Panaji, March 25: లోక్‌సభ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ (BJP) విడుతల వారీగా ప్రకటిస్తున్నది. తాజాగా మరో 111 మందితో జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామివేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపోను (Pallavi Dempo) సౌత్ గోవా నుంచి బరిలోకి దింపింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మొదటి మహిళగా 49 ఏండ్ల డెంపో నిలిచారు. ప్రస్తుతం సౌత్ గోవా ఎంపీగా (South goa) కాంగ్రెస్ నేత ఫ్రాన్సిస్కో సర్దిన్హా ఉన్నారు.
I extend my heartiest congratulations to Smt. Pallavi Dempo on her nomination as the @BJP4India Candidate for the South Goa Lok Sabha constituency.
I am confident that her fresh perspective and representation of the Nari Shakti under the dynamic leadership of Hon'ble PM Shri… pic.twitter.com/zCxBxibgWG
— Dr. Pramod Sawant (Modi Ka Parivar) (@DrPramodPSawant) March 24, 2024
1962 నుంచి ఇప్పటి వరకు ఆ స్థానంలో 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించింది. పల్లవి డెంపో.. పుణెలోని ఎంఐటీ నుంచి కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పట్టా కూడా అందుకున్నారు. ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది.
#WATCH | Goa: BJP releases 5th list of candidates for the upcoming Lok Sabha elections.
On her candidature from South Goa, Pallavi Shrinivas Dempo says, "I am grateful to the BJP for this nomination and I accept this in deep humility... We will try our level best to win this… pic.twitter.com/7vDWZnecva
— ANI (@ANI) March 24, 2024
వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్‌టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. ఆమె భర్త శ్రీనివాస్ డెంపో.. ఆయన ప్రస్తుతం గోవా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్‌కు (GCCI) అధిపతిగా కొనసాగుతున్నారు.