Adhir Ranjan on Modi (PIC@ Twitter)

New Delhi, AUG 10: అవిశ్వాస తీర్మానంపై (No Confidence Motion) చ‌ర్చ సంద‌ర్భంగా పార్ల‌మెంట్‌లో మోదీ స‌ర్కార్‌పై విప‌క్ష నేత‌లు విరుచుకుప‌డ్డారు. లోక్‌స‌భ‌లో గురువారం కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజ‌న్ చౌధ‌రి (Adhir Ranjan) ప్ర‌ధాని మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోదీని నీర‌వ్ మోదీతో (Nirav Modi) పోల్చ‌డం స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళానికి దారితీసింది. బ్యాంకుల‌కు వేల కోట్లు లూటీ చేసి పారిపోయిన నీర‌వ్ మోదీ గురించి అధిర్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. వ్యాపార‌వేత్త నీర‌వ్ మోదీ దేశం విడిచి పారిపోలేద‌ని, కానీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రూపంలో మౌనంగా ఉన్న‌ట్లు అధిర్ ఆరోపించారు.

అధీర్ వ్యాఖ్య‌ల‌పై హోంమంత్రి అమిత్ షా అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో ప‌లువురు బీజేపీ ఎంపీలు త‌మ స్ధానాల నుంచి నిల‌బ‌డి నిర‌స‌న తెలిపారు. అధీర్ రంజ‌న్ త‌న ప్ర‌సంగం కొన‌సాగిస్తూ ప్ర‌ధాని మోదీ మ‌ణిపూర్ అంశంపై మాట్లాడాల‌ని విప‌క్షం కోరుకుంటోంద‌ని అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం వ‌ల్ల‌నే ప్ర‌ధాని మోదీ విధిలేని ప‌రిస్ధితిలో ఇవాళ పార్ల‌మెంట్‌కు వ‌చ్చార‌ని పేర్కొన్నారు.

Modi is Most Popular PM: స్వాతంత్య్రం పొందిన తర్వాత ప్రజల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ, అవిశ్వాస తీర్మానంపై చర్చలో అమిత్ షా 

ప్ర‌ధాని స‌భ‌కు వ‌చ్చి మ‌ణిపూర్‌పై మాట్లాడాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌రోవైపు కాంగ్రెస్ ఎంపీ ర‌ణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా పార్ల‌మెంట్ వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ ప్ర‌ధాని మోదీపై విరుచుకుప‌డ్డారు. మోదీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను మోదీ ఎన్నిక‌ల క‌మిష‌న్‌గా మార్చాల‌ని కోరుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.