Noida, June 11: ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు (Heart Attack) పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అంతా గుండెపోటు బారిన పడుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, హెల్తీగా ఫిట్ గా ఉన్న వారు సైతం హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ (Playing Badminton) ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. సెక్టార్ 21ఏలో ఈ ఘటన జరిగింది. మహేంద్ర శర్మ అనే వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాడ్మింటన్ (Heart Attack While Playing Badminton) ఆడుతున్నారు. ఇంతలో సడెన్ గా ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
10 June 23 : 🇮🇳 : A 50-year-old man died of a heart attack💉 while playing badminton in Noida. An attempt was made to save him on the badminton court but could not survive.#heartattack2023 #TsunamiOfDeath pic.twitter.com/wTAF2BmAe2
— Anand Panna (@AnandPanna1) June 10, 2023
సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆయనను బతికించేందుకు సీపీఆర్ చేశారు. తీవ్రంగా శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. శర్మ చనిపోయారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలు.. వీటి కారణంగా గుండెపోట్లు పెరిగిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ రావడానికి కారణాలు ఇవే అన్నారు. జబ్బులతో బాధపడుతున్న వారే కాదు.. ఆరోగ్యంగా ఉన్న వారు, యువకులు, చివరికి చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.