IBM building in Bengaluru (Photo/wikipedia)

New Delhi, May 02: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో (Artificial Intelligence) ఉద్యోగాలు ఊడుతాయన్న నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. రానున్న మూడేళ్లలో భారీగా ఉద్యోగాలకు కోతపడే అవకాశముంది. తాజాగా ఇంటర్నేషన్ బిజినెస్ మిషన్స్ (IBM) సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో కొత్త ఉద్యోగాల నియమాకాలను నిలిపివేయాలని నిర్ణయించింది. దాదాపు 30 శాతం ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence) ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. ఏఐ ద్వారా 7800 జాబ్స్ ను రీప్లేస్ చేయాలని చూస్తోంది. ముఖ్యంగా బ్యాక్ ఆఫీస్ జాబ్స్ ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) స్పష్టత ఇచ్చారు.

ప్రస్తుతం ఐబీఎంలో 2లక్షల 60వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. తాజాగా ఆర్ధికమాంద్యం ఎఫెక్ట్‌ తో పలువురు ఉద్యోగులకు ఉద్వాసన పలికింది ఐబీఎం. కానీ మళ్లీ రిక్రూట్‌మెంట్ జరుపలేదు. దీంతో రానున్న రోజుల్లో ఉద్యోగుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలకు బలం చేకూరింది.