Dhoni Violating Advertisement Rules (PIC@ Instagram)

New Delhi, May 18: టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీకి (M.S. Dhoni) అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే ఫాలోయింగ్‌తో పలు రకాల యాడ్స్‌లో నటిస్తున్నారు ధోనీ. ఇప్పటికే పలు బ్రాండ్లకు అంబాసిడర్‌ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు చాలా రకాల యాడ్స్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే ధోనీ మెడకు చుట్టుకుంది. ఆయన ప్రమోట్ చేస్తున్న కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోకుండానే యాడ్స్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Advertising Standards Council of India) లెక్కల ప్రకారం ప్రకటన నిబంధనలను (Violating Advertisement Rules) ఉల్లంఘిస్తున్నవారిలో ధోనీ తొలిస్థానంలో ఉన్నారు.

కేవలం ధోని మాత్రమే కాదు చాలా మంది సెలబ్రెటీలు తాము ప్రమోట్ చేస్తున్న కంపెనీల విశ్వసనీయతను నిరూపించడంలో విఫలమవుతున్నారు. ఇందులో ధోనీతో పాటూ య్యూటబర్ భువన్ బామ్ రెండో స్థానంలో ఉన్నారు. కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేసినా, యాడ్‌ లో నటించినా కూడా ఆ కంపెనీ విశ్వసనీయతను బలపరుస్తూ రుజువులు ఇవ్వాలి. కానీ ధోని చేస్తున్న ప్రమోషన్లలో అలాంటిది కనిపించడం లేదు. ఆయన మాత్రమే సెలబ్రెటీలు చేసే యాడ్స్‌ లో 97 శాతం ఇలాగే ఉన్నాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) తెలిపింది.