New Delhi, July 21: యువతలో ఇటీవల పెరుగుతున్న ఆకస్మిక మరణాలకు (Sudden Post-COVID-19 Deaths) కరోనా కారణం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) మంత్రి మన్సూక్ మాండవ్య ప్రకటించారు. పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు రవీంద్ర కుశ్వాహ, ఖగెన్ ముర్ములు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మాండవ్య సమాధానం ఇచ్చారు. కరోనా (Corona) తర్వాత చాలా మంది యువత ఆకస్మికంగా మరణిస్తున్నారు. అందులో చాలామందికి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. దీనిపై వారు ప్రశ్నించారు. దాంతో మంత్రి సమాధానం ఇస్తూ ఆ మరణాలకు సంబంధించిన సరైన ఆధారాలు తమ వద్ద లేవని, ఆ మరణాలు ఎందుకు సంభవించాయన్న దానిపై స్పష్టత లేదన్నారు. అయితే కరోనా వల్లనే మరణాలు సంభవించాయన్నది కూడా స్పష్టం చేయలేమన్నారు మన్సూక్ మాండవ్య.
Sudden deaths reported in some youth after Covid. Enough evidence not available to confirm cause of such deaths: Govt to Lok Sabha.
— Press Trust of India (@PTI_News) July 21, 2023
కోవిడ్ విజృంభణ తర్వాత 30 నుంచి 40 ఏండ్లవారిలో అసాధారణ మరణాలు సంభవిస్తున్నాయి. చాలామంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. పలువురు సెలబ్రెటీలు కూడా ఇలాగే హార్ట్ఎటాక్స్ తో ఆకస్మికంగా మరణించారు. వాటన్నింటికీ కరోనా వ్యాక్సిన్, పోస్ట్ కోవిడ్ సమస్యలే కారణమన్న వాదనలు తెరమీదకు వచ్చాయి. అయితే కేంద్రం మాత్రం వాటిని ధృవీకరించడం లేదు.