Fire Accident in Thane: మహారాష్ట్రలో అర్దరాత్రి ఘోర అగ్నిప్రమాదం, పత్తిగోదాములో ఎగిసిపడ్డ మంటలు, ఇద్దరు సజీవ దహనం

మహారాష్ట్రలోని థానే (Thane) నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో (Cotton Godown) మంటలు రాజుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. అగ్నిప్రమాదం (Fire Accident) గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Fire Accident in Thane: మహారాష్ట్రలో అర్దరాత్రి ఘోర అగ్నిప్రమాదం, పత్తిగోదాములో ఎగిసిపడ్డ మంటలు, ఇద్దరు సజీవ దహనం
Fire Accident in Thane (PIC@ ANI X)

Thane, NOV 08: మహారాష్ట్రలోని థానే (Thane) నగరంలో మంగళవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. థానే నగర పరిధిలోని భీవాండిలోని పత్తి గోదాములో (Cotton Godown) మంటలు రాజుకున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. అగ్నిప్రమాదం (Fire Accident) గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

పత్తి గోదాములో అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. థానే పోలీసులు కూడా రంగంలోకి దిగి అగ్నిప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

(The above story first appeared on LatestLY on Nov 08, 2023 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).