New Delhi, JAN 20: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొత్త పార్లమెంట్‌కు చెందిన లేఅవుల్, ఫోటోలను ప్రభుత్వం రిలీజ్ చేసింది. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ సముదాయ బిల్డింగ్‌లను బడ్జెట్ సెషన్ రెండవ భాగంలో ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. మార్చిలో ఈ బిల్డింగ్‌లను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రణాళికలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని (New Parliament Building) నిర్మిస్తున్నారు. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ పనులు చేపడుతోంది.
అత్యంత విశాలమైన హాల్స్, లైబ్రరీతో పాటు పార్కింగ్‌కు కావాల్సినంత స్థలాన్ని కల్పిస్తున్నారు. హాల్స్, ఆఫీసు రూములన్నీ ఆధునిక టెక్నాలజీకి తగ్గట్టు నిర్మించారు.
కొత్త పార్లమెంట్ భవనంలో 888 సీట్లు కెపాసిటీతో లోక్‌సభ హాల్‌ను నిర్మించారు. ఇక రాజ్యసభ హాల్‌ను (Rajyasabha Hall) లోటస్ థీమ్ తరహాలో నిర్మించారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునే రీతిలో దీన్ని కట్టారు.
ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనాల సమీపంలోనే కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌ను (New Parliament Building) నిర్మించారు. కొత్త బిల్డింగ్ 65వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అన్ని హంగులతో కాన్స్‌టిట్యూషన్ హాల్‌ను తీర్చిదిద్దారు. లేటెస్ట్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీతో అన్ని ఆఫీసుల్ని నిర్మించారు. కమిటీ రూముల్లో అత్యాధునిక ఆడియో విజువల్ సిస్టమ్స్ ఉంటాయి.