New Delhi, NOV 26: ప్రపంచాన్ని వణించిన కోవిడ్ -19 మహమ్మారిని మర్చిపోక ముందే రకరకాల వైరస్ లు (New Virus Cases) పుట్టుకొస్తున్నాయి. చైనాలో మరో మిస్టీరియస్ వైరస్ (New Virus Cases) కలకలం రేపుతోంది. ఇది కూడా కోవిడ్ తరహాలో విరుచుకుపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ (India On Alert) అయ్యింది. కోవిడ్ తరహాలో చైనాలో మిస్టీరియస్ న్యుమోనియా వైరస్ విజృంభిస్తోంది. సౌత్ చైనాలో ముఖ్యంగా పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి గణనీయంగా ఉంది. అక్కడి ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో వీరు ఇబ్బంది పడుతున్నారు. ఈ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనాను వివరణ కోరింది.
An unexplained surge in respiratory illnesses, particularly affecting children in China, has prompted the World Health Organization (WHO) to request more information from the country on the outbreak ⤵️ pic.twitter.com/1ZHiGRhehh
— Al Jazeera English (@AJEnglish) November 25, 2023
మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ప్రజలు పరిశుభ్రంగా ఉండాలని, వైద్యుల సూచనలు పాటించాలని సూచించింది. ఈ కొత్త వైరస్ వ్యాప్తికి గల కారణాలపై చైనా ఆరోగ్య అధికారులు అంతర్జాతీయ నిపుణుల సహకారంతో ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ కోవిడ్-19 ను పోలి ఉన్నప్పటికీ దీనికి మూలం మాత్రం కరోనా వైరస్ అని ప్రాథమిక పరీక్షలు నివేదిస్తున్నాయి. ప్రస్తుతం ప్రయాణాలపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ ఈ కేసులు మాత్రం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చైనాలో కొత్త వైరస్ కలకలం నేపథ్యంలో భారత్ అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే సమీక్ష నిర్వహించాలని సూచించింది. ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లపై దృష్టి పెట్టాలని కేంద్ర వైద్యశాఖ లేఖ రాసింది.