Bhopal, AUG 17: జైళ్లు ఖైదీల్లో మార్పు తీసుకురావటం లేదు. చేసిన నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించినా ఖైదీలో మార్పు రాకపోగా, గతంలో చేసిన నేరమే మళ్లీ చేశారు. ఓ బాలికపై అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన దోషి, జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ అయిదేళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. రాకేష్ వర్మ అలియాస్ రక్కు 2012వ సంవత్సరంలో కోల్గ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. (commits same crime on another minor) ఈ కేసులో దోషిగా తేలడంతో రాకేష్ వర్మకు కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించిందని పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర సింగ్ చౌహాన్ తెలిపారు. అయితే జైలులో సత్ప్రవర్తన కారణంగా మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేసి 18 నెలల క్రితమే అతన్ని జైలు నుంచి విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.
జైలు నుంచి విడుదలైన ఏడాదిన్నర తర్వాత నిందితుడు రాకేష్ వర్మ మరో మైనర్ బాలికపై అదే నేరానికి పాల్పడ్డాడు. నిందితుడు రాకేష్ వర్మ అలియాస్ రక్కు బాలికకు మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టినట్లు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధిత బాలిక కనిపించకుండా పోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది.
కొంత దూరంలో రక్తసిక్తమైన స్థితిలో బాలిక కనిపించింది. రెండు గంటలపాటు వెతికిన తర్వాత బాధిత బాలిక ఆచూకీ లభించింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో చేరి అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆమెను రేవాలోని సంజయ్ గాంధీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదికల్లో తేలిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడు రాకేష్ వర్మ బాలికపై అత్యాచారం చేసి ఆటోలో పారిపోవడంతో అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.