New Delhi, June 28: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ మెకానిక్‌గా మారారు. పానా, స్క్రూడ్రైవర్ చేతపట్టి బైక్‌ను ఎలా బాగుచేయాలో తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి ఢిల్లీలోని (Delhi) కరోల్ బాగ్ (Karol Bagh) సైకిల్ మార్కెట్‌లోని ఓ బైక్ రిపేర్ షాపునకు రాహుల్ వెళ్లారు. ఈసందర్భంగా మోటారు సైకిళ్లను ఎలా రిపేర్ చేయాలో మెకానిక్‌లను అడిగి తెలుసుకున్నారు. వారితో ఇంటరాక్ట్ అయ్యారు. దీంతోపాటు సైకిల్ మార్కెట్‌లోని వ్యాపారులు (Cycle traders), కార్మికులు, బైక్ మెకానిక్‌లతో (Bike mechanics) మాట్లాడారు. ఈ చేతులే భారత్‌ను నిర్మిస్తాయని రాహూల్ అన్నారు.
Congress leader Rahul Gandhi visited the shops of motorcycle mechanics in Karol Bagh, Delhi earlier today.
(Pics: Congress) pic.twitter.com/nnjUoeWbPe
— ANI (@ANI) June 27, 2023
ఈ బట్టలపై ఉన్న మసి మన గర్వానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అలాంటి చేతులతో దృఢంగా నిలబడి వారిని ప్రోత్సహించే పని కేవలం ప్రజా నాయకుడు మాత్రమే చేస్తాడని పేర్కొంది. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో రాహుల్ బైక్ మెకానిక్‌లకు అండగా ఉన్నాడని స్పష్టం చేసింది. కనెక్ట్ ఇండియా ప్రయాణం కొనసాగుతుందని పేర్కొంది. కాగా, ఇటీవల రాత్రి సమయంలో ఓ ట్రక్కులో వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లారీ డ్రైవర్ల కష్ట నష్టాలను గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.