New Delhi, FEB 16: భారత్‌లోకి మరో 12 చీతాలు (Cheetahs) అడుగుపెట్టబోతున్నాయి. దక్షిణాఫ్రికా (South Africa) నుంచి మరో 12 చీతాల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, శనివారం దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల్ని తీసుకొస్తారు. మిలిటరీ విమానమైన బోయింగ్ సీ17 (Boing C 17) విమానంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి చీతాల్ని గ్వాలియర్ (Gwaliar) తీసుకొస్తారు. అక్కడ్నుంచి హెలికాప్టర్లలో మధ్య ప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కుకు వీటిని తరలిస్తారు. 12 చీతాల్లో (South Africa) ఏడు మగ చీతాలు కాగా, ఐదు ఆడ చీతాలున్నాయి. వీటిని దక్షిణాఫ్రికాలోని ఫిండా, రూయ్‌బర్గ్ రిజర్వ్స్ నుంచి తీసుకొస్తున్నారు. దశాబ్దాల క్రితమే అంతరించిపోయిన చీతాల్ని దేశంలోకి తిరిగి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నమీబియా నుంచి గత సెప్టెంబర్‌లో ఎనిమిది చీతాల్ని ఇండియా తీసుకొచ్చారు.
12 Cheetahs are being brought from South Africa through Indian Air Force's C-17 Globemaster Cargo plane, on 18th February. The Cheetahs will be released in Kuno National Park, Madhya Pradesh. pic.twitter.com/zhkWpz4Bte
— ANI (@ANI) February 16, 2023
వీటిని ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా దేశంలోకి విడుదల చేశారు. ఇప్పుడు మరో 12 చీతాలు (Cheetahs) దేశంలోకి రాబోతున్నాయి. దక్షిణాఫ్రికా చీతాల్ని ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. కొన్నేళ్లపాటు ప్రతి ఏడాది 10-12 చీతాల్ని ఇండియాకు అందిస్తామని దక్షిణాఫ్రికా తెలిపింది. 12 చీతాలు ఇండియాకు వచ్చిన తర్వాత గతంలో తీసుకొచ్చిన చీతాలకు అనుసరించిన విధానాన్నే ఈసారి కూడా పాటించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదట క్వారంటైన్‌లో ఉంచుతారు.
12 Cheetahs are being brought from South Africa through Indian Air Force's C-17 Globemaster Cargo plane, on 18th February to be released in Kuno National Park, Madhya Pradesh. pic.twitter.com/PDT464qPxf
— ANI (@ANI) February 16, 2023
ఆ తర్వాత పెద్ద ఎన్‌క్లోజర్లలోకి వదులుతారు. ఆ తర్వాత అడవిలోకి వదిలేస్తారు. ప్రస్తుతం ఇక్కడ 20 చీతాలు వరకు ఉండే ఏర్పాట్లున్నాయి. భవిష్యత్తులో 40 చీతాల వరకు ఉండేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే అడవిలోని ఒక చదరపు కిలోమీటర్‌కు 37 ఆహారపు జంతువుల్ని ఉంచారు.