Credit @ ANI twitter

Coimbatore, NOV 10: కోయంబత్తూరు సిలిండర్‌ బ్లాస్ట్‌ కేసులో (Coimbatore LPG cylinder explosion) నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని (Tamil Nadu ) 45 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది. అనుమానితులు, వారికి సంహకరించిన వారి ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు (NIA raids) నిర్వహిస్తున్నారు. చెన్నైలోని పుడుపెట్‌, మన్నాడి, జమాలియా, పెరంబూరుతోపాటు కోయంబత్తూరు, కొట్టయ్‌మేడు, ఉక్కడం, పొన్విఝా నగర్‌, రతినపురి తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

దీపావళికి ఒకరోజు ముందు అంటే అక్టోబర్‌ 23న ఉదయం 4.30 గంటల సమయంలో తమిళనాడు కోయంబత్తూరులోని కొట్టే సంగమేశ్వర ఆలయం ముందు మారుతి కారులో ఉన్న సిలిండర్‌ పేలిపోయింది (cylinder explosion). ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

Elephants Drink Country Liquor: కుండల కొద్దీ ఫుల్లుగా నాటు సారా తాగి గ్రామస్తులకు చుక్కలు చూపించిన ఏనుగుల గుంపు, వాటిని అడవిలోకి పంపించేసరికి తల ప్రాణం తోకలోకి వచ్చిందంటున్న స్థానికులు 

అయితే పేలుడు సంభవించిన ప్రాంతంలో బేరింగ్‌ బాల్స్‌, గాజుపెంకులు, అల్యూమినియం మేకులు కనిపించండంతో అనుమానాలకు తావిచ్చింది. ఈ పేలుడులో ఉగ్రకోణం ఉందని పోలీసులు నిర్ధారించారు. దీంతో అదేనెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగించింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు యువకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.