Kidnapping Attempt In Haryana (PIC @ Screen Garb From CCTV)

Haryana, JAN 01: కారులో యువతిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు విఫలయత్నం (Kidnapping Attempt) చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో (CCTV) రికార్డయ్యాయి. హరియాణాలోని (Haryana) యమునా నగర్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. జిమ్ కి వెళ్లిన ఓ యువతి అందులో వ్యాయామం చేసి, బయటకు వచ్చి తన కారులో కూర్చుంది. అదే సమయంలో అక్కడకు నలుగురు దుండగులు తమ ప్రణాళిక ప్రకారం వచ్చారు. ఆ యువతి కూర్చున్న కారులోకి ఎక్కారు. అయితే, కారులోని ఆ యువతి ప్రతిఘటించింది. గట్టిగా అరుస్తూ, దుండగులను కొట్టింది. దీంతో భయపడిపోయిన దుండగులు వెంటనే కారులో నుంచి బయటకు వచ్చి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యమునా నగర్ (Yamuna nager) డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చెప్పిన వివరాల ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఆ యువతి కారులోకి ఎక్కి దాని డోర్లు మూసేసి కిడ్నాప్ చేయాలని భావించారు. ఆమెను ఎందుకు అపహరించాలనుకున్నారు? వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారని చెప్పారు. ఈ కేసులో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు.