representational image (credit- IANS)

New Delhi, Aug 03: కామెరూన్‌లో పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీకి ప్రభుత్వం బ్రేక్ వేసింది. పిల్లల మరణాలకు కారణమైన దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ రీమాన్ ల్యాబ్స్ ను ఆదేశించింది. (bans production of Cough Syrup) దగ్గు మందు తాగి పిల్లలు మరణించిన ఘటన తర్వాత ఇండోర్‌లోని ఎంఎస్ రీమాన్ ల్యాబ్స్‌లో సెంట్రల్ డ్రగ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫలితాల ఆధారంగా రాష్ట్ర డ్రగ్స్ కంట్రోలర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దగ్గు సిరప్ తయారీని నిలిపివేయాలని సంస్థను ఆదేశించారు. (Cough Syrup linked to deaths in Cameroon) ఈ విషయాన్ని తాజాగా ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

Karnataka Tragedy: చార్జింగ్ పిన్‌ నోట్లో పెట్టుకొని 8నెలల చిన్నారి మృతి, కర్ణాటకలో తీవ్ర విషాదం, ఇంట్లో బర్త్‌డే వేడుకలు జరుగుతుండగానే జరిగిన ఘోరం 

కలుషిత దగ్గు సిరప్‌పై మరో డ్రగ్‌మేకర్ లైసెన్స్‌ను భారత్ సర్కారు సస్పెండ్ చేసింది. దగ్గు సిరప్ లో కలుషితమైన డైథెలీన్ గ్లైకాల్ ఉందని పరీక్షల్లో తేలింది. భారతదేశంలో దగ్గు సిరప్ తయారీని నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంచలనం రేపాయి.