వార్తలు

KCR Key Comments: అగ్నిపర్వ‌తంలా ర‌గిలిపోతున్నా! రాజ‌కీయ క‌క్ష‌తోనే నా కుమార్తెను జైల్లో పెట్టారు, బీఆర్ఎస్ఎల్పీ స‌మావేశంలో కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

VNS

తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ (BRSLP) సమావేశమైంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ నేపథ్యంలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

Union Budget 2024: ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చి అమరావతికి రూ.15 వేల కోట్లు ఇస్తాం, అప్పుగా ఇస్తున్నారా, నిధులా అనే అంశంపై స్పష్టత ఇచ్చిన నిర్మలా సీతారామన్

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాజధాని అమరావతికి రూ 15 వేల కోట్లు కేంద్రం కేటాయించడం తెలిసిందే. అయితే, ఈ రూ.15 వేల కోట్లు అప్పు రూపంలో ఇస్తున్నారా, లేక నిధులా? అనే విషయంలో స్పష్టత లేదు. అయితే, ఇవాళ ఢిల్లీలో బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు

Mumbai: వీడియో ఇదిగో, రైలులో ట్రాన్స్‌జెండర్లు సరికొత్త దందా, UPI ద్వారా డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్, వీడియోపై రైల్వే శాఖ స్పందన ఏమిటంటే..

Vikas M

ముంబై లోకల్ ట్రైన్‌లో క్యూఆర్ స్కానర్‌ని ఉపయోగించి ట్రాన్స్‌జెండర్ వ్యక్తి డబ్బును స్వీకరించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రాన్స్‌పర్సన్ UPI ద్వారా రైలులో అందర్నీ డబ్బులు అడుగుతున్న వీడియోని @mumbairailusers అనే X హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడింది. వీడియోలో లింగమార్పిడి బిచ్చగాడు డబ్బులు అడుగుతున్నాడని వెల్లడించింది

Sudan: దారుణం, గుప్పెడు మెతుకుల కోసం సైనికులతో సెక్స్‌లో పాల్గొంటున్న సూడాన్ మహిళలు, శృంగారంలో పాల్గొనని మహిళలకు తీవ్ర హింసలు

Vikas M

యుద్ధంతో అతలాకుతలమైన సూడాన్‌లోని ఓమ్‌దుర్మాన్ నగరంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య మహిళలు తమ మనుగడ కోసం పోరాడుతున్న సమయంలో వేధింపులను కూడా భరించవలసి వస్తోంది.

Advertisement

Narsapuram MPDO Death Case: ఏలూరు కాల్వలో లభ్యమైన నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణ మృతదేహం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వారం రోజుల నుండి కనపడకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణ కథ విషాదంగా ముగిసింది. తాజాగా ఆయన మృతదేహం ఏలూరు కాల్వలో లభ్యమైంది.

Vijayasai Reddy on TDP: రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం? వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపాటు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోందంటూ..

Hazarath Reddy

ఏపీలో దాడులపై ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘టీడీపీ వాళ్లు నడిరోడ్డు మీద పట్టపగలే వైఎస్సార్‌సీపీ వారిని హతమారుస్తుంటే, వాటిని గురించి మాట్లాడకుండా.. హంతకులు కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు.

Andhra Pradesh: వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌ పిటిషన్, అప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది.

Andhra Pradesh Assembly Session: వివేకా హత్య కేసుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రేపటి నుంచి మరో 3 శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెడతామని స్పష్టం

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్‌ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు.

Advertisement

No Re-Test for NEET-UG Exam 2024: నీట్ పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులు పాలవుతారు, మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

నీట్‌-యూజీ పరీక్ష (NEET-UG exam) ను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ లోపం వల్ల కేవలం 155 మంది అభ్యర్థులు లబ్ధి పొందారని ధర్మాసనం తెలిపింది

CM Revanth Reddy on Budget: ప్రధాని మోదీకి ఎందుకింత కక్ష, బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్-2024పై తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందని మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం కక్ష సాధించినట్లుందని.. బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

CM Chandrababu on Budget: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ‌కు ఆక్సిజన్ ఈ బడ్జెట్, యూనియన్ బడ్జెట్‌పై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

కేంద్ర బడ్జెట్‌లో (Budget 2024) ఏపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrabau Naidu)ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి కోసం బడ్జెట్‌లో పెట్టారన్నారు.

Techie Suicide in Sangareddy: ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సూసైడ్ లెటర్

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లా కొల్లూరు పి ఎస్ పరిధిలోని BHEL విద్యుత్తు నగర్ లో కిరణ్ (25) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కారణాలు ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది

Advertisement

Theft Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద మహిళ మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయిన దొంగలు

Hazarath Reddy

తెలంగాణలో నిర్మల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ముసుగులో వచ్చి నిర్మల్‌లోని మయూరి హోటల్ దగ్గర నడుస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసుకి లాక్కెళ్లిపోయారు. దీనికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. వీడియోలో మహిళ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో నుంచి చైన్ లాక్కుని పరార్ అయ్యారు.

Telangana Shocker: వీడియో ఇదిగో, పుల్లుగా మందు తాగి స్కూలుకు వచ్చిన హెడ్ మాస్టర్, అడిగినందుకు గ్రామస్తులపై బూతులతో విరుచుకుపడిన తాగుబోతు...

Hazarath Reddy

ములుగు - వాజేడు మండలం ధర్మవరం గ్రామంలోని ఆధార్ అప్డేట్ ఫారం పై సంతకం పెట్టించడానికి కొంతమంది గ్రామస్తులు వెళ్లగా మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన గెజిటెడ్ హెడ్మాస్టర్, గ్రామస్తులపై దుర్భాషలాడాడు

Farmer Suicide in Telangana: వీడియో ఇదిగో, అప్పులు కట్టలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య, భూమిని అమ్మితే కొడుకు ఏమవుతాడోననే బెంగతో..

Hazarath Reddy

నిర్మల్ - కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కూతురి పెండ్లి మరియు ఇల్లు కట్టడానికినికి రూ.25 లక్షల వరకు అప్పు అయింది. తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు.

Telangana Shocker: వీడియో ఇదిగో, ఆరేళ్ల బాలికపై అత్యాచారం, తీవ్ర రక్తస్రావం కావడంతో చాపలో చుట్టిన నిందితుడు, పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Hazarath Reddy

శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారి పై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో బాలికను చాపలో చుట్టివేశాడు నిందితుడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని చితగ్గొట్టి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Telangana: తీవ్ర విషాదం, మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో రైతు మృతి

Hazarath Reddy

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వద్దే నరసింహులు (21) ట్రాక్టర్తో తన పొలం దున్నాడు. తర్వాత కాల్వపై ఉన్న మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ స్తంభానికి తగిలి.. షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.

Telangana Shocker: ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసేవాళ్లు ఈ వీడియో చూడండి, ప్లాస్టిక్ పట్టీ సాయంతో మీ డబ్బులను స్మార్ట్‌గా దొంగిలిస్తున్న మైనర్లు

Hazarath Reddy

వరంగల్ జిల్లాలో బట్టల షాపులో పనిచేయడానికి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన శుభం, అతని గర్ల్ ఫ్రెండ్ జల్సాల కోసం ఏటీఎంలో డబ్బులు వచ్చే దగ్గర ప్లాస్టిక్ పట్టీని పెట్టి ఫేవిక్విక్ తో అంటించి వెళ్లేవారు.. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన వారు డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్ళిపోయేవారు.

Telangana Assembly Session: ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, 25వ తేదీన బ‌డ్జెట్, ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిప‌ట్ల శాస‌న‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. ఆమె మృతికి సంతాపంగా స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం స‌భ‌ను బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు.

Andhra Pradesh Assembly Session: రెండు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం రెండు కీలక బిల్లులను శాసనసభ ముందుకు తీసుకొచ్చింది. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022) రద్దు, ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించారు.

Advertisement
Advertisement