Kolkata, March 14: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహిస్తున్నది. భూ ఆక్రమణ కేసుతో టీఎంసీ బహిష్కృత నేత, సందేశ్‌ఖాలీ (Sandeshkhali) ఘటన నిందితుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) ప్రమేయంపై ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30 గంటల నుంచి షాజహాన్‌కు చెందిన ఇటుక బట్టితోపాటు ధమఖలీ అనే ప్రాంతంలో సోదాలు చేస్తున్నారు. గతంలో తనిఖీలకు వెళ్లిన బృందాలపై దాడులు జరిగిననేపథ్యంలో సందేశ్‌ఖాలీలో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. మహిళా బలగాలను కూడా రంగంలోకి దింపారు.
#WATCH | West Bengal: ED conducts raids at multiple locations in Sandeshkhali in connection with a land-grabbing case against arrested expelled TMC leader Sheikh Shahjahan. pic.twitter.com/QEH2RU5rRm
— ANI (@ANI) March 14, 2024
రేషన్ పంపిణీ కుంభకోణాన్ని విచారించేందుకు వెళ్లిన సందర్భంలో ఈడీ అధికారులపై గత నెల 5న షేక్ షాజహాన్, అతని అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్కడి మహిళలను టార్గెట్ చేస్తూ టీఎంసీ గుండాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మహిళలు షేక్ షాజహాన్, ఇతర టీఎంసీ నేతలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సందేశ్‌ఖాలీ పేరు మారుమోగింది. ఈ ఘటనల తర్వాత షేక్ షాజహాన్ 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు. సీబీఐ, ఈడీ లేదా పోలీసులు అతన్ని అరెస్టు చేయవచ్చని కలకత్తా హైకోర్టు ఆదేశించిన ఒక రోజు తర్వాత బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కాగా, ఈడీ బృందంపై దాడికేసులో షాజహాన్ సోదరుడు షేక్ ఆలంగిర్‌కు సీబీఐ నోటీసులు జారీచేసింది. అతనితోపాటు మరో ఏడుగిరి కూడా తాఖీదులు ఇచ్చింది. కోల్‌కతాలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది.