Twitter

మధ్యప్రదేశ్ లో ఓ గిరిజన వ్యక్తిపై  అగ్రకులానికి చెందిన దురహంకార రాజకీయ నేత మూత్ర విసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటన మరువకముందే ఉత్తర ప్రదేశ్ లో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.  ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో దళిత కులానికి చెందిన వ్యక్తిని బలవంతంగా ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి చెప్పులు నాకించుకున్న ఘటన చోటు చేసుకుంది.  ఈ మొత్తం ఘటనను నిందితుడి సహచరుడు కెమెరాలో బంధించగా, వీడియో వెంటనే వైరల్‌గా మారింది. దళిత వ్యక్తిని అవమానించిని నిందితుడిని తేజ్‌బాలీ సింగ్ గా గుర్తించారు. నిందితుడు విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.