New Delhi, July 13: యమునానదిలో వరద (Yamuna Flood) ఉధృతి పెరిగింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు (Holiday for schools) ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. యమునా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో...పరివాహక ప్రాంతాల్లో భారీగా వరద పెరిగింది. 45 ఏళ్ల రికార్డును యమునా నది తుడిచి పెట్టేసింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం (Delhi Floods) అయ్యాయి.
"Closing all government and private schools in the areas where there is water-logging," tweets Delhi CM Arvind Kejriwal pic.twitter.com/QI5QihxMGh
— ANI (@ANI) July 13, 2023
ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో కురిసిన వర్షం కారణంగా విద్యాసంస్థలను మూసేశారు. తాజాగా వరద ఉధృతి తగ్గకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.