New Delhi, April 13: దేశంలో కరోనా (Corona Cases) విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10వేల 158 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 230 రోజుల్లో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో యాక్టీవ్ కేసుల (Corona Active Cases) సంఖ్య 44, 998కు చేరాయి. అయితే మరో 12 రోజుల పాటూ కేసుల సంఖ్య ఇదేస్థాయిలో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కొత్త కేసులు తగ్గుతాయని స్పష్టం చేస్తున్నారు. దేశంలో కరోనా ప్రస్తుతం ఎండెమిక్ దశకు చేరుకుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీతో పాటూ పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 4.42 శాతంగా నమోదు కాగా.. వారం వారీగా పాజిటివిటీ రేటు 4.02 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.10శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 రికవరీ రేటు 98.71శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19శాతం నమోదైంది.
Covid-19 | India reports 10,158 new cases in last 24 hours; the active caseload stands at 44,998
(Representative Image) pic.twitter.com/yS0pdGdjbf
— ANI (@ANI) April 13, 2023
దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్, దాని ఉపరకమైన ఎక్స్‌బీబీ.1.16 కారణంగా కేసుల సంఖ్య పెరుగుదల వేగంగా ఉంది. అయినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు పెరుగుతున్నట్లు ఆధారాల్లేవని పేర్కొన్నారు. అధికారుల అంచనా ప్రకారం.. దేశంలో కరోనా ఉద్ధృతి మరో పన్నెండు రోజులు మాత్రమే ఉంటుంది.