేస్తుంది. అయితే, ఆహారం నెమ్మదిగా నమిలి.. తీరిగ్గా తినడం వల్ల డయాబెటిస్‌ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Srisailam Project: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనంలో విషాదం.. వరదలో తెలంగాణ వ్యక్తి గల్లంతు (వీడియో)

Rudra

నల్లగొండ జిల్లా వెంకటాపురానికి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి వచ్చారు. శ్రీశైలం జలాశయంలో లింగాలగట్టు పెద్ద బ్రిడ్జ్‌ కింద స్నానానికి వెళ్లిన యాదయ్య వరద ఉధృతికి అందరూ చూస్తుండగానే నీటిలో గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

CM Revanth Reddy: సీఎం రేవంత్‌కి ఆగస్టు గండం?, రేవంత్ అమెరికాకు వెళ్లొచ్చేలోపు సీఎం పదవి పోతుంతా, బీఆర్ఎస్ నేతల ధీమా ఏంటీ?

Arun Charagonda

ఆగస్టు సంక్షోభం..ఈ పేరు వింటేనే గుర్తకొచ్చేది టీడీపీ. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొన్న నెల ఆగస్టు. చాలా సంఘటనలు ఆగస్టులోనే రావడంతో ఆ పార్టీ నేతలకు ఆగస్టు అంటేనే వణికిపోతారు. ఎందుకంటే ఎన్టీఆర్‌ సీఎంగా ఉండగా, రెండు సార్లు ఆగస్టు నెలలోనే పదవీ గండం ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ఆగస్టు సంక్షోభం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఉందా, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంతా?,రేవంత్‌కు సర్కార్ పడిపోవడం గాసిపేనా చూడాలి.

Advertisement

Nayanthara, Vignesh Shivan: వయనాడ్ విషాదం.. న‌య‌న‌తార, విఘ్నేశ్ దంపతుల దాతృత్వం.. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా రూ. 20 ల‌క్ష‌లు అంద‌జేత‌

Rudra

కేరళలో వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ ఘటన యావత్‌ దేశాన్ని కలిచి వేస్తోంది. విలయంలో సర్వం కోల్పోయి సాయం కోసం బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Osmania Hospital: ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం.. గోషామహల్ పోలీస్ క్వార్టర్స్‌ లో 30 ఎకరాల స్థలంలో నిర్మాణం.. శాసనసభలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి

Rudra

హైదరాబాద్‌ లోని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి భవనంపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించి, ప్రస్తుత భవనాన్ని వారసత్వ భవనం (హెరిటేజ్ బిల్డింగ్)గా మారుస్తామని ప్రకటించింది.

Viral Video: విషాదం వెంట మరో ప్రమాదం.. తాటి చెట్టుకు ఉరి వేసుకొని గీత కార్మికుడి ఆత్మహత్య.. మృతదేహాన్ని దించుతుండగా పట్టుతప్పి కిందనున్న వ్యక్తిపై పడ్డ డెడ్ బాడీ.. తర్వాత ఏమైంది..? (వీడియో)

Rudra

తాటి చెట్టుకు ఉరి వేసుకొని ఓ గీత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని డెడ్ బాడీని చెట్టు నుంచి కిందకు దించుతున్న సమయంలో పట్టుతప్పిన ఆ మృతదేహం కిందనున్న వ్యక్తిపై పడింది.

Cockroach Found in Biryani: బిర్యానీలో బొద్దింక దర్శనం.. హైదరాబాద్ పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌ లో ఘటన (వీడియో)

Rudra

ఆహార నాణ్యత, శుభ్రత విషయంలో హైదరాబాద్ హోటల్స్ ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే, ప్రఖ్యాత హోటల్స్ లో మురిగిపోయిన, పురుగులు పడిన ఆహారాన్ని వడ్డించిన ఉదంతాలు బయటపడిన వేళ.. తాజాగా పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్‌ లో వడ్డించిన ఓ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది.

Advertisement

Miss Universe India Contestant: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు

Rudra

ఏపీలోని కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుంచి ఆమె అర్హత సాధించారు.

Telugu Biggboss Season 8: బిగ్ బాస్ సీజ‌న్ 8 టీజ‌ర్ వ‌చ్చేసింది! ఈ సీజ‌న్ లో కంటెస్టెంట్లు ఎవ‌రెవ‌రంటే?

VNS

సీజన్ 8కు కూడా హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) క‌నిపించ‌బోతున్నారు. అయితే ఈ సీజ‌న్ 8 డేట్ మాత్రం అనౌన్స్ చేయ‌లేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

New Excise Policy In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నూత‌న మ‌ద్యం విధానం కోసం 6 రాష్ట్రాల్లో అధ్య‌య‌నం, బెస్ట్ పాల‌సీ కోసం బృందాల‌ను పంపిన ప్ర‌భుత్వం

VNS

ఆరు రాష్ట్రాల్లో అధ్యయనం కోసం నాలుగు బృందాలను(Four Teams) ఏర్పాటు చేసింది. నాటి వైసీపీ ప్రభుత్వం(YCP Government) మద్యం కొనుగోలు, విక్రయాల్లో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, జే బ్రాండ్‌ (J Brand) తో నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారని కూటమి నేతలు ఆరోపించారు.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో కొన‌సాగుతున్న హాకీ జ‌ట్టు జైత్ర‌యాత్ర‌, చివ‌రి గ్రూప్ మ్యాచ్ లోనూ విజ‌యం సాధించిన టీమ్ ఇండియా

VNS

పారిస్ ఒలింపిక్స్‌ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో భారత హాకీ (Indian Men's Hockey Team) జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 3-2 తేడాతో విజయ ఢంకా మోగించింది. 1972 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్‌ (India) ఓడించడం ఇదే మొదటిసారి. పూల్‌ బీ నుంచి భారత్‌తో పాటు బెల్జియం, ఆసీస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.

Advertisement

Devara Second Single: ప్రమోష‌న్స్ వేగం పెంచిన దేవ‌ర‌, పూర్తిగా ల‌వ‌ర్ బాయ్ లా మారిపోయిన జూనియ‌ర్ ఎన్టీఆర్, దేవ‌ర నుంచి సెకండ్ సింగిల్ విడుద‌ల డేట్ ఖరారు

VNS

విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ఫ‌స్ట్ సింగిల్ ఫియర్‌ సాంగ్ (Fear song) విడుద‌ల చేయ‌గా.. యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను ఆగ‌ష్టు 05న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో మ‌రో ప‌త‌కం దిశ‌గా భార‌త్, ఆర్చ‌రీలో సెమీస్ కు దూసుకెళ్లిన ధీర‌జ్, అంకిత జోడీ

VNS

హోరాహోరీగా సాగిన నాలుగు సెట్ల పోరులో స్పెయిన్ జంట‌పై ధీర‌జ్, అంకిత ద్వ‌యం 37-36తో గెలుపొందింది. చివ‌రి సెట్‌లో చివ‌రి సెట్‌లో ధీర‌జ్ అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తూ వ‌రుస‌గా 10, 10 పాయింట్లు సాధించాడు. అంకిత సైతం వ‌రుస‌గా 9, 8 పాయింట్లతో మెరిసింది.

Danam Nagender Comments Row: తాను చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేసిన దానం నాగేందర్, వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన, తన పనితీరు గురించి అందరికీ తెలుసని వెల్లడి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై తెలంగాణ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ అంశంపై దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఆయన మాట్లాడటంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశమివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు

Telangana Job Calendar: తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటన, పూర్తి వివరాలివే, చివరి రోజు కీలక బిల్లులకు అమోదం,అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు పలు కీలక బిల్లులకు అమోదం తెలిపింది ప్రభుత్వం. ప్రధానంగా చివరి రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటన, ధరణి పేరు భూమాతగా మార్చడం, మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో మీమ్స్ చేసిన వారిపై చర్యలు వంటి వాటితో వాడివేడిగా సాగింది.

Advertisement

Telangana Politics: దానం నాగేందర్ బూతుల వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన నాగేందర్

Hazarath Reddy

అసెంబ్లీలో నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్ కాదు, జనాలకు రాంగ్ మెసేజ్ పోతుంది.. ఎమ్మెల్యే దానం నాగేందర్ బేషరతుగా అతని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

Telangana Shocker: నిర్మల్ జిల్లాలో దారుణం, మద్యం మత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపేసిన కొడుకు,తాగి వచ్చి ఇంట్లో గొడవెందుకు చేస్తున్నావని అడగటమే కారణం

Hazarath Reddy

నిర్మల్ జిల్లా : కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామానికి చెందిన కుడిమెత అనిల్ నిత్యం మద్యం సేవించి ఇంట్లో గొడవ పెడుతున్నాడని తండ్రి కుడిమెత మధు మందలించాడు. ఈ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.

MLA Danam Nagender: అసెంబ్లీలో బూతులతో రెచ్చిపోయిన దానం నాగేందర్, తోలు తీస్తా, బయట తిరగనియ్య అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు.

Road Accident Video: గుంటూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, వేగంగా వస్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై టైర్ కు పంచర్ వేయించేందుకు లారీని రోడ్డుపై ఆపారు. ఈ క్రమంలో గుంటూరు నుండి వేగంగా వస్తున్న ఓ కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు

Advertisement
Advertisement